By: ABP Desam | Updated at : 19 Apr 2022 09:51 AM (IST)
(Image credit: Pixabay)
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. జీర్ణ ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన ఆహారం సరిగా జీర్ణమయ్యేందుకు, పోషకాలు మన శరీరానికి అందేందుకు, వ్యర్థాలు బయటకు పోయేందుకు ఇది కాలేయం పనితీరు చాలా ముఖ్యం. కానీ చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం .. . ఇలాంటి కారణాల వల్ల కాలేయం చిక్కుల్లో పడుతుంది. ఈ ప్రధాన అవయవానికి వచ్చే ముఖ్యమైన మూడు సమస్యలు ఉన్నాయి. ఇవి ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
కాలేయంలో కణితులు(లివర్ సిస్టులు)
కాలేయంలో కణితులు ఏర్పడడం ఒక్కోసారి పుట్టుకతోనే జరుగుతుంది. ఇవి ఒకట్రెండు కణితులు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు నీటి బుగ్గలు కూడా ఏర్పడతాయి. వీటిని వెంటనే చికిత్స అందించకపోతే కాలేయం మొత్తం పాకేస్తాయి. ఈ సమస్యను ‘అడల్ట్ పాలిసిస్టిక్ డిసీజ్’ అంటారు. జన్యులోపాల వల్ల ఇది కలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు వైరస్, బ్యాక్టిరియా వంటి పరాన్న జీవుల వల్ల కూడా కలగవచ్చు. వీటిని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. ఇవి కాలేయంలో ఏర్పడినప్పుడు పొట్టలో కుడివైపు నొప్పి వస్తుంది. ఆ నొప్పికి జ్వరం కూడా తోడవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అల్ట్రాసౌండ్ పరీక్షలతో వాటిని గుర్తించి వాటి సైజునుంచి బట్టి చికి్త్స చేస్తారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో వాటిని తొలగించే అవకాశం కూడా ఉంది.
గాల్ బ్లాడర్
కాలేయం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు విడుదలయ్యే రసాలు బైల్ గొట్టాల ద్వారా ప్రయాణిస్తుంది. ఒక్కోసారి బైల్ గొట్టాలు, గాల్ బ్లాడర్లలో చిన్న చిన్న రాళ్లు ఏర్పడతాయి. దీనికి కారణం ఇన్ఫెక్షన్ కావచ్చు. అలాగే కొవ్వు వల్ల కూడా జరుగుతుంది. ఈ సమస్య పుట్టుకతో కూడా వచ్చే అవకాశం ఉంది.కళ్లు రంగు మారడం, పొట్టలో కుడివైపున నొప్పి రావడం, చలిజ్వరం ఈ సమస్య ప్రాథమిక లక్షణం. రక్తపరీక్ష, స్కానింగుల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. స్టోన్స్ ను తొలగించేందుకు చాలా అధునాతన పద్ధతులు వచ్చాయి.
కాలేయ క్యాన్సర్
కాలేయ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైనది. కాలేయంలో క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను ‘హెపటో సెల్యులార్ క్యాన్సర్’ అంటారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకొనే వారిలో ఏర్పడుతుంది. హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ ఇన్ ఫెక్షన్ తో ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లో ( 2 నుంచి 7 సంవత్సరాల వయస్సు పిల్లలు)ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. కొన్నిసందర్భాలలో లివర్ లోనే క్యాన్సర్ ఏర్పడవచ్చు. లేదా జీర్ణ వ్యవస్థ లోని ఇతర భాగాల్లో లేదా ఇతర శరీర భాగాల్లో క్యాన్సర్ జనించి కాలేయంలోకి పాకవచ్చు. పొట్ట పైభాగంలో నొప్పి రావడం, బరువు తగ్గిపోవడం, కళ్లు రంగు మారడం, నలుపు రంగులో విరేచనాలు కావడం వంటివి దీని లక్షణాలు. ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించాలి. ముదిరిపోయాక గుర్తిస్తే పరిస్థితి చేయిదాటుతుంది. రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా సమస్యను గుర్తిస్తారు. ఒక్కోసారి బయాప్సీ కూడా చేయాల్సి వస్తుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు.
ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలి, సరైన నిద్ర, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం ద్వారా కాలేయాన్ని కాపాడుకోవచ్చు.
డాక్టర్. ఆర్ వి రాఘవేంద్రరావు,
కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్సుప్లాంట్ సర్జన్ & డైరక్టర్
రెనోవా_ఎన్ ఐ జి యల్ హాస్పిటల్స్
న్యూ ఎమ్ ఎల్ ఎ కాలనీ, రోడ్ నెం.12
బంజారాహిల్స్, హైదరాబాద్.
Also read: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే తగ్గరు
Also read: నిలబడి ఉన్నప్పుడు రక్తపోటు పెరిగితే అదెంత డేంజరో తెలుసా, అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్
Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు