World Population Day : ప్రపంచ జనాభా దినోత్సవం 2025.. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి భారత్ ఆలోచించాల్సిన సమయమిదే, ఎందుకంటే?
Population Day : జనాభా పెరిగితే వచ్చే ఇబ్బందులపై అవగాహన కల్పిస్తూ.. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వివరిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిప్రాముఖ్యత, ఈ ఏడాది థీమ్ ఏంటంటే..

World Population Day 2025 : జనాభా అవసరమే. కానీ పరిధికి మించిన జనాభా ఉంటే.. అక్కడ అభివృద్ధి జరగడం చాలా కష్టమవుతుంది. ఎన్నో అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి వనరులు కూడా సరిపోవు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ.. ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత ముఖ్యమో వివరిస్తూ.. ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. జనాభా పెరిగితే వచ్చే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
జనాభా పెరిగితే వచ్చే ఇబ్బందులను గుర్తించి.. ఫ్యామిలీ ప్లానింగ్ అనే విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ.. 1989లో యూనైటెడ్ నేషన్స్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది జూలై 11వ తేదీన దీనిని నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డే కేవలం కుటుంబ నియంత్రణపై కాకుండా.. ఆరోగ్య సేవలు, లైంగిక సమానత్వం, విద్య వంటి అంశాలపై దృష్టి పెడతారు. అయితే ఈ సందర్భంగా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఇండియా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎందుకు? ఇండియాలో జనాభా పెరిగితే వచ్చే ఇబ్బందులు ఏంటి? వంటి ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత జనాభా..
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే జనాభాలో కూడా బాగానే అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం భారత్‌లో 1.43 బిలియన్కి పైగా జనాభా ఉంది. అంటే ప్రపంచంలో ఇండియా వాటా సుమారు 17.76 శాతంగా ఉంది. మన జనాభాలో 50 శాతం టీనేజర్స్ ఉన్నారు. అంటే 25 ఏళ్లలోపు వారు ఉన్నారు. అయితే ఈ ఫెర్టిలిటీ రేట్ రాష్ట్రాలవారీగా కాస్త తేడాలు ఉన్నాయి.
ఇండియాలో సుమారు ప్రతి మహిళకు ఇద్దరు పిల్లలు చొప్పున ఫెర్టిలిటీ రేట్ ఉంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఫెర్టిలిటీ రేట్ తగ్గింపులో విజయవంతం సాధించగా.. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో ఫెర్టిలిటీపై సరైన రీతిలో అవగాహన ఉండట్లేదు. కానీ ఇలాగే పరిస్థితి ఉంటే జనాభాపై అదుపు లేకుండా పోతుంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు కుటుంబ నియంత్రణ ఎందుకు అవసరం? దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి?
ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్..
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఓ థీమ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. "ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఓ హక్కు, ఓ ఛాయిస్, ఓ బాధ్యత(Family Planning: A Right, A Choice, A Responsibility)". కచ్చితంగా కుటుంబనియంత్రణపై అందరూ బాధ్యత వహించాలనే థీమ్‌తో.. ఫ్యామిలీ ప్లానింగ్ లేకుంటే జరిగే ఇబ్బందులను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ థీమ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ థీమ్ ప్రపంచంతో పాటు.. ఇండియాకు చాలా అవసరం.
కుటుంబ నియంత్రణ..
ఫ్యామిలీ ప్లానింగ్ అనేది జనాభా నియంత్రణ మాత్రమే కాదు. మహిళల ఆరోగ్యంతో పాటు దంపతులు తమ జీవితాల్లో సంతోషంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా.. ఆరోగ్యంగా గడపడానికి అవసరమైన ఫ్రీడమ్‌ని ఇస్తుంది. కుటుంబ ఆదాయంపై ఒత్తిడి తగ్గుతుంది. జనన, మరాల రేట్ తగ్గుతుంది. గర్భిణీ మృతులు తగ్గుతారు. పిల్లలు ఆరోగ్యంగా పెరగగలిగే పరిస్థితి ఉంటుంది. మహిళలు విద్యా, ఉద్యోగాల్లో పురోగమిస్తారు. ఇవన్నీ సాధించాలంటే కుటుంబ నియంత్రణ ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు.
దీనిలో భాగంగానే.. "Population isn’t just a number. It’s about people—and their right to health, dignity, and opportunity. Family planning is the foundation of a future where every child is wanted, and every woman is empowered." అంటూ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ రేణు శర్మ తెలిపారు.
జనాభా నియంత్రణ లేకుంటే..
దేశ వనరులు సరిపడేలా నిర్వహించుకోవాలంటే.. జనాభా నియంత్రణ కచ్చితంగా అవసరం. జనాభా పెరిగే కొద్ది జాబ్స్ తగ్గుతాయి. సవాళ్లు పెరుగుతాయి. వనరుల కొరత ఏర్పడుతుంది. ఇతర ఇబ్బందులతో పాటు.. క్రైమ్ రేట్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విషయాలను కంట్రోల్ చేసేందుకు ఇండియాలో మిషన్ పరివార్ వికాస్ అనే పథకాన్ని అధిక ఫెర్టిలిటీ ఉన్న జిల్లాల్లో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భనిరోధక సాధనాలు పంపిణీ చేస్తున్నారు. ఇండియాలో ప్రస్తుతం ఆధునిక గర్భనిరోధకాలను సుమారు 56 శాతం మంది వినియోగిస్తున్నారు.
కుటుంబం కోసమే కాకుండా.. సమాజం శ్రేయస్సు కోసం కూడా ఫ్యామిలీ ప్లానింగ్‌పై అందరికీ అవగాహన ఉండాలి. ఇది అభివృద్ధికి నాంధి అవుతుంది. ఆర్థికంగానే కాదు.. పర్యావరణ భవిష్యత్‌కి కూడా ఇది మంచిదని అందరూ గుర్తించాల్సి ఉంటుంది.






















