Eggs Benefits: గోధుమ రంగు గుడ్లు Vs తెలుపు రంగు గుడ్లు - వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించే పదార్థం కోడి గుడ్లు. అయితే శరీరానికి గోధుమ రంగు గుడ్డు తింటే మంచిదా తెలుపు రంగు గుడ్డు మంచిదా అని అందరికీ డౌట్ వస్తుంది కదా..!
రోజుకో గుడ్డు ఆరోగ్యానికి మంచిదని తరచూ నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని అందుతాయి. గుడ్లులో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజాలు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అన్ని పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో లభించే కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం మన మెదడు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవే కాదు అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే గుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజు గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గుడ్లు కోలిన్ ఉండే గొప్ప మూలం. చాలా మందికి ఇతర ఆహార వనరుల నుండి లభించని పోషకం. మెదడు శరీరంలోని ఇతర ముఖ్యమైన విధులను నియంత్రించడంలో సహాయపడే విటమిన్ల సమూహమే కోలిన్. గుడ్డు సొనలు కళ్ల సంరక్షణకి సహాయపడతాయి. లూటీన్, జియాక్సంతిన్ అనే రెండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇవి కంట్లో ఉండే రెటీనా పొరను బలోపేతం చేస్తాయి. కళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ఇది. కంటిలో శుక్లాలు, కంటి చూపు మందగించడం వంటి వాటిని దూరంగా ఉంచుతుంది.
మనం సాధారణంగా తెల్లగా ఉండే కోడిగుడ్లనే చూస్తూ ఉంటాం. కానీ బ్రౌన్ కలర్ లో కనిపించే గుడ్లు తక్కువగా కనిపిస్తాయి. కొన్ని రకాల గుడ్లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించడానికి ఫ్రీ రాడికల్స్ కు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గోధుమ గుడ్లు Vs తెలుపు గుడ్లు
గోధుమ రంగు, తెలుపు రంగు గుడ్లు అందించే పోషకాలు విషయంలో ఎటువంటి తేడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే బ్రౌన్ గుడ్లు తెలుపు గుడ్లు కంటే ఖరీదు. అవి పెట్టె కోళ్లలో కొద్దిగా తేడాలు ఉంటాయి. అలాగే కోళ్ళను పెంచే విధానం, వాటికి ఇచ్చే ఆహారంలో ఉండే వ్యత్యాసం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గోధుమ రంగులో ఉండే గుడ్లు కొద్దిగా ఖరీదుగా ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
సంప్రదాయ గుడ్లు: ఇవి మనం సాధారణంగా మార్కెట్లల్లో చూసేవి. వీటిని రోజువారీ వినియోగం కోసం ఉపయోగిస్తూ ఉంటారు.
సేంద్రీయ గుడ్లు: ఈ గుడ్లు ఎక్కువగా సూపర్ మార్కెట్లల్లో లభిస్తాయి. వాటిని పెట్టె కోళ్ళకి సేంద్రీయ ఆహారం ఇస్తారు.
పాశ్చరైజడ్ గుడ్లు: ఈ గుడ్లు పెట్టె కోళ్ళు మొక్కలు, కీటకాలతో కూడిన సహజమైన ఆహారాన్ని తింటాయి.
ఒమేగా-3 సుససంపన్నమైన గుడ్లు: ఇవి అత్యంత ఖరీదైనవి. ఈ గుడ్లు పెట్టె కోళ్ళకి ఫీడింగ్ లో అవిసె గింజలు, ఒమేగా-3 ఆహార పదార్థాలు ఎక్కువగా ఇస్తారు.
గుడ్డు తినని వారితో పోలిస్తే తినే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉన్నట్టు కొత్త అధ్యయనంలో కనుగొన్నారు. గుడ్డులో ఉండే ప్లాస్మా కొలెస్ట్రాల్ గుండె జీవక్రియలలో పోషిస్తున్న పాత్రను పరిశోధించారు. గుడ్లను మితంగా తినే వ్యక్తుల రక్తంలో అపోలిపోప్రొట్రీన్ A1 అని పిలిచే ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఇది మంచి ప్రొటీన్ జాబితాలోకి వస్తుంది. ఈ ప్రొటీన్ ఉన్న వ్యక్తులు తమ రక్తంలో అధిక స్థాయిలో హెచ్డిఎల్ అణువులను కలిగి ఉంటారు. గుండె ఆరోగ్యానికి హెచ్డిఎల్ చాలా అవసరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: గుడ్ న్యూస్ గుండె పోటు తర్వాత గుండెని రక్షించేందుకు ఇంజెక్షన్ - శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Also Read: పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, మీరు కూడా ట్రై చేయండి