World Down Syndrome day 2024 : 'మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి'.. డౌన్ సిండ్రోమ్ వ్యక్తుల ఆవేదన
Down Syndrome day : ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ కలిగిన పిల్లలు, వ్యక్తులు కూడా సామాన్యులుగానే గుర్తించాలనే ఉద్దేశంతో వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే చేస్తున్నారు. ఇంతకీ డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
International Down Syndrome day 2024 : డౌన్ సిండ్రోమ్ అనేది అత్యంత సాధారణ క్రోమోజోమ్ రుగ్మత. వాడుక భాషలో చెప్పాలంటే ఇది మేధో వైకల్యం ఛాయలను కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 800 మందిలో ఒకరు ఈ రుగ్మతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. డౌన్ సిండ్రోమ్, మేధోపరమైన వైకల్యాలున్న వారు.. మూసపద్ధతుల కారణంగా వారిని తక్కువగా అంచనా వేస్తారు. ఏ పనివారితో కాదు అనే రీతిలో వారిని ట్రీట్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్లా భావించి.. వారిని తక్కువ అంచనా వేస్తారు. కొందరిని అయితే చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. ఇలాంటి వివక్షను పోగొట్టాలనే నేపథ్యంతో ఏటా వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే (Down Syndrome day 2024) చేస్తున్నారు.
జన్యుపరమైన కారణాలు ఇవే..
డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిలో మేధోపరమైన వైకల్యం బాల్యంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిగర్భంలో.. మియోసిస్ సమయంలో క్రోమోజోమ్ జత విడిపోవడంలో వైఫల్యం చెంది.. మరో కణానికి వెళ్తాయి. 95 శాతం కేసులలో ఇలాగే జరుగుతుంది. అందువల్ల వ్యక్తి క్రోమోజోమ్ గణన 46 కంటే ఒకటి ఎక్కువగా 47 ఉంటుంది. ఇది డౌన్ సిండ్రోమ్కు దారి తీస్తుంది. ఈ సమస్యకు దారి తీసే మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే.. తండ్రి క్రోమోజోమ్లో అసాధారణమైన లక్షణాలు దీనికి కారణమవుతాయి.
స్టీరియోటైప్లో ట్రీట్ చేయడం మానుకోండి..
డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిని మూస పద్ధతిలో ట్రీట్ చేయకుండా నార్మల్గా ట్రీట్ చేస్తే అది వారి పరిస్థితిని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అయినా సరే కొందరు వారి పట్ల స్టీరియోటైప్ విధానంలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవి వారిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. మంచిగా చూసుకోవడం వేరు.. తక్కువగా చూడడం వేరు. ఇలాంటివి వారికి తెలియదు అనుకుంటారు కానీ.. కొన్ని మూసపద్ధతులు వారిని మనోవేధనకు గురి చేస్తాయి.
మీలాగే మేము కూడా.. కాకుంటే కాస్త భిన్నం
మనుషులందరూ భిన్నంగా ఉంటారు. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు కూడా కాస్త భిన్నంగా ఉంటారు. అంతమాత్రానా వారిని తక్కువగా చూడడం ఎంత వరకు కరెక్ట్. అన్ని బాగున్న ఏ ఇద్దరూ వ్యక్తులు కూడా ఒకేవిధంగా ప్రవర్తించరు. ఒకే విషయాలను ఇష్టపడరు. అందరిలాగే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత గుర్తింపు, ఆసక్తి, ఇష్టాలు ఉంటాయి. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు స్పెషల్ ఐడెంటింటీ ఉంటుంది. అంతేకానీ వారికి మేధోవైకల్యం ఉందని వారిని దూరం పెట్టాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెప్తూ.. ఈ డౌన్ సిండ్రోమ్ డేని నిర్వహిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు 2012.. మార్చి 21 నుంచి వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి అధికారికంగా దీనిని నిర్వహిస్తుంది.
డౌన్ సిండ్రోమ్ లక్షణాలు
డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన, మెంటల్ రిటార్డేషన్ పోషకాహార వ్యాధులతో కలిపి ఉంటుంది. ఇది క్రోమోజోమ్ 21 మూడోవ కాపీని కలిగి ఉండడం వల్ల కలుగుతుంది. దీనికి మూడు రూపాలు ఉంటాయి. సింపుల్ ట్రిసోమి 21, ట్రాన్స్ లోకేషన్ ట్రిసోమి, మొజాయిక్ ట్రిసోమి. అల్జీమర్స్ వ్యాధి చిన్ననాటి నుంచే మొదలవుతాయి. కళ్లు కాస్త వాలుగా, ముక్కు చదునుగా.. కాస్త పొట్టిగా ఉంటారు. వీరిలో గుండె లోపాలు, థైరాయిడ్ పనితీరు, పోషకాహార లోపాలు కూడా ఉంటాయి. వీరిలో జీవక్రియ రేటు నెమ్మదిగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా హిప్పోకాల్ వాల్యూమ్ నష్టం జరుగుతుంది. వినికిడి తక్కువ. ఐక్యూ కూడా 50 నుంచి 70 శాతం ఉంటుంది.
పెరుగుతున్న ఆయుష్షు రేటు
డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు 40 శాతం ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఎండోకార్డియల్ పరిపుష్టిని ప్రభావితం చేస్తాయి. డౌన్ సిండ్రోమ్ అత్యంత సాధారణ కార్డియాక్ లోపంగా చెప్తారు. థైరాయిడ్ గ్రంథి వీరిలో పనిచేయదు. లుకేమియా సమస్య పెరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు మెరుగైన చికిత్స, సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల వారి ఆయువు రేటు గణనీయంగా పెరిగింది. 1960 డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు కేవలం పది సంవత్సరాలు జీవించగా.. 2007వ సంవత్సరానికి వారి వయసు 47 సంవత్సరాలకు పెరిగింది.
Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే.. గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 91 శాతం ఎక్కువట