Twins: ఆ కవల పిల్లలకు తల్లి ఒక్కరే, కానీ తండ్రులే వేర్వేరు - అసలు నిజం తెలిసి నోరెళ్లబెట్టిన డాక్టర్లు!
కవల పిల్లలకి ఎక్కడైనా తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పిల్లలకి ఇద్దరు తండ్రులండోయ్.
కవల పిల్లలు పుట్టారంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ, ఆ కవల పిల్లల జన్మ రహస్యం తెలుసి డాక్టర్లే నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ యువతి కవల పిల్లలకి జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలకు ఇద్దరు తండ్రులు. చాలా గందరగోళంగా ఉంది కదూ. ఔనండి, మీరు విన్నది నిజమే. ఆ పిల్లల తండ్రులు వేర్వేరు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవల్సిందే.
పోర్చుగల్ కి చెందిన 19 ఏళ్ల యువతి పండంటి మగ కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రసవం కూడా బాగానే జరిగింది. ఇద్దరు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా పుట్టారు. అయితే ఆ పుట్టిన ఇద్దరు పిల్లలకి తండ్రులు వేర్వేరని తెలిసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అది ఎలా సాధ్యం అని జుట్టు పీక్కున్నారు? ఆ తర్వాత నిదానంగా ఆలోచించి.. వైద్య చరిత్రలోనే ఇది అద్భుతం అని గట్టిగా అరించారు.
ఇది కాస్త నమ్మేలా లేకపోయినా నిజం మాత్రం అదే. ఆ పిల్లలకి ఇద్దరు తండ్రులు. ఆ యువతి గర్భం దాల్చిన తర్వాత.. ఎనిమిదో నెలలో పితృత్వ పరీక్షలు చేయించింది. ఆ పిల్లలకి తండ్రిగా భావిస్తున్న వ్యక్తితో ఒక బిడ్డ DNA శాంపిల్ మాత్రమే కలిసింది. అదేంటబ్బా, అని ఆ అమ్మాయి ఆలోచిస్తే.. అసలు విషయం గుర్తుకు వచ్చింది. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులతో వెంటనే శృంగారంలో పాల్గోవడం వల్ల.. ఆమె అండంలోకి ఇద్దరు వీర్యాలు చేరాయి. ఫలితంగా ఆమె కడుపులో రెండు పిండాలు ఏర్పడ్డాయి. డీఎన్ఏ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్లకు కాసేపు నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. కానీ, ఇలా కూడా జరుగుందనే విషయాన్ని వారు మెడికల్ మిరాకిల్‌గా నోట్ చేసుకున్నారు.
ఇలా కవల పిల్లలకి వేర్వేరు తండ్రులు ఉండటాన్ని వైద్య పరిభాషలో ‘హెటెరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటిది 20వ కేసు అంట. ఇది రెండు విధాలుగా సంభవిస్తుంది. అండోత్సర్గానికి ముందు స్త్రీ ఇద్దరు వేర్వేరు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉంటే రెండు అండాలు విడుదలైనప్పుడు.. స్పెర్మ్ లు ఫెలోపియన్ ట్యూబ్‌లలో ఉంటాయి. మరొకటి స్త్రీ అండోత్సర్గము తర్వాత ఇద్దరు వేర్వేరు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉంటే స్పెర్మ్ రెండు గుడ్లతో ఫలదీకరణ జరిగినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
అసలు ఏంటి ఈ హెటెరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్
కుక్కలు, పిల్లులు, ఆవులు వంటి జంతువులలో ఇది తరచుగా జరుగుతూనే ఉంటుంది. కానీ మనుషుల్లో మాత్రం అరుదుగా జరుగుతుంది. రుతుచక్రంలో రెండో అండం విడుదల అయినప్పుడు ఇది సంభవిస్తుంది. స్త్రీ లైంగికంగా వేరే వ్యక్తితో కలిసినప్పుడు అతడి స్పెర్మ్ కణాల ద్వారా ఫలదీకరణం జరుగుతుంది. దీన్ని బహుళ సంతానోత్పత్తి అంటారు. ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అందుకే ఇటువంటి కేసులు ఎక్కువగా కనిపించవు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ కవల పిల్లల వార్త మాత్రం తెగ వైరల్ గా మారింది.
Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి
Also Read: ఈ ‘టీ’లు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయ్, ట్రై చేసి చూడండి