News
News
X

Korea Men Beard: కొరియా పురుషులు గడ్డం, మీసాలు ఎందుకు పెంచరో తెలుసా?

మీరు గమనించారో లేదో.. కొరియాలో పురుషులకు అస్సలు గడ్డాలు, మీసాలు ఉండవు. ఒక్కోసారి పురుషులు, స్త్రీలను గుర్తించడం కూడా కష్టం. వారు ఎందుకు గడ్డాలు, మీసాలు పెంచరు?

FOLLOW US: 

ఒక్కో దేశం ఒక్కో సాంప్రదాయం, ఆచారాలను పాటిస్తుంది. భిన్న భాషలు, సాంప్రదాయలు కలిగిన మన దేశంలోనే చాలా ప్రాంతానికి ప్రాంతానికి బట్టి ఆచారాలు మారిపోతుంటాయి. ఇక కొరియాలో పాటించే కొన్ని సాంప్రదాయాలు, అలవాట్లు భలే వింతగా, కొత్తగా ఉంటాయి. మరి అవేంటో చూసేయండి మరి. 

కొరియన్లు గడ్డం ఎందుకు పెంచరు?: మీరు ఓటీటీల్లో కొరియా సినిమాలు చూసే ఉంటారు. అందులో ఎవరికీ గడ్డాలు, మీసాలు ఉండవు. కొన్ని సార్లు, అమ్మాయిలను, అబ్బాయిలను గుర్తు పెట్టడం కూడా కష్టమే. వారిని చూస్తే, కొరియా వాళ్లకు గడ్డాలు, మీసాలు రావేమో అనే సందేహం కలుగుతుంది. దక్షిణ కొరియా చరిత్రలోకి తొంగి చూస్తే.. అంతా గుబురు గడ్డాలతో కనిపిస్తారు. కొందరికైతే చాలా పొడవైన గడ్డం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఉన్న కొరియాలో గడ్డం కలిగి ఉండటాన్ని వికృతం లేదా అపరిశుభ్రంగా భావిస్తారు. గడ్డం అనాగరికం, పేదరికం, సోమరితనాన్ని సూచిస్తుంది. చివరికి ఉద్యోగం సంపాదించాలన్నా అక్కడ క్లీన్ షేవ్‌తో కనిపించాలి. కొన్ని సంస్థలు గడ్డం పెంచే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తాయి. అందుకే, వారు ప్రతి రోజు ఆఫీసుకు వెళ్లే ముందు ఒక్క వెంటుక కూడా కనిపించకుండా క్లీన్ షేవ్ చేసుకుని వెళ్తారు. 

జన్యు లోపాలు కూడా కారణం: అబ్బాయిలకు గడ్డం పెరగడం అనేది టెస్టోస్టెరాన్ (మ్యాన్లీ హార్మోన్) అనే హార్మోన్‌కు హెయిర్ ఫోలికల్ సున్నితత్వాన్ని ఉపయోగించడం ద్వారా నిర్ణయించబడుతుంది. కొరియన్ అబ్బాయిలు టెస్టోస్టెరాన్‌కు హెయిర్ ఫోలికల్‌కు తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా వారికి నెమ్మదిగా, అక్కడక్కడా గడ్డం పెరుగుతుంది. కొరియాలో చాలామంది అబ్బాయిలకు వయస్సు ముదిరిన తర్వాతే గడ్డం వస్తుంది. అలాగే, చాలా మంది కొరియన్ మహిళలు తమ పురుషులను గడ్డాలు లేకుండా చూసేందుకు అలవాటు పడ్డారు. సర్వేలు కూడా కొరియా మహిళలు గడ్డాలు లేని పురుషులనే ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నాయి. కొరియాలో కొందరు పురుషులు గడ్డాలు, మీసాలు రాకుండా సర్జరీలు కూడా చేయించుకుంటారు. దాని వల్ల పదే పదే షేవింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. 

