2023 డేటా ప్రకారం దేశంలో 10 కండోమ్​లను​ ఉత్పత్తి చేసే కంపెనీలు ఉన్నాయట.

వాటిలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లోనే 6 కండోమ్​ ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయి.

కేవలం ఔరంగాబాద్​లోని కంపెనీలు ప్రతి నెలా దాదాపు 10 కోట్ల కండోమ్​లు ఉత్పత్తి చేస్తున్నాయట.

ఇక్కడి ఉత్పత్తులు ఆసియా దేశాలు, యూరప్​, లాటిన్​ అమెరికాలకు సరఫరా అవుతాయట.

నైట్ రైడర్స్, కామసూత్ర వంటి ప్రసిద్ధ బ్రాండ్లు ఇక్కడనుంచే కండోమ్​లను ఉత్పత్తిని చేస్తాయి.

ఈ కంపెనీల వార్షిక టర్నోవర్​ 200 నుంచి 300 కోట్లు ఉన్నట్లు డేటాలో తెలిసింది.

అందుకే ఔరంగాబాద్ కండోమ్​ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది.

కండోమ్​ల తయారీలో ఉపయోగించే ప్రత్యేక రబ్బరును తమిళనాడు, కేరళ నుంచి సేకరిస్తారు.

లైంగికంగా సంక్రమించే వ్యాధులను కంట్రోల్ చేయడంలో కండోమ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి.

అన్​వాంటెడ్ ప్రెగ్నెన్సీని దూరం చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.