ఈ ఒప్పందం కొన్ని అమెరికన్ వస్తువులకు జీరో టారిఫ్ అందిస్తుంది. భారత్ తన మార్కెట్లోకి ఎంపిక చేసిన రంగాల్లో మాత్రమే అమెరికన్ ఉత్పత్తులకు అనుమతి ఇస్తుంది.
India US Trade Deal: అమెరికాతో $500 బిలియన్ల వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌కు భారత్ ఏమిచ్చింది?
India US Trade Deal: అమెరికా భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ప్రకారంఎంపిక చేసిన రంగాల్లో మాత్రమే అమెరికన్ ఉత్పత్తులు భారత్ మార్కెట్‌లోకి వస్తాయని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.

India US Trade Deal: భారత్- అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం గత వారం ఎట్టకేలకు ముగిసింది. ఈ ఒప్పందం గురించిన సమాచారాన్ని మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పంచుకున్నారు, ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దానిని ధృవీకరించారు. భారత్‌పై టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు అధ్యక్షుడు ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఈ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలేంటీ, భారత్ ఏ రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించిందనే ప్రశ్నలు వారం రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.
దేశీయ ప్రయోజనాలపై రాజీ పడేది లేదన్న పియూష్ గోయల్
భారత్- అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. దీనిలో అమెరికన్ ఉత్పత్తులకు ఎంపిక చేసిన రంగాల్లో మాత్రమే భారత్ తన మార్కెట్‌లోకి అనుతి ఇస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి శనివారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కొన్ని అమెరికన్ వస్తువులకు జీరో టారిఫ్ ఉందని పేర్కొన్నారు. దేశీయ పరిశ్రమలు, రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం లేకుండా వారి రక్షణకు కేంద్రం భరోసా ఇస్తుందని గోయల్ అన్నారు. ఆయన ప్రకారం, ఈ ఒప్పందం భారత్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. 1.4 బిలియన్ ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
అమెరికా ఏయే రంగాలలో ప్రవేశించనుంది?
ఈ ఒప్పందం ప్రకారం కొన్ని US ఉత్పత్తులకు జీరో టారిఫ్ ఉంటుంది. యాక్సెస్ వైన్, స్పిరిట్‌లకు పరిమిత సర్దుబాట్లతో ఉపశమనం లభించింది. సౌందర్య సాధనాల రంగానికి ఊరట లభించనుంది. కంప్యూటర్లు, కొన్ని IT-సంబంధిత ఉత్పత్తుల దిగుమతులపై రాయితీలు ఉంటాయి. ఫైబర్‌స్కోప్‌లు, లాపరోస్కోప్‌ల వంటి వైద్య పరికరాలకు ప్రాధాన్యత ఇస్తారు. భారత్ వ్యవసాయ రంగం దేశం అయినందుకున మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి ఇవ్వలేదు.
జన్యుపరంగా మార్పు చేసిన (GM) అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లోకి ప్రవేశం కల్పించడం లేదు. అంతేకాకుండా, దేశంలో సమృద్ధిగా ఉత్పత్తి అయ్యే పంటలను టారిఫ్ మినహాయింపుల నుంచి మినహాయించారు. మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, రాగులు, అరటిపండ్లు, సిట్రస్ పండ్లు, చిక్‌పీస్, చక్కెర, సోయాబీన్స్, ఇతర ధాన్యాలను ఈ జాబితాలో చేర్చారు. సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. భారత్ మాంసం, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, ఇథనాల్, పొగాకు వంటి రంగాలను కూడా ఈ ఒప్పందం నుంచి మినహాయించింది. వాణిజ్యాన్ని ఏకకాలంలో ప్రోత్సహించడంతోపాటు దేశీయ రైతులను, స్థానిక పరిశ్రమలను రక్షించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఇది స్పష్టంగా చూపిస్తుంది.
భారతీయ ఎగుమతిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
ఈ వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో గణనీయమైన అవకాశాలు కల్పిస్తోంది. అనేక వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు సున్నా సుంకాలతో అమెరికాలోకి ప్రవేశిస్తాయి. ఈ జాబితాలో ఉన్న ఉత్పత్తులు ఇవే: టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు; కొబ్బరి నూనె, కూరగాయల మైనం; తమలపాకు, చెస్ట్‌నట్‌లు; అవకాడో, జామ, మామిడి, కివి; బొప్పాయి, పైనాపిల్, పుట్టగొడుగులు; కూరగాయల వేర్లు, బార్లీ; బేకరీ ఉత్పత్తులు, కోకో ఉత్పత్తులు; నువ్వులు, గసగసాలు.
జీరో టారిఫ్ సౌకర్యం భారత రైతులు, ఉద్యానవన ఉత్పత్తిదారులు, ఆహార ప్రాసెసింగ్ రంగానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇది అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని కూడా బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Frequently Asked Questions
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం యొక్క ముఖ్యాంశాలు ఏమిటి?
అమెరికా ఏయే రంగాలలో భారత్‌లోకి ప్రవేశించనుంది?
వైన్, స్పిరిట్‌లు, సౌందర్య సాధనాలు, కంప్యూటర్లు, IT-సంబంధిత ఉత్పత్తులు, మరియు వైద్య పరికరాలు వంటి రంగాలలో అమెరికన్ ఉత్పత్తులకు ప్రవేశం లభిస్తుంది.
జన్యుపరంగా మార్పు చేసిన (GM) అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ అనుమతి ఇస్తుందా?
లేదు, జన్యుపరంగా మార్పు చేసిన (GM) అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లోకి ప్రవేశం లేదు.
భారతీయ ఎగుమతిదారులకు ఈ ఒప్పందం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
అనేక వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు సున్నా సుంకాలతో అమెరికాలోకి ప్రవేశిస్తాయి. ఇది భారతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుంది.