కొరియాలో పాటించే మరికొన్ని వింత సాంప్రదాయాలు:

  • 13 కాదు, 4వ నెంబర్ భయపెడుతుంది: రెడ్ ఇంక్ తరహాలోనే కొరియా ప్రజలకు 4వ నెంబరు అంటే భయం. పాశ్చాత్య దేశీయులకు నెంబరు 13ను ఎలా అశుభంగా భావిస్తారో.. కొరియన్లు కూడా నెం.4ను అశుభంగా భావిస్తారు. ఆ సంఖ్య చావును సూచిస్తుందని కొరియన్లు చెబుతారు. ఇందుకు కారణం కొరియన్ సంఖ్య ‘4’.. కొరియన్లు పలికే ‘చావు’ పదం రెండూ ఒకేలా ఉంటాయి. కొరియాలో మరణాన్ని ‘సా’ అంటారు. నాలుగును కూడా ‘సా’ అంటారు. అందుకే కొరియాలో సంఖ్యలు పలికేప్పుడు నాలుగు పలకరు. అలాగే ఎవరూ నాలుగు సంఖ్యను ఉపయోగించరు. చివరికి వారి అపార్టమెంట్లలో 4వ అంతస్తు కూడా ఉండదు. 3వ అంతస్తు తర్వాత నేరుగా 5వ అంతస్తు వస్తుంది. అయితే, లెక్క ప్రకారం.. 5వ అంతస్తు 4 వస్తుంది.. కాబట్టి అన్ని ఫ్లోర్ల కంటే ఆ అంతస్తులో ఫ్లాట్లు తక్కువ రేటుకు అమ్ముడవుతాయట. 
  • మంచి రోజుల్లోనే ఇళ్లు మారతారు: మన దేశంలో గృహప్రవేశం లేదా అద్దెకు దిగాలంటే ముహూర్తం చూసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే, మనం రోజులో ఎన్ని గంటలకు వెళ్తే మంచిదని చూసుకుంటాం. అయితే, కొరియా ప్రజలు ఏ రోజు మంచిదో చూసుకుని వెళ్తారు. ఈ సందర్భంగా అక్కడి ‘మూవర్స్’ కంపెనీలు తమ వెబ్‌సైట్లలో ఇల్లు మారేందుకు, లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు మంచి, చెడు రోజుల వివరాలను పోస్ట్ చేస్తాయి. ఒక వేళ చెడు రోజుల్లో ఇల్లు మారితే.. దుష్ట శక్తులు వెంటాడుతాయని, మరణం తర్వాత జీవితం ఉండదని నమ్ముతారు. అనుకోని అతిథులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతారనే నమ్మకం కూడా ఉంది. అందుకే, అక్కడ ఇల్లు మారేప్పుడు తప్పకుండా మంచి రోజులు గురించి తెలుసుకుంటారు. 
  • పందులు కల్లోకి మంచిదట: కొన్ని కలలు మంచి చేస్తాయని, మరికొన్ని చెడు చేస్తాయని మనం కూడా నమ్ముతాం. కొరియా ప్రజలకు కూడా అలాంటి నమ్మకం ఉంది. కొరియన్ సంస్కృతి ప్రకారం.. కలలో పందులు కనిపిస్తే.. డబ్బు, అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. కలలో ఎన్ని పందులు కనిపిస్తే అంత ఎక్కువ సంపద లభిస్తుందని భావిస్తారు. 
  • షూ లేదా చెప్పులు గిఫ్ట్‌గా ఇస్తే బ్రేకప్?: కొరియాలో బోలెడంత ప్రేమ దొరుకుతుంది. అంతే త్వరగా బ్రేకప్‌లు కూడా జరుగుతాయి. అయితే, ప్రేమను ఎలాగైన వ్యక్తపరచవచ్చు. కానీ, బ్రేకప్ చెప్పడానికి మాత్రం వారికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అవే.. షూ, చెప్పులు లేదా బూట్లు. ఒక వేళ అమ్మాయి లేదా అబ్బాయి తన లవర్‌కు వాటినికి కానుకగా ఇచ్చినట్లయితే.. ఇక వారితో బంధాన్ని తెంచుకున్నట్లే అని అర్థం. చెప్పులను అక్కడ ‘పారిపోవడం’ లేదా ‘దూరంగా వెళ్లిపోవడం’గా భావిస్తారు. అందుకే.. తమ లవర్‌కు బ్రేకప్ చెప్పేందుకు సింపుల్‌గా వాటిని గిఫ్టుగా పంపిస్తారు. 
