అన్వేషించండి

Fitness Tips: మీ పిల్లలతో రోజూ వ్యాయామం చేయిస్తే... చదువులో రాణిస్తారు

మీ పిల్లలు చదువులతో కుస్తీ పడుతున్నారా? ఎంత చదివినా చదువులో రాణించలేకపోతున్నారా? పరీక్షల్లో సరైన ప్రతిభ కనబరచలేకున్నారా? అయితే ఆ సమస్యలన్నింటినీ అధిగమించడానికి ఈ మార్గాన్ని ఒకసారి అనుసరించి చూడండి. 


Fitness Tips: మీ పిల్లలతో రోజూ వ్యాయామం చేయిస్తే... చదువులో రాణిస్తారు

చిన్నతనంలో పిల్లలు ఆట, పాటల్లో మునిగి తేలడటం సహజం. అలా కాకుండా ఒకేచోట గమ్మున కూర్చుంటే  మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటారా? చిన్నతనంలో శారీరక వ్యాయామం చేయడం వల్ల పిల్లలు పెరిగి పెద్దయ్యాక శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారట. ముఖ్యంగా బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేస్తే వృత్తి రీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారట. అలాంటివాళ్లకు మిడిల్ ఏజ్‌లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయట. 
అంతేనా..  వ్యాయామం నేరుగా మెదడు పెరుగుదలను ప్రేరేపిస్తుంది కూడా. కనుక వ్యాయామాన్ని పొట్ట తగ్గటానికి, లావు తగ్గటానికి అనే కాకుండా ఆరోగ్యం కోసం చెప్పి వారికి అలవాటు చేయాలి తల్లిదండ్రులు. వాళ్లను వ్యాయామానికి పంపే బాధ్యతను లేదా ఇంట్లో తల్లితండ్రులు వ్యాయామం చేసే సమయంలో వారిని జత చేసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

అంతేకాదండోయ్... వ్యాయామం వల్ల పిల్లల్లో  జ్ఞాపక శక్తి బాగా పెరుగుతోందట. దీంతో వారు చదువుతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకుని పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే వారి ఆరోగ్యం కోసం నిత్యం సరైన సమయానికి పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందివ్వాలి. దీంతో వారు శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

60 నిమిషాల వ్యాయామం అవసరం

యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు చెందిన కొందరు సైంటిస్ట్‌లు పిల్లలపై పరిశోధనలు నిర్వహించారు. నిత్యం వ్యాయామం చేసే పిల్లలు, వ్యాయామం చేయని పిల్లలకు సంబంధించి వారు చదువుల్లో ఎలా రాణిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం కనీసం 60 నిమిషాల పాటు వ్యాయామం చేసే పిల్లలు చదువుల్లో కూడా బాగా రాణిస్తారని తెలుసుకున్నారు. అందువల్ల పిల్లల్ని రోజూ క‌నీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్స‌హించాల‌ని, లేదా కనీసం ఆటలు ఆడుకునేందుకు పెద్దలు అనుమతించాలని వారు సూచిస్తున్నారు. మితిమీరిన శారీరక శ్రమ (వ్యాయాయం) కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు త్వరగా ఫ్రాక్చర్ కావడం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల రోజు మొత్తంలో ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం మరో 30 నిమిషాల పాటు పిల్లలతో వ్యాయామం చేపిస్తే సరిపోతోంది.

పిల్లలకు ఎటువంటి ఆహరం పెట్టాలంటే

పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏది చేస్తే అదే నేర్చుకుంటారు. అందుకే ముందు మనలో మార్పు రావాలి. మీరు వాళ్ళ ముందు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి. అది చూసిన పిల్లలు వారు కూడా అదే చేసేందుకు ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు అలవాటు అవుతాయి. పిల్లలకు ఎక్కువుగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాలు పాల పదార్ధాలు వంటివి ఎక్కువగా పెట్టాలి. అంతేకాదు మరీ వాళ్లతో కఠినంగా కూడా ఉండకూడదు. పిల్లలకు బయట దొరికే ఫుడ్ అస్సలు పెట్టకూడదు. అంతేకాదు హోమ్ వర్క్ చేస్తే చాకోలెట్ ఇస్తా అనే మాటలు కూడా వాళ్లకు చెప్పకూడదు. పిల్లలకు ఇంట్లో మనం పనిచేసేటప్పుడు హెల్ప్ చేయమని అడగాలి. అలా చేస్తే వాళ్లకు చిన్నప్పటి నుండే హెల్పింగ్ నేచర్ అలవాటు అవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
CSIR UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget