ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది.
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
YSRCP Leader Ambati Rambabu: వైసీపీ లీడర్ అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో ఒకదాంట్లో బెయిల్ వచ్చింది. ఇంకా చాలా కేసులు ఉన్నందున ఇంకా జైల్లో ఉండాల్సి వస్తోంది.

YSRCP Leader Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు ఉన్న మాజీ మంత్రి , వైసీపీ లీడర్ అంబటి రాంబాబుకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న ఆయనకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన విడుదల కావడం లేదు. అసలు రాంబాబుకు ఏ కేసులో బెయిల్ వచ్చింది? ఆయన ఇంకా జైలులోనే ఎందుకు ఉండాల్సి వస్తోంది?
గుంటూరు జిల్లాలో నమోదైన ఒక కేసు విషయంలో అంబటి రాంబాబుకు గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ చేసిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు, వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే.
రిమాండ్‌లోనే ఎందుకు ఉండాలి?
కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, మరి అంబటి రాంబాబు జైలు నుంచి ఎందుకు విడుదల కావడం లేదని సందేహం చాలా మందికి ఉంటుంది. దానికి ప్రధాన కారణం పీటీ వారెంట్. అంబటి రాంబాబుపై కేవలం ఒక్క కేసు మాత్రమే లేదు. ఆయనపై మరికొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు ఉండటంతో ఆయన ప్రస్తుతానికి రిమాండ్‌లోనే కొనసాగాల్సి ఉంటుంది.
చట్ట ప్రకారం, ఒక వ్యక్తిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నప్పుడు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తేనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబుకు ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, మిగిలిన కేసుల్లో కూడా బెయిల్ మంజూరు అయితే తప్ప ఆయన విడుదల సాధ్యం కాదు.
రాజకీయంగా ఈ కేసు ప్రాముఖ్యత
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వివిధ స్కామ్‌లు, చేసిన కామెంట్స్‌పై గత ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ కీలక నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలు ఆధారంగా చేసుకొని పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంబటి రాంబాబు తన కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు అదే వ్యాఖ్యు ఆయనను చట్టపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతానికి అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో బెయిల్ పొందినప్పటికీ మరికొన్ని కేసుల్లో పీటీ వారెంట్ జారీ అయినందున విడుదల ఇప్పట్లో లేదనే చెప్పాలి. వాటిలో కూడా బెయిల్ వస్తేనే ఆయనకు విడుదల ఉంటుంది.
ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన భయపడని వ్యక్తి అంబటి రాంబాబు.
— రాజారెడ్డి ysrcp (@rajareddzysrcp) February 9, 2026
అభిమానులకు అభివాదం చేస్తున్న అంబటి రాంబాబు. pic.twitter.com/izbpqlNlPa
మరోవైపు గతేడాది నవంబర్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆయన ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో పోలీసు అధికారులను దూషించారని అప్పట్లోనే పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు అంబటి రాంబాబుపై 44 కేసులు ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా పోలీసులు పీటీ వారెంట్ జారీ చేస్తున్నారు.
Frequently Asked Questions
అంబటి రాంబాబుకు ఏ కేసులో బెయిల్ మంజూరైంది?
అంబటి రాంబాబు ఇంకా జైలులోనే ఎందుకు ఉన్నారు?
అంబటి రాంబాబుపై వేరే కేసుల్లో కూడా పీటీ వారెంట్లు ఉన్నాయి. అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తేనే ఆయన విడుదల అవుతారు.
చట్ట ప్రకారం, ఒక వ్యక్తికి ఒకే కేసులో బెయిల్ వస్తే విడుదల అవుతారా?
కాదు, ఒక వ్యక్తిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నప్పుడు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తేనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై కేసులు నమోదు కావడానికి కారణమేమిటి?
గత ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ కీలక నేతలు చేసిన స్కామ్‌లు, వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం మారిన తర్వాత కేసులు నమోదు అవుతున్నాయి.























