అన్వేషించండి

Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే తగ్గరు

అధిక బరువును తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

అధిక బరువు ఇప్పుడు ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య. ఊబకాయం బారిన పడిన వారిలో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. ఆ కొవ్వును తగ్గించేందుకు ఎంతగా ప్రయత్నిస్తారో. ఇలా పొత్తి కొడుపు దగ్గర పేరుకుపోయే కొవ్వు చాలా ప్రమాదకరం. ఈ కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఇలా కొవ్వు దీర్ఘకాలం పాటు పేరుకుపోతే గుండె సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.  పొట్ట దగ్గరి కొవ్వును పెంచే ప్రయాణంలో కొన్ని తప్పులను చేస్తారు. వాటిని అధిగమిస్తే బరువు త్వరగా తగ్గుతారు. 

అది అపోహే
బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పుడు శరీరంలో ఎక్కడైనా మొదట బరువు తగ్గడం ప్రారంభమవ్వచ్చు. ఏ భాగం నుంచి బరువు తగ్గడం ప్రారంభం అవుతుందో చెప్పడం కష్టం. కాబట్టి పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలి, తొడల దగ్గర కొవ్వు తగ్గాలి అనుకునే వ్యాయామం చేసినప్పటికీ మొదట ఆ ప్రాంతం నుంచి బరువు తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తుంచుకుని బరువు తగ్గే వ్యాయామాలు మొదలుపెట్టండి. పొట్ట తగ్గకపోతే వెంటనే నిరాశ పడకుండా రోజూ చేస్తూ ఉండండి. 

పొట్ట మాడ్చుకోవద్దు
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది చేసే పని ఆహారం తినకుండా పొట్ట మాడ్చుకోవడం. ఆకలితో మాడడం వల్ల బరువు తగ్గుతారనుకోవడం ఒట్టి భ్రమ. పైగా అనేక ఆరోగ్యసమస్యలు వచ్చి పడతాయి. అంతేకాదు పొట్ట దగ్గర కొవ్వు మరింతగా పేరుకుపోయే అవకాశం ఉంది. శరీరానికి తగినంత పోషకాలు అందితే శరీరంలో కొవ్వును కరిగించడం సులభతరం అవుతుంది. 

చెడు అలవాట్లు
బరువు తగ్గే ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారమే కాదు, మంచి అలవాట్లను కూడా అనుసరించాలి. అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం ఈ రెండు బరువు తగ్గడానికి బద్ధ శత్రువులు. మితంగా తినడం, రోజుకు కనీసం గంట పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే ధూమపానం, మద్యపానం వంటివి వదిలేయాలి. నిద్ర లేమి, అధిక ఒత్తిడి కూడా బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తాయి. 

చురుకైన కదలికలు
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఓ దగ్గరే గంటలు గంటలు కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారు కానీ, తగ్గే అవకాశం లేదు. కాబట్టి రెండు గంటలకోసారి లేచి కనీసం పావుగంట సేపు ఇటూ అటూ నడవాలి. టీవీ చూస్తూ, వర్క్ చేస్తూ అలా కూర్చుండి పోవడం మంచిది కాదు. ఇది పొట్ట దగ్గర కొవ్వును పెంచేస్తుంది. 

తగినన్ని నీళ్లు
బరువు తగ్గడంలో నీళ్లది ప్రధాన పాత్రే అని చెప్పుకోవాలి. రోజుకు తగినన్ని నీరు తాగడం వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. నీరు తగ్గితే అధిక ఆహారం తినే అవకాశం ఉంది. అదనపు కేలరీలు శరీరంలో పేరుకుపోతాయి. తద్వారా మీరు బరువు పెరుగుతారు. ద్రవాహారం అధికంగా తీసుకోవడంలో ఘనాహారం తగ్గి బరువు తగ్గడం సులభతరం అవుతుంది. 

Also read: నిలబడి ఉన్నప్పుడు రక్తపోటు పెరిగితే అదెంత డేంజరో తెలుసా, అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్

Also read: మనుషులకూ సోకుతున్న జంతువుల జ్వరం, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త


 

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget