News
News
X

Will Smith: హాలీవుడ్ స్టార్ ను భయపెడుతున్న పురుగు.. దాన్ని బాధ తట్టుకోలేక ఏం చేయబోతున్నాడంటే?

ఓ సాలె పురుగు హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ తెగ ఇబ్బంది పెడుతుందట.. దాని బాధ తట్టుకోలేకపోతున్నాడట. ఎలాగైనా దాని నుంచి తప్పించుకునేందుకు ఓ నిర్ణయం తీసుకున్నాడట.. ఇంతకీ అదేంటంటే..

FOLLOW US: 

హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్‌ స్మిత్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి ఆయన కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తాజాగా జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెళ్లుమనిపించి వార్తల్లోకెక్కాడు ఈ హీరో. ఈ ఘటన ఆస్కార్ అవార్డు వేడుకల చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచింది. ఈ ఘటన తర్వాత ఆస్కార్‌ కమిటీ విల్‌ స్మిత్‌ పై 10 ఏళ్లపాటు నిషేధం విధించింది. అటు ఆస్కార్‌ కమిటీలో తన సభ్యత్వానికి  స్మిత్‌ రిజైన్ చేశారు. అనంతరం క్రిస్‌ రాక్‌ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.

ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే ఆయన తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.  తన ఇంట్లోకి వచ్చిన పెద్ద సాలె పురుగును చూశాడు. వెంటనే ఆయన ఆశ్చర్యపోయారు. “వావ్.. ఈ స్పైడర్ ఎంత పెద్దగా ఉంది. ట్రే నేను కుర్చీలో ఉన్నాను కదా.. నువ్వు వెళ్లి దాన్ని పట్టుకుని అవతల వేసిరా.. నువ్ యంగ్ అండ్ స్ట్రాంగ్ కదా.. నువ్వే దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతావు” అంటూ కొడుక్కి చెప్పాడు. తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి ఆ సాలె పురుగును ఓ గాజు పాత్రలో బంధించారు.  దీనితో మాకు చాలా తలనొప్పిగా ఉంది. దీని బాధను తట్టుకోలేను. అసలు ఈ ఇంటినే అమ్మేస్తానంటూ స్మిత్ నవ్వుతూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక్క పురుగుకే స్మిత్ ఇలా అంటే మా ఇంట్లోకి ఎన్నో పురుగులు వస్తుంటాయి.. మేమేం అనాలి? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది.

ఇక ఆస్కార్ వేడుకలో విల్ స్మిత్ చెంపదెబ్బ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్కార్ వేడుక వ్యాఖ్యత క్రిస్ రాక్  చెంప చెళ్లుమనిపించాడు. అవార్డు వేడుక ఉల్లాసభరితంగా జరుగుతున్న సమయంలో.. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ GI జెన్ 2లాగా ఉందంటూ జోక్ వేశాడు. ప్రతిష్టాత్మక వేదిక మీద తన భార్యపై జోక్ వేయడంతో విల్ స్మిత్ కు కోపం తన్నుకొచ్చింది. వెళ్లి చెంప మీద ఒక్కటిచ్చాడు. విల్ స్మిత్ , జాడా పింకెట్ స్మిత్ 1997లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో జాడా పింకెట్ స్మిత్.. అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఆ వ్యధి కారణంగా తన జుట్టు ఎక్కువగా రాలిపోతుందని చెప్పింది.  

ఆస్కార్ వేదికపై జరిగిన ఘటన పట్ల విల్ స్మిత్ చాలా బాధపడినట్లు చెప్పాడు. క్రిస్ రాక్ కు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఆయన కుటుంబంతో పాటు ఆస్కార్ కమిటీకి, తన వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికి సారీ చెప్పారు.  అటు స్మిత్ చేసిన పనిని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్  కంగానా రనౌత్ సమర్థించారు. “తన తల్లి, లేదంటే చెల్లి ఆరోగ్యం గురించి ఓ ఇడియట్ అవమానించేలా మాట్లాడితే.. మరికొందరు వెధవల సమూహం ఆనందపడి, గేలి చేస్తే..  విల్ స్మిత్ లాగే నేను ప్రవర్తిస్తాను” అని చెప్పింది. ఆయనను తన రియాలిటీ షో లాకప్ లోకి ఆహ్వానిస్తానని చెప్పింది.

View this post on Instagram
 
A post shared by Will Smith (@willsmith)

Published at : 24 Aug 2022 12:39 PM (IST) Tags: Will Smith House Selling Huge Spider

సంబంధిత కథనాలు

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Diabetes: ఒంటరితనం డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Diabetes: ఒంటరితనం డయాబెటిస్  వచ్చే అవకాశాన్ని పెంచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Nobel Prize 2022: సైంటిస్ట్ స్వాంతే పాబోను వరించిన నోబెల్, మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు అవార్డు

Nobel Prize 2022: సైంటిస్ట్ స్వాంతే పాబోను వరించిన నోబెల్, మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు అవార్డు