జమ్మూ కాశ్మీర్​లోని పహల్గామ్​లో మంగళవారం పెద్ద ఉగ్రవాద దాడి ఇండియన్స్​పై జరిగింది.

దాదాపు 27 మంది టూరిస్ట్​లను ఉగ్రవాదులు చంపేశారు. పలువురు గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో కాశ్మీర్​లోని ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉగ్రవాద దాడులు జరుగుతాయనేది ఓసారి చూసేద్దాం.

కాశ్మీర్​లోని షోపియన్​ అత్యంత ఉగ్రవాద ప్రభావితం ఉన్న జిల్లాగా చెప్తారు. ఇది దక్షిణ కాశ్మీర్​లోని ఓ జిల్లా.

2019లో పుల్వామా సీఆర్పీఎఫ్ కాన్వాయ్​పై దాడి జరిగింది ఇక్కడే.

కేవలం ఇదే కాకుండా అనేక ప్రధాన ఉగ్రవాద దాడులు షోపియన్​లో జరిగాయి.

అనంత్​నాగ్, సోపోర్​లలో కూడా ఉగ్రవాద సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.

కుప్వారా, బండిపోరా, బుడ్గాం, కథువాలు కూడా ఉగ్రవాదులకు లక్ష్యమే.

నియంత్రణ రేఖకు దగ్గరా ఉండడం వల్ల కుప్వారా జమ్మూలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలలో ఒకటిగా చెప్తారు.

రాజధాని అయిన శ్రీనగర్​లో కూడా ఉగ్రదాడులు జరుగుతూ ఉంటాయి.

ట్రాల్ అనే ప్రాంతం కూడా ప్రమాదకరమైనది కాబట్టి అక్కడికి ఎవరూ