అన్వేషించండి

Healthy Heart: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి వింటూనే ఉన్నాం. అందుకే ప్రస్తుత రోజుల్లో గుండెకి పదిలంగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

గుండెని ఆరోగ్యంగా ఉంచడం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మీదే గుండె ఆరోగ్యం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇంతక ముందు గుండె పోటు లేదా స్ట్రోక్ అంటే వయసు మళ్లిన వారికే వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి వింటూనే ఉన్నాం. అందుకే ప్రస్తుత రోజుల్లో గుండెను పదిలంగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం తీసుకునే ఆహారం, శరీర బరువు మొత్తం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. తినే ఆహార పదార్థాలు గుండెకి మేలు చేసేవా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. జంక్ ఫుడ్, మసాలా ఎక్కువగా ఉండే బిర్యానిలు ఎక్కువగా తీసుకోకుండా సరైన డైట్ పాటిస్తూ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు తీసుకుంటే గుండెని జాగ్రత్తగా చూసుకోవచ్చు.

గుండెకి మేలు చేసేందుకు ఏం తినాలి, ఏం తినకూడదు  

పండ్లు, కూరగాయలు తినాలి: గుండెని రక్షించుకోవాలంటే తాజా కూరగాయలు, కాలానుగుణంగా వచ్చే పండ్లు తీసుకోవాలి. వాటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. బరువును నియంత్రిస్తుంది. మధుమేహం లేనంత వరకు ఎటువంటి సందేహం లేకుండా అన్నీ రకాల పండ్లు తీసుకోవచ్చు. అదే డయాబెటిస్ వస్తే మాత్రం వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే వాటిని తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ప్రమాదం కావచ్చు.

సోడియం తక్కువ తీసుకోవాలి: సాధారణంగా తినే దానికంటే చాలా తక్కువ పరిమాణంలో సోడియం మన శరీరానికి అవసరం. అధిక రక్తపోటు, గుండె జబ్బులని నివారించడానికి రోజుకు 1500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోరాదు. అంటే రోజుకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రమే తినాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది.

కొవ్వు ఉత్పత్తులు తగ్గించాలి: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సరైన కొవ్వు ఉండే పదార్థాలను ఎంచుకోవాలి. వేపుళ్ళు, నూనె ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. కొవ్వు ఎక్కువగా ఉన్నవి తీసుకోవడం వల్ల గుండెకి చేటు చేస్తుంది. అలా అని అన్నీ కొవ్వులు మంచివి కాదని అనుకోకూడదు. అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3 వంటి కొన్ని రకాల కొవ్వులు నిజానికి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఆలివ్, సోయాబీన్, గింజలు, కనోలా నూనెలు, సీ ఫుడ్ లో ఉండే కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి.

ఆల్కహాల్ మితంగా తీసుకోవాలి: మితంగా ఆల్కాహారాల తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డీసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అది కూడా వైద్యులని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. మీకు కనుక ముందు నుంచి మద్యపానం అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం మంచిది. అలాంటి వాళ్ళు అసలు మద్యం సేవించరాదు.

ఫైబర్ ఉండేవి తినాలి: ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని రకాల ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ప్రతి రోజూ 20-30 గ్రాముల ఫైబర్ తప్పకుండా తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవే కాదు కొవ్వు ఎక్కువగా ఉండే పాలు, పాల్ ఉత్పత్తులు, పంది మాంసం వేయించిన ఆహార పదార్థాలు, చక్కెర వంటి వాటికి దూరంగా ఉండాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

 Also Read: ఈ ‘టీ’లు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయ్, ట్రై చేసి చూడండి

Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget