By: Suresh Chelluboyina | Updated at : 25 Jul 2022 07:33 PM (IST)
Representational Image/Pixabay
వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద కూడా క్రమేనా పెరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూ దోమలు ప్రజలను వణికిస్తాయి. కాబట్టి, పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూడండి. ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే కుండీలు, గుంతల్లో నీరు నిల్వ ఉండకూడదు. ఎందుకంటే డెంగ్యూ కలిగించే దోమలు గుడ్లను పొదిగేది మంచి నీటిలోనే. వర్షాకాలంలో కేవలం దోమల ముప్పే కాదు.. కీటకాలు కూడా దాడి చేస్తుంటాయి. దోమలు, ఆయా కీటకాలు కుట్టినప్పుడు మనకు విపరీతమైన దురద పుడుతుంది. దీంతో మనం వాటిని అదేపనిగా గోకేస్తాం. కొన్ని చిట్కాలను పాటిస్తే ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కీటకాలు కుడితే దురద ఎందుకు వస్తుంది?: మన శరీరంలోని వేడికి దోమలు ఆకర్షితం అవుతాయి. దోమలు, కీటకాలు కుట్టేప్పుడు మనకు చాలా దురదగా ఉంటుంది. వెంటనే మనకు ఆ ప్రాంతంలో గోకాలనిపిస్తుంది. దోమలు రక్తాన్ని తాగేందుకు సూదిలాంటి మొనను మన శరీరంలోకి గుచ్చుతాయి. ఆ సమయంలో అవి మీ చర్మంలోకి లాలాజలాన్ని ఇంజెక్ట్ చేస్తాయి. దీంతో మీ శరీరం లాలాజలానికి ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అక్కడ గడ్డలా ఏర్పడుతుంది. దురద వస్తుంది. కొందరికి కాటుకు తేలికపాటి ప్రతిచర్య మాత్రమే ఉంటుంది. కొందరికి మాత్రం ఆ నొప్పి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ ప్రాంతం ఎర్రగా మారడం, పుండ్లు పడటం లేదా వాపుగా మారడం చూస్తుంటాం.
ఇక కీటకాల విషయానికి వస్తే.. అవి దోమల్లా కాటు వేయవు. రక్తం తాగేందుకు బలంగా చర్మాన్ని కొరుకుతాయి. ఫలితంగా వాటి లాలాజలం చర్యానికి తగిలి ప్రతిస్పందన ఏర్పడుతుంది. అదే ‘దురద’. ఒక్కోసారి ఆయా కీటకాల లాలాజటం విషపూరితం కూడా కావచ్చు. కొన్ని కీటకాలు కరిచిన వెంటనే తల తిరగడం, వికారం లేదా జ్వరం వస్తాయి. కొందరు అలర్జీకి గురవ్వుతారు. అలాంటి సమయంలో మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్సను నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్య మరింత పెద్దది కావచ్చు.
దోమ, కీటకాల కాటు వల్ల కలిగే దురద వల్ల వల్ల ఉపశమనం ఎలా?:
దోమ,- కీటకాల కాటు వల్ల కలిగే దురద చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చికాకుగా ఉంటుంది. పదే పదే గోక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఏ పని చేయలేం. చాలా చికాకు వేస్తుంది. దురద పుట్టిన చోట చేతులు పెట్టి మరో చోట తాకితే అక్కడ కూడా దురద ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు ఇంటి చిట్కాలతో దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమ కాటు వేసిన చోట కలబంద, టూత్ పేస్ట్, తేనె, మంచు, ఏదైనా తైలం, మంచు, అరటి తొక్క వంటివి రాస్తే దురద తగ్గుతుంది.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!
Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు
గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి
ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!
Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?
National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?