Salt Foods in Winter : చలికాలంలో ఉప్పు ఎక్కువగా తింటున్నారా? వింటర్ క్రేవింగ్స్తో జాగ్రత్త అంటోన్న నిపుణులు
Winter Street Foods : చలికాలంలో ఎక్కువ ఉప్పు తింటే ఎముకలు బలహీనపడటం, కిడ్నీలు దెబ్బతినడం, చర్మ సమస్యలు, రక్తపోటు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

Hidden Health Dangers with Salt : చలికాలం ప్రారంభం కాగానే టేస్టీ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ పెరుగుతాయి. ముఖ్యంగా బయట ఫుడ్ తినాలని కోరుకుంటారు. దీనిలో భాగంగా సాయంత్రం, వాతావరణం చల్లగా మారినప్పుడు.. చిప్స్, సమోసాలు, వేడి పకోడీలు వంటి వేయించిన ఫుడ్స్ ఎక్కువగా తింటారు. వీటిలో ఉప్పగా ఉండే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. దీనివల్ల అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు నిపుణులు.
స్ట్రీట్ ఫుడ్స్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. తమ ఇష్టాలను బట్టి వెరైటీ ఫుడ్స్ ఇష్టపడతారు. ఇందులో తరచుగా ఉప్పు, డీప్ ఫ్రై చేసిన ఆహారం ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యం, మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే చలికాలంలో మనం శారీరక శ్రమను కొంచెం తగ్గిస్తాము. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.
ఎముకల బలహీనత
ఉప్పు భారతీయ వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజూ ఆహారంలో దీనిని తీసుకుంటాము. ఇది లేకుంటే రుచి కూడా అంతగా ఉండదు. కానీ ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపిస్తుంది. ఇది ఎముకల బలానికి మంచిది కాదు.
మూత్రపిండాలు దెబ్బతింటాయా?
ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మన మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరు నెమ్మదిస్తుంది. ఎందుకంటే కిడ్నీలు సోడియంను ఫిల్టర్ చేయడానికి ఎక్కువ కష్టపడాలి. కాబట్టి మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు వేసుకుంటే.. అది మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
చర్మ సమస్యలు
చలికాలంలో మన చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది. చర్మం మరింత పొడిగా మారవచ్చు. ఇది ముఖం నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. ముఖంపై ముడతలు త్వరగా కనిపిస్తాయి.
రక్తపోటు ప్రమాదం
ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మీ గుండెపై ప్రభావం పడుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఎందుకంటే సోడియం రక్తంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల కణాలపై ఒత్తిడి పెరుగుతుంది.
బరువు పెరగడం
చలికాలంలో పకోడీలు, సమోసాలు, చాట్ వంటి వేయించిన ఆహారం ఎక్కువగా తింటారు. వీటిలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరగవచ్చు.
నీరు నిలిచిపోతుంది
చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. దీనివల్ల ముఖం, చేతులు, కాళ్ళపై వాపు కనిపిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















