By: Haritha | Updated at : 26 Jun 2022 09:29 AM (IST)
(Image credit: Youtube)
బిర్యానీ అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ తిని వెళతారు.బిర్యానీ మసాలాను రెడీమేడ్ గా కొని దాచుకునే వారే ఎక్కువ. బిర్యానీ మసాలాను ఇంట్లోనే తయారుచేసుకుని దాచుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే ఏడాది పాటూ నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న బిర్యానీ పొడిని వాడడం వల్ల రుచి కూడా చాలా బావుంటుంది.దీన్ని తయారుచేసుకోవడం చాలా సులువు.
కావల్సిన పదార్థాలు
ధనియాలు - అరకప్పు
జీలకర్ర - రెండు టీస్పూనులు
షాజీరా - రెండు టీస్పూనులు
యాలకులు - ఇరవై
దాల్చిన చెక్క ముక్కలు - నాలుగు
మరాఠీ మొగ్గలు - నాలుగు
జాజికాయ - ఒకటి
లవంగాలు - ముప్పై
జాపత్రి - నాలుగు
మిరియాలు - రెండు టీస్పూనులు
అనాస పువ్వులు - ఆరు
బిర్యానీ ఆకులు - నాలుగు
సోంపు గింజలు - రెండు టీస్పూనులు
బిర్యానీ మసాలా తయారీ ఇలా
1. స్టవ్ కళాయి పెట్టి జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, ధనియాలు, మరాఠీ మొగ్గలు వేసి వేయించాలి.
2. ఓ అయిదు నిమిషాలు వేయించాక మిగిలిన పదార్థాలు కూడా వేసి వేయించాలి. బిర్యానీ ఆకులు మాత్రం వేయకూడదు.
3. చివరలో బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి చివరలో వేయాలి.
4. ఇప్పుడు వీటన్నింటనీ మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.
5. మిక్సీలో పొడి చేస్తున్నప్పుడే మంచి సువాసన వెదజల్లుతుంది.
6. ఈ పొడిని సీసాలో వేసి గాలి చొరబడకుండా మూత పెట్టి దాచుకోవాలి.
7. మూత తీసి ఎక్కువ సేపు ఉంచకూడదు. వాసన బయటికి పోతే ఆ పొడి వేసినా వ్యర్థమే.
8. ఇంట్లో చేసుకున్న పొడితో ఓసారి బిర్యానీ వండుకుని తిని చూడండి... బయట కొనడమే మానేస్తారు.
మసాలాను అధికంగా వేయడం వల్ల వేడి చేస్తుంది. పొట్ట నొప్పి వస్తుంది. అదే మితంగా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. దాల్చిన చెక్క, ధనియాలు, జాజికాయ వంటివి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తాయి. లవంగాలో యాంటీ బాక్టిరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. యాంటి సెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కూడా ఇందులో ఎక్కువ. దాల్చిన చెక్కల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇందులో ఐరన్ సోడియం, ఫైబర్, ప్రోటన్లు అధికంగా ఉంటాయి. ఈ బిర్యానీ మసాలాను చికెన్, మటన్ కూరల్లో ఉపయోగించినా మంచి రుచి వస్తుంది.
Also read: ఆ రాష్ట్రంలో మాంసాహార మొక్కలు, కీటకాలను ఆకర్షించి హాంఫట్ చేస్తాయి
Also read: ఇలా ఒంటికాలిపై పది సెకన్ల పాటూ నిల్చోగలరా? ఈ టెస్టు మీ ఆయువు గురించి చెప్పేస్తుంది
Diabetes: ఈ అయిదు ఆహారాలు రోజూ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉండడం ఖాయం
Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే
Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే
Languages: ప్రపంచాన్ని ఏలుతున్న అయిదు భాషలు ఇవే, ఒక్కో భాషని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసా?
Weight Loss: ఈ రోటీలు రోజుకు రెండు తినండి చాలు, నెలలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్తో వన్ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!