Bread in Fridge: బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?
మీరు బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టి తింటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
బ్రెడ్.. ఎక్స్‌పైరీ డేట్ చాలా తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వాటిని బయట వదిలేస్తే పాడైపోతాయనే భావనతో ఎక్కువ మంది ఫ్రిజ్‌లో పెడతారు. ఎక్స్‌పైరీ డేట్ దాటిన తర్వాత కూడా ఆ బ్రెడ్‌ను వాడేస్తారు. ఈ నేపథ్యంలో బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టవచ్చా? లేదా అనే విషయంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి.
బ్రెడ్‌ను సుమారు 4 నుంచి 5 రోజులు నిల్వ ఉంటాయి. అయితే, వాటిలో ఉపయోగించే పదార్థాలను బట్టి ఈ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత బయట వదిలేస్తే త్వరగా పాడైపోతుంది. పాడైపోయిన బ్రెడ్ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బూజు పట్టే అవకాశం కూడా ఉంది. అలాంటి ఆహారాన్ని తిన్నట్లయితే.. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. కడుపు నొప్పి, తలనొప్పి, విరేచనాలు, వాంతులు, వికారం ఏర్పడవచ్చు. అయితే, బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టేందుకు ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే.. బ్రెడ్ పాడవ్వకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.
స్వభావాన్ని కోల్పోతుంది: బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అది దాని స్వభావాన్ని కోల్పోతుంది. తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. దానివల్ల రుచి కూడా పోతుంది. ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్ చాలా చప్పగా ఉంటుంది. ఫ్రిజ్‌లు లేని కాలంలో బ్రెడ్‌లను ప్రత్యేకమైన ‘బ్రెడ్ బాక్స్’లో నిల్వ ఉంచేవారు. 3, 4 రోజుల లోపే వాటిని తినేసేవారు. పాశ్చాత్య దేశాల్లో ఈ పద్ధతే పాటిస్తారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలకు భయపడి కొందరు బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడతారు. దానికి బదులు.. ఏదైనా డబ్బాలో బ్రెడ్‌ను నిల్వ చేయడం బెటర్.
క్లెమ్‌సన్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్‌టెన్షన్స్ ఫుడ్ ప్రోగ్రామ్స్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ కింబర్లీ బేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెడ్‌ని రిఫ్రిజిరేటింగ్ చేయడం వల్ల అందులోని పోషకాలకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ, చల్లదనం వల్ల బ్రెడ్‌లోని పిండి పదార్థం తేమను కోల్పోయి.. పిండిలా మారిపోతుంది. తేమను కోల్పోవడం వలన బ్రెడ్ పొడిగా, గట్టిగా మారుతుంది. బ్రెడ్ పాడైపోనట్లుగా అనిపిస్తుంది. బ్రెడ్‌లు నిల్వ ఉంచేందుకు గది ఉష్ణోగ్రత చాలు.
ఫ్రిజ్‌లో పెట్టవచ్చు, కానీ..: బయట మార్కెట్లో లభించే రొట్టేలను నిర్ణీత సమయం లోపే తినేయాలి. అంటే ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ) దాటక ముందే తినేయాలి. ఒక వేళ ఎక్కువ రోజులు ఉంచాల్సి వస్తే.. ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. అయితే, ఆ బ్రెడ్‌లోని తాజాదనం పోకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బ్రెడ్‌ను ప్లాస్టిక్ క్లాంగ్ ఫిల్మ్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. గాలి, తేమ చొరబడనంత టైటుగా కవర్‌ను చుట్టాలి. దానిపై అల్యూమినియం ఫాయిల్ చుట్టినట్లయితే మరిన్ని రోజులు బ్రెడ్ నిల్వ ఉంటుంది. ఇలా చేస్తే కనీసం ఆరు నెలల వరకు బ్రెడ్ నిల్వ ఉంటుంది. కానీ, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహారాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీయగానే వెంటనే పాడవుతుంది లేదా కుళ్లిపోతుంది. కాబట్టి.. నిర్దేశిత గడువు లోపే బ్రెడ్‌ను తినేయండి. పైగా తాజా బ్రెడ్‌లో ఉండే రుచి.. నిల్వ ఉంచిన బ్రెడ్‌లో ఉండదు. కాబట్టి.. ఈసారి బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి.