Allu Cinemas Dolby Screen : హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
Alli Cinemas Largest Screen : దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ థియేటర్ త్వరలోనే హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. బాలీవుడ్ 'ధురంధర్ 2'తో బిగ్ థియేటర్ ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది.

India's Largest Dolby Screen To Open In Hyderabad : మూవీ లవర్స్, హైదరాబాద్ వాసులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆడియన్స్‌కు విజువల్ వండర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్ థియేటర్ అందుబాటులోకి రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన అల్లు సినిమాస్ మార్చి 19న హైదరాబాద్ కోకాపేటలో ప్రారంభం కానుంది.
ఆ మూవీతో...
అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్స్‌తో కలిసి వరుసగా థియేటర్స్ ప్రారంభిస్తుండగా... హైదరాబాద్ వాసులకు ప్రపంచ స్థాయి గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ థియేటర్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డాల్బీ విజన్ 3D ప్రొడక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో అల్లు సినిమాస్ పేరిట అల్లు స్టూడియోస్ క్యాంపస్‌లో ఈ ప్రీమియం మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన రణవీర్ సింగ్ 'ధురంధర్' సీక్వెల్‌తో (ధురంధర్ 2) ఈ థియేటర్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
గతేడాది చివర్లో వచ్చిన 'ధురంధర్' 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సీక్వెల్ కోసం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'గాయపడ్డ సింహం' ఏం చేసిందంటే? - నవ్వులు పూయిస్తోన్న తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ట్రైజర్
ఏంటీ స్పెషాలిటీ?
ఈ థియేటర్లో స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పు కలిగి ఉండనుండగా... DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో ఉంటుంది. 3D ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యుత్తమ 'DolbyVision'తో పాటు 'Dolby3D' ప్రొటక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం 'DolbyAtmos' సౌండ్ సిస్టమ్ యాడ్ చేశారు. ఆడియన్స్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు అద్భుతమైన సౌండ్, సౌకర్యవంతంగా వీక్షించేందుకు 'పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్'ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే లోపలి భాగం పనులు పూర్తి కాగా... బిల్డింగ్ బయట వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవి త్వరగా పూర్తై థియేటర్ త్వరగా అందుబాటులోకి రావాలని సెలబ్రిటీలతో పాటు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెన్ కావాలని అంటున్నారు.
























