Moste Expensive Sushi: ఈ సుషీ తినాలనుకుంటే మీ నాలుగైదు నెలల జీతం పక్కన పెట్టుకోవాల్సిందే!
జపనీస్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సుషీ వంటకానికి ప్రియులు ఉన్నారు.
సుషీ జపనీస్ ఫేమస్ వంటకం. మోస్ట్ పాపులర్, ట్రెండింగ్ ఫుడ్ గా నిలిచింది. ఒక్క జపాన్ లో మాత్రమే కాదు దీనికి ఇతర దేశాల్లోను ప్రియులు ఉన్నారు. హెల్తీ, డెలిసియష్ ఫుడ్ ఇది.. ఎంతో ఫేమస్ అయిన ఈ జపనీస్ వంటకం ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. వెజ్, నాన్ వెజిటేరియన్ రెండు విధాలుగా ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలు, తయారీ కోసం ఉపయోగించే సాంకేతికత కారణంగా ఈ వంటకం చాలా ఖరీదైనది. అయితే ఇటీవల జపాన్ లోని ఒసాకా రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుషీని అందిస్తుంది. ఒకవేళ మీరు కనుక దీన్ని తినాలని అనుకుంటే ఒక నాలుగైదు నెలల జీతం పక్కన పెట్టేసుకోవాల్సిందే.
సుషీ కిరీమొన అనే రెస్టారెంట్ 20 సుషీ ముక్కలతో కూడిన 'కివామి ఒమాకేస్' ని అందిస్తుంది. దీని ధర JP¥ 350,000. అంటే మన కరెన్సీలో సుమారు 2 లక్షలు పైమాటే. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుషీగా నిలిచింది. గతంలో ఈ రికార్డు చెఫ్ యాంజెలిటో అరినాట పేరిట ఉంది. 2010 లో 5 ముక్కలతో తయారు చేసిన ఈ సుషీ మీద డైమండ్స్, 24 క్యారెట్ల గోల్డ్ ఆకులతో అలంకరించారు. ఈ సుషీ విలువ భారత కరెన్సీలో రూ.1,63,540. తాజాగా తయారు చేసిన సుషీ ఈ రికార్డుని బద్ధలు కొట్టింది.
ఎందుకంత ఖరీదంటే?
గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం కివామి ఒమాకేస్ తయారు చేయడానికి జపాన్ నలుమూలల నుంచి జాగ్రత్తగా ఎంపిక చేయబడిన అత్యుత్తమ పదార్థాలతో తయారు చేస్తారు. సంప్రదాయ పద్ధతులు అనుసరించి వండుతారు.
ఇందులో ఏం వాడతారు?
కొన్ని వార్తా నివేదికల ప్రకారం ఇందులో నిగిరి ముక్కలు ఉంటాయి. సన్నగా ముక్కలు చేసిన ముడి చేపలను బియ్యంతో తయారు చేసిన బాల్స్ మధ్య ఉంచుతారు. మరికొన్ని బియ్యం లేకుండా పచ్చి చేపలతో తయారు చేస్తారు. ముక్కలుగా చేసిన సుషీ రోల్స్ కూడా ఇందులో అందిస్తారు. వివిధ రకాలైన సుషీలతో 20 ముక్కలు అందిస్తారు. వైట్ టైల్ ఫిష్, బెలూగయ కేవీయర్, షింకొ, పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా, చమ్ సాల్మన్, బిగ్ ఫన్ రీఫ్ స్క్విడ్ , సెయ్ వేల్ టైల్ మీట్, మురాసాకి యూని, బఫూన్ యూని, స్టీమ్డ్ అబలోన్, స్ట్రయిస్ ఆఫ్ ఫుటొమాకి, వబోరో, ఎగ్ ఫ్యాటీ ట్యూనా బెల్లీ, మీడియం ఫ్యాట్ ట్యూనా బెల్లీ, లీన్ ట్యూనా బ్యాక్ వంటి అనేక రకాల చేపలు వినియోగిస్తారు. ఈ సుషీకి చివరి టచ్ గా బంగారు ఆకులు చిలకరించి ఇస్తారు.
ఇందులో సుషీ కోసం ఉపయోగించే బియ్యం అకిటా ఫ్రీఫెక్చర్ చెందినవని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఉపయోగించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే ఈ సుషీకి ఇంత ఖరీదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: విటమిన్ P గురించి తెలుసా? ఇది కూడా మన శరీరానికి అత్యవసరం