మోకాళ్ల నొప్పిని దూరం చేసే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

మోకాళ్ల నొప్పి వివిధ కారణాల వల్ల రావచ్చు. సరిగ్గా కూర్చోకపోవడం ఏదైనా తగలడం లేదా దెబ్బ తగలడం వల్ల నొప్పి కలగవచ్చు.

ఆహారంలో మార్పులు చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆక్రోట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల మీరు సాల్మన్, మేకెరెల్, ట్యూనా చేపలను తినవచ్చు.

బాదంలో చాలా ప్రోటీన్ ఉంటుంది. దానితో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

మీరు విటమిన్ డి కలిగిన ఆహారాలు, పాలు, పెరుగు, పనీర్, గుడ్డు సొన వంటివి తినవచ్చు. పసుపు పాలు తాగవచ్చు.

పిస్తా యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంది.

అల్లంలో ఉండే జింజెరాల్ సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనంఇస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.