Winter Dehydration : నీళ్లు తక్కువ తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే
Dehydration in Winter : చలికాలంలో తగినంత నీరు తాగకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. మరి వింటర్లో వాటర్ తక్కువ తాగితే వచ్చే నష్టాలు ఏంటో చూసేద్దాం.

Health Risks of Dehydration in Winter : శరీరానికి సరైన మోతాదులో నీరు అందించకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో నీటిని తాగకపోతే కొన్ని సమస్యలు వస్తాయట. చల్లని వాతావరణం కారణంగా చాలాసార్లు సాధారణంగా కంటే తక్కువ నీరు తాగుతారు. ఇలా తక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి చలికాలంలో కూడా తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే వచ్చే సమస్యలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
చలికాలంలో నీరు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలివే
చలికాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. కాబట్టి శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడితే.. కండరాలలో తీవ్రమైన తిమ్మిరి ఏర్పడుతుంది. శరీరంలోని వివిధ భాగాల కండరాలలో నొప్పి రావచ్చు. అందుకే చాలామంది వింటర్లో కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
చలికాలంలో వచ్చే ప్రధాన సమస్యల్లో జీర్ణ సమస్యలు కూడా ఒకటి. అయితే ఇవి కూడా సరైన మోతాదులో నీరు తీసుకోకపోవడం వల్లే వస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి చలికాలంలో కూడా సరైన మోతాదులో నీరు తీసుకోవాలని చెప్తున్నారు. లేకుంటే మలబద్ధకం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట. ఇప్పటికే మీరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.
బ్యూటీపై ప్రభావం..
చలికాలంలో స్కిన్, స్కాల్ప్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నీరు కూడా వాటిని రెట్టింపు చేస్తుంది. కాబట్టి సరైన మోతాదులో నీరు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే మీ చర్మం మరింత పొడిగా మారుతుంది. మృదువైనా, మెరిసే చర్మాన్ని పొందడానికి తగినంత నీటిని శరీరానికి అందించాలి. లేదంటే చర్మం డీహైడ్రేట్ అయి ఇబ్బందులు కలిగిస్తుంది. జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యం కోసం కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్. లేదంటే స్కాల్ప్ పొడిబారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
చలి వల్ల మీరు నీళ్లు తాగలేకపోతున్నారు అనుకుంటే.. గోరువెచ్చని నీటిని తీసుకోండి. లేదంటే హెర్బల్ టీలు తీసుకోవచ్చు. గ్రీన్ టీ తాగవచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించడంతో పాటు.. హైడ్రేషన్ని కూడా అందిస్తాయి. అలాగే నీరు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం కూడా మంచిది. కీరదొస, సొరకాయ, టొమాటో వంటి కూరగాయల్లో.. పుచ్చకాయ, గ్రేప్స్ వంటివి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి నీటిని అందించి.. ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.






















