News
News
X

Alcohol: ఆల్కహాల్ మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి!

ఆల్కాహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం. అది తెలుసుకుని దాన్ని మానేయాలని అనుకోవడం చాలా స్వాగతించే విషయం. మరి ఒక్కసారిగా తాగడం మానేస్తే శరీరంలో ఏయే మార్పులు వస్తాయో తెలుసా..

FOLLOW US: 

ద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరూ చెప్పే మాటే కాదు చివరికి తాగే మందు బాటిల్ మీద కూడా అదే ఉంటుంది. మద్యానికి బానిసలు కావడం వల్ల ఎంతో మంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మరి కొంతమందేమో తాగి డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యపానం వల్ల అన్నీ విధాలా నష్టాలే తప్ప ప్రయోజనాలు ఉండవు అని పెద్దలు చెబుతుంటారు. అందుకే కొంతమంది ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వలనో లేదా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా మందు తాగడం మానేయాలని అనుకుంటారు. అందుకోసం ప్రయత్నం కూడా చేస్తారు. కానీ అది చాలా శ్రమతో కూడుకున్నది. ఒక్కసారిగా మందు తాగడం మానేస్తే ఏమవుతుందో మీకు తెలుసా?

ఆల్కహాల్ మానేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది స్వల్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముందుగా మందు తాగడం మానేయాలని అనుకున్నపుడు వైద్యులని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారిగా మందు తాగకుండా ఉండటం వల్ల శరీరంలో వణుకు, చెమటలు పట్టడం, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన ప్రణాళిక లేకుండా తాగడం మానేస్తే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

మందు మానేసినప్పుడు శరీరంలో కనిపించే లక్షణాలు

❂ డిప్రెషన్

❂ ఆందోళన

❂ పీడ కలలు

❂ స్పష్టంగా ఆలోచించలేకపోవడం

❂ అలసట

❂ చిరాకు, కోపం

❂ వణుకు

❂ తలనొప్పి, ఆకలి లేకపోవడం

❂ చెమటలు పట్టడం, నిద్రలేమి

❂ హృదయ స్పందనలో మార్పులు

❂ తాగుడు నిలిపివేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు మీరు మానసికంగా దృఢంగా మారాలి. అప్పుడే వచ్చే సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు.

ఆల్కాహాల్ మానెయ్యడం వల్ల వచ్చే స్వల్ప కాలిక ప్రయోజనాలు

మెరుగైన శక్తి మీలో కలుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. బరువు కూడా తగ్గుతారు. మందుకు అలవాటు పడిన శరీరం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. వయస్సు, బరువు, ఎన్ని సంవత్సరాల నుంచి మద్యపానం చేస్తున్నారు అనేది కూడా శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఎక్కువగా మద్యపానం చేసే వారైతే మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని అధిగమించడానికి మీ శరీరం కొన్ని నెలలు లేదా సంవత్సరాలు సమయం పట్టొచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనం అంటే అది పెద్ద వరమనే చెప్పాలి. ఎందుకంటే మద్యం సేవించడం మానేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అదే కాదు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మద్యపానం వల్ల కలిగే నష్టాలు కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుంది.

ఆల్కాహాల్ వల్ల నష్టాలు

తలనొప్పులు, చిరాకు నుంచి బయట పడేందుకు కొంతమంది మందు అలవాటు చేసుకుంటే మరి కొంతమది మాత్రం సరదాగా మొదలుపెట్టి వ్యసనంగా మార్చుకుంటారు. తాగలేకపోతే బతకలేము అనే పరిస్థితికి వస్తారు. మద్యపానం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోవడం, అనారోగ్య సమస్యలు, గుండె, ఊపిరితిత్తులు చెడిపోవడం, కిడ్నీలు దెబ్బతినడం, సృహ కోల్పోవడం, స్ట్రోక్ ప్రమాద, వికారం, వాంతులు, వివిధ రకాల క్యాన్సర్లు బారిన పడే అవకాశం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, శరీరంలోని అవయవాలు చెడిపోవడం వంటివి జరుగుతాయి. అందుకే మద్యపానం హానికరం అని అంటారు.

Also read: ఇలాంటి చెట్ల కిందకు వెళ్తే ప్రమాదాన్ని పాకెట్లో పెట్టుకున్నట్టే!

Also read: స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Published at : 20 Aug 2022 12:27 PM (IST) Tags: Alcohol Stop Drinking Alcohol Quit Drinking Benefits Drinking Alcohol Effects

సంబంధిత కథనాలు

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?