అన్వేషించండి

లగ్జరీ కార్ల భారీ ధర వెనుక అసలు కారణాలు ఇవే - ఇలాంటి విషయాల కోసమే డబ్బు ఖర్చు పెట్టేది

లగ్జరీ కార్లు ఎందుకు అంత ఖరీదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంజినీరింగ్ నుంచి బ్రాండ్ విలువ వరకు, మీరు డబ్బు చెల్లించేది అసలు దేనికో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Why luxury cars are expensive: లగ్జరీ కారు రేటు తెలియగానే చాలామందికి మొదట వచ్చే ఫీలింగ్ ఒక్కటే - “ఇంత ఖరీదేంటి?”. ఆ ధరకు రెండు మిడ్‌రేంజ్ కార్లు లేదా కొన్ని నగరాల్లో చిన్న ఫ్లాట్ కూడా వస్తుందేమో అనే ఆలోచన సహజం. అదే డబ్బుతో పట్టణాల్లో అయితే మంచి ఇల్లు కూడా కొనొచ్చు. అయితే... లగ్జరీ కార్ల ధర వెనుక కారణం లెదర్ సీట్లు, పెద్ద స్క్రీన్లు మాత్రమే కాదు, అసలు కథ చాలా లోతుగా ఉంటుంది.

రిఫైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఇంజినీరింగ్

సాధారణ కార్లను భద్రత, మైలేజ్, ధరను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. కానీ లగ్జరీ కార్ల లక్ష్యం వేరే. ఇక్కడ రిఫైన్‌మెంట్ ముఖ్యం. రోడ్డు మీద చిన్న గుంత కూడా లోపల కూర్చున్న వారికి తెలీకూడదు. స్టీరింగ్ తిప్పితే చేతికి సరైన ఫీల్ రావాలి, రోడ్డు మీద శబ్దం దాదాపు వినిపించకూడదు - ఇవన్నీ లగ్జరీ కార్ల ఇంజినీరింగ్ లక్ష్యాలు.

అందుకే వీటిలో అడాప్టివ్ సస్పెన్షన్‌, ఎయిర్ సస్పెన్షన్‌, రోడ్డును ముందే చదివే టెక్నాలజీలు ఉంటాయి. ఇంజిన్ శక్తివంతమైనదే కాదు, మృదువుగా పని చేయాలి. ఈ స్థాయి ఫినిష్ తీసుకురావడానికి కంపెనీలు వేల గంటల టెస్టింగ్ చేస్తాయి. అదే ఖర్చు ధరలో కనిపిస్తుంది.

కాలంతో పాటు మెరుగ్గా ఉండే మెటీరియల్స్

లగ్జరీ కారులో కూర్చుంటే తేడా వెంటనే తెలుస్తుంది. నకిలీ మెటీరియల్‌ కాదు - అసలైన మెటీరియల్‌. గట్టిగా పట్టుకుంటే ఊడిపోయే బటన్లు కాదు - మెరుగైన మన్నిక ఇచ్చే మెటల్ స్విచ్‌లు. సీట్లకు ఉపయోగించే లెదర్ కూడా సంవత్సరాల పాటు పాడవకుండా ఉండేలా ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు.

ఇవి తయారు చేయడం కంటే, ఎలా అమర్చారు అన్నదే అసల ఖర్చు. చేతితో కుట్టే స్టిచింగ్, డాష్‌బోర్డ్‌పై సమానంగా కనిపించే వుడ్ గ్రెయిన్ - ఇవన్నీ కాలంతో పాటు అందాన్ని సంరక్షిస్తాయి. అందుకే పదేళ్ల తర్వాత కూడా చాలా లగ్జరీ కార్లు కొత్తగానే కనిపిస్తాయి.

ముందుగానే వచ్చే టెక్నాలజీ

ఈ రోజు లగ్జరీ కార్లలో కనిపించే చాలా ఫీచర్లు కొన్నేళ్ల తర్వాతే సాధారణ/మిడ్‌-రేంజ్‌ కార్లలో కనిపిస్తాయి. పెద్ద కర్వ్‌డ్‌ స్క్రీన్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్, నైట్ విజన్ కెమెరాలు, అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్‌, మసాజ్ సీట్లు, AR నావిగేషన్ - ఇవన్నీ ముందుగా లగ్జరీ సెగ్మెంట్‌లోనే వస్తాయి.

ఈ టెక్నాలజీ అభివృద్ధికి భారీ ఖర్చు అవుతుంది. మీరు ఎర్లీ అడాప్టర్‌గా ఉండటానికి కూడా డబ్బు చెల్లిస్తున్నట్టు చెప్పొచ్చు.

తక్కువ సంఖ్యలో తయారీ, ఎక్కువ కస్టమైజేషన్

లక్షల సంఖ్యలో తయారయ్యే కార్లకు ఖర్చు తక్కువ అవుతుంది. కానీ లగ్జరీ కార్లు అంత పెద్ద సంఖ్యలో తయారు కావు. పైగా, ప్రత్యేకమైన పెయింట్‌, మీకు నచ్చిన ఇంటీరియర్‌, ప్రత్యేక వీల్స్ లాంటి కస్టమైజేషన్ ఉంటాయి. ప్రతి మార్పు తయారీని క్లిష్టం చేస్తుంది. ధర పెరగడానికి ఇది మరో కారణం.

బ్రాండ్ చరిత్ర, పేరు విలువ

Mercedes-Benz, BMW, Lexus, Bentley లాంటి పేర్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. మీరు కేవలం కారు కొనడం కాదు - ఆ బ్రాండ్ కథలో భాగమవుతున్నారు. ఇది రీసేల్ విలువ, సర్వీస్ నెట్‌వర్క్, ఓనర్‌షిప్ ప్రైడ్‌ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

కారును మించిన ఓనర్‌షిప్ అనుభవం

లగ్జరీ కార్ షోరూమ్ ఒక లాంజ్‌లా ఉంటుంది. సర్వీస్ అంటే టెన్షన్ ఉండదు. పికప్-డ్రాప్, ప్రత్యేకమైన ప్రాధాన్యత, చేయి తిరిగిన టెక్నీషియన్లు వంటివన్నీ ఓనర్‌షిప్ అనుభవంలో భాగం. కాబట్టి, మీరు చెల్లించే డబ్బులో ఈ సౌకర్యాల ఖర్చు కూడా ఉంటుంది.

లగ్జరీ కారు అంటే కేవలం పాయింట్ A నుంచి Bకి వెళ్లడం కాదు. డోర్ మూసినా శబ్దం రాకపోవడం, డ్రైవ్ చేసే సమయంలోనూ నిశ్శబ్దం, ప్రతి చిన్న విషయంపై చూపిన శ్రద్ధ - ఇవన్నీ కలిస్తేనే లగ్జరీ. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Kawasaki Z650 కంటే రూ.33,000 అదనపు ధరకు Kawasaki Z650 Sలో ఏం ఉంది? రెండు మోడళ్ల కంపారిజన్‌
Kawasaki Z650 vs Z650 S: ధరలో తేడా ఎంత? కొత్త మోడల్‌లో వచ్చిన మార్పులేంటి?
Force e-Traveller: ఫోర్స్‌ మోటార్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ట్రావెలర్స్‌, అంబులెన్స్‌.. తుది పరీక్షల్లో EVలు
Force Motors ట్రావెలర్‌ EVలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఎలక్ట్రిక్ అంబులెన్స్ కూడా!
ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!
లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లేవాళ్ల కోసమే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లు.. కనీసం 400km రేంజ్‌ గ్యారెంటీ!
BMW F 450 GS లో Base నుంచి GS Trophy వరకు నాలుగు వేరియంట్లు.. ఏ వేరియంట్‌ బెటర్‌?
BMW అడ్వెంచర్ బైక్ F 450 GSలో 4 వేరియంట్లు.. ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Embed widget