Bullet Impact : బుల్లెట్ తగిలితే మనిషి వెంటనే చనిపోతాడా? ప్రాణాలు కాపాడే మార్గాలు ఇవే
GunShot : నిజ జీవితంలో ఎవరైనా గన్‌తో కాలిస్తే వెంటనే చనిపోతారా? అనే డౌట్ ఉందా? లేదా సినిమాల్లో చూపించినట్లు వెంటనే మరణం సంభవిస్తుందా? అసలు ఎలాంటి సందర్భాల్లో బుల్లెట్ ప్రమాదం కాదో తెలుసుకుందాం.

Gunshot Wounds : సినిమా అయినా.. నిజ జీవితంలో జరిగే వార్తలైనా.. కాల్పుల గురించి విన్నప్పుడు లేదా చూసినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి. సినిమాల్లో అయితే కొన్నిసార్లు బుల్లెట్ తగిలిన వ్యక్తి వెంటనే నేల మీద పడి వెంటనే చనిపోతాడు. మరికొన్నిసార్లు ఎన్నిసార్లు కాల్చిన బతికే ఉంటాడు. మరి నిజానికి ఈ రెండిట్లో ఏది జరుగుతుంది. నిజ జీవితంలో బుల్లెట్ తగిలితే ఏమవుతుంది? అలా బుల్లెట్ తగిలితే అది వారి శరీరంలో ఎక్కడ తగిలింది? ఎంత లోతుకు వెళ్ళింది? ఎంత రక్తం వచ్చింది? బాధితుడికి ఎంత త్వరగా వైద్య సహాయం అందింది అనే అంశాలపై వారు బతుకుతురా? లేదా చనిపోతారా అనే అంశం ఆధారపడి ఉంటుంది.
డాక్టర్. రాజేష్ మిశ్రా ప్రకారం.. "ప్రతి బుల్లెట్ ప్రాణాంతకం కాదు. కానీ సమయానికి చికిత్స అందించకపోతే చిన్న గాయం కూడా ప్రాణం తీస్తుంది. కొన్ని కేసుల్లో మరణం కొన్ని నిమిషాల్లోనే సంభవిస్తుంది. మరికొందరు గంటల తరబడి జీవించవచ్చు" అంటూ కొన్ని విషయాలు తెలిపారు. బుల్లెట్ ఏ ప్రాంతంలో తగిలింది? ఎంతసేపు అయింది? వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
శరీరంలో బుల్లెట్ ఎక్కడ తగిలితే ప్రమాదం
- తలపై, గుండె లేదా మెడలో గురి తగలడం చాలా ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో గాయమైన వెంటనే.. వ్యక్తి కొన్ని నిమిషాల్లో లేదా సెకన్లలో చనిపోవచ్చు.
- ఛాతీ లేదా పొట్టలో గురి తగిలితే.. అంతర్గత అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. రక్తస్రావం కారణంగా మరణం సంభవించవచ్చు.. కానీ సకాలంలో చికిత్స అందిస్తే రక్షించవచ్చు.
- చేతిలో లేదా కాలిలో గురి తగిలితే.. వెంటనే మరణించే అవకాశం చాలా తక్కువ.
రక్తస్రావం
బుల్లెట్ శరీరంలో ఏదైనా పెద్ద సిరను తాకితే.. శరీరం నుంచి చాలా వేగంగా రక్తం పోతుంది. దాదాపు 5 నిమిషాల్లో మరణం సంభవించవచ్చు. కానీ రక్తస్రావం నియంత్రణలో ఉంటే.. వ్యక్తి చాలా గంటల పాటు బతికే అవకాశముంది. త్వరగా వైద్యం అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వైద్య సహాయం
గురి తగిలిన వెంటనే రక్తం ఆపే ప్రక్రియను ఆసుపత్రిలోని ట్రామా కేర్ ద్వారా అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. లేదా బుల్లెట్‌ను తొలగించి బ్లడ్ బయటకు వెళ్లకుండా కూడా కట్టుకట్టి కూడా ఆస్పత్రికి తీసుకెళ్లవచ్చు.
బుల్లెట్ కాల్చే వేగం, దూరం
బుల్లెట్‌ను దగ్గర నుంచి కాల్చితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దూరం నుంచి బుల్లెట్ తగిలిన కూడా గురి శరీరాన్ని ఛేదించవచ్చు. కానీ అంత లోతుగా ప్రభావితం చేయలేకపోవచ్చు.
గురి తగిలిన తర్వాత ఒక వ్యక్తి మరణించే సమయం ఖచ్చితంగా ఒకటే అయి ఉండదు. ఇది పూర్తిగా వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లు తక్షణమే చనిపోవడం అనేది అన్ని సందర్భాల్లో జరగదు. సకాలంలో చికిత్స అందించి జాగ్రత్తగా చూసుకుంటే చాలామంది జీవితాలు నిలుస్తాయి.






