  • రెడ్ ఇంక్ పెన్, యమ డేంజర్: మన స్కూళ్లు లేదా కాలేజీల్లో రెడ్ పెన్‌లు తెగ వాడేస్తుంటారు. ముఖ్యంగా మార్కులు దిద్దేందుకు, తప్పులను అండర్‌లైన్ చేసేందుకు ఆ పెన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, కొరియాలో మాత్రం ఆ ఇంకు పెన్ అస్సలు వాడరు. అక్కడి ప్రజలకు రెడ్ ఇంక్ అంటే భయపడతారు. అందుకే, ఎక్కడా ఆ ఇంక్ పెన్నులు విక్రయించరు. ఒక వేళ వాటిని విక్రయించినా.. బొమ్మలు లేదు డిజైన్లు గీయడానికే ఉపయోగించాలి. వాటితో మనుషుల పేర్లు రాయకూడదు. అలా చేస్తే.. ఆ పేరు గల వ్యక్తిని దురదృష్టం వెంటాడుతుందని, చనిపోయే ప్రమాదం ఉందని భావిస్తారు. కొరియాలో రెడ్ ఇంక్ పెన్నులను కేవలం చనిపోయిన వ్యక్తుల పేర్లను రాసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే, అక్కడి స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ రెడ్ ఇంక్ పెన్ వాడరు.  ఒక వేళ విద్యార్థి తన పేరు గానీ, మరో విద్యార్థి పేరునుగానీ రెడ్ పెన్‌తో రాస్తే.. వారు చనిపోయే ప్రమాదం ఉందని భయపడతారు.
  • ప్రపంచం కంటే ఒక ఏడాది పెద్దవాళ్లు: కొరియాలో పుట్టినవారికి మనకంటే ఒక ఏడాది వయస్సు ఎక్కువ ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే.. ఆ లెక్క గురించి తెలుసుకోవల్సిందే. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు బిడ్డ పుట్టిన రోజు నుంచి వయస్సు లెక్కిస్తారు. కానీ, కొరియాలో మాత్రం గర్భ నిర్ధరణ రోజు నుంచే వయస్సును లెక్కిస్తారు. అంటే 9 నెలలో పుట్టినా సరే ఆ బిడ్డకు ఏడాది వయస్సు వచ్చినట్లు లెక్కిస్తారు. ఉదాహరణకు 2020లో ఒక బిడ్డ పుట్టాడనే అనుకుందాం. కొరియా లెక్క ప్రకారం.. అతడి వయస్సును 2020 - 2021 + 1 = 2గా లెక్కిస్తారు. అంటే కొరియా ఏజ్ ప్రకారం ఏడాది ఎక్కువన్నమాట. 

Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?

Also Read: జపాన్‌లో ముక్కలైన వెయ్యేళ్ల ‘కిల్లింగ్ స్టోన్’, 9 తోకల నక్క విడుదల! రష్యా-ఉక్రేయిన్ పోరుతో లింకేంటీ?

Published at : 11 Mar 2022 09:06 AM (IST) Tags: South Korea Korea Men Beards Korea Culture Korea facts Interesting facts about Korea West Korea కొరియా పురుషులు

సంబంధిత కథనాలు

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

వీటిని అతిగా తింటే శరీరంలో విషంగా మారిపోతాయి

Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి

Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

Heart Attack: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

FIR On Srikalahasti CI :  చిక్కుల్లో  శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !