News
News
X

Glaucoma: కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే

కంటి చూపుని పోగొట్టి శాశ్వతంగా అంధులుగా మార్చే వ్యాధి గ్లకోమా. ఈ వ్యాధి గుర్తించే లోపే దాదాపు చూపు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది.

FOLLOW US: 
Share:

కళ్ళు చాలా సున్నితమైనవి. కానీ వాటి మీద మనం తక్కువ శ్రద్ధ చూపిస్తాం. కళ్ళకు సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవడం మీద ఆసక్తి చూపించము.  కంటికి సంబంధించిన వ్యాధుల్లో గ్లకోమా ఒకటి. ఎటువంటి లక్షణాలు కనిపించకుండా 90 శాతం చూపును పోగొడుతుంది. ప్రతి ఒక్కరూ ఏడాది ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి. 

గ్లకోమా అంటే ఏంటి?

మయో క్లినిక్ ప్రకారం గ్లకోమా అనేది ఆప్టిక్ నాడిని దెబ్బతీసే పరిస్థితి. ఇది కంటి నుంచి మెదడుకి సంకేతాలు పంపిస్తుంది. మంచి దృష్టికి ఆప్టిక్ నాడి చాలా ముఖ్యమైనది. కంటికి అధిక ఒత్తిడి తగిలినప్పుడు ఈ నరాలు దెబ్బతింటాయి. అలా జరగడం వల్ల కంటి చూపు మందగిస్తుంది.

గ్లకోమా కారణాలు ఏంటి?

60 ఏళ్లు పైబడిన వారిలో గ్లకోమా అంధత్వానికి దారితీస్తుంది. అయితే గ్లకోమా వల్ల వచ్చే అంధత్వాన్ని ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే కంటి చూపు పోకుండా కాపాడుకోవచ్చు. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం గ్లకోమా అనేది వయస్సు సంబంధిత కంటి సమస్య. సుమారు మూడు మిలియన్ల మంది అమెరికన్లని ఇది ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తమగా కంటి శుక్లం తర్వాత అంధత్వానికి ఇది రెండో ప్రధాన కారణం. ఎటువంటి కారణం లేకుండా కూడా గ్లకోమా సంభవిస్తుంది. అయితే దీని ప్రభావితం చేసే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో మొదటిది కంటి మీద ఒత్తిడి. కంటి లోపల ఐవోబి అనేది డ్యామేజ్ అవడం వల్ల నరాలు దెబ్బతిని చూపుని కోల్పోవడం జరుగుతుంది.

గ్లకోమా లక్షణాలు

☀తీవ్రమైన కంటి నొప్పి

☀తీవ్రమైన తలనొప్పి

☀వికారం లేదా వాంతులు

☀అస్పష్టమైన దృష్టి

☀కాంతి చూడలేకపోవడం

☀కళ్ళు ఎర్రబడటం

గ్లకోమా ప్రమాద కారకాలు

మయో క్లినిక్ ప్రకారం కొన్ని లక్షణాలు కనిపించే లోపే గ్లకోమా దృష్టిని దెబ్బతీస్తుంది. అందుకే మీలోని ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను కలవడం చాలా ముఖ్యం.

☀కంట్లో ఒత్తిడి

☀మీ వయస్సు 55 కంటే ఎక్కువగా ఉంటే కంటి పరీక్షలు తప్పనిసరి

☀కళ్ళు నల్లగా మారిపోవడం

☀కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉంటే జాగ్రత్త పడాలి

☀మధుమేహం, మైగ్రేన్, అధిక రక్తపోటు, అనీమియా వంటి కొన్ని వైద్య పరిస్థితులు

☀కార్నియాస్ దెబ్బతినడం

☀దూరదృష్టి లేదా దగ్గర వస్తువులు చూడలేకపోవడం

☀కంటి గాయం లేదా కొన్ని రకాల కంటి శస్త్ర చికిత్సలు 

☀కార్టికో స్టెరాయిడ్ మందులు, కంటి చుక్కలు ఎక్కువ కాలం పాటు తీసుకోవడం

గ్లకోమా నివారణ ఎలా?

గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఐ డ్రాప్స్ వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కళ్ళు దెబ్బతినకుండా రక్షించుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: రోజూ జస్ట్ 15 నిమిషాలు మీ ఫోన్ పక్కన పెట్టండి - ఈ అద్భుతాలు చూస్తారు!

Published at : 14 Mar 2023 06:20 AM (IST) Tags: Eye Protection Glaucoma Eye Care Eye Care Tips Glaucoma Symptoms Glaucoma Signs

సంబంధిత కథనాలు

Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?

Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి

High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల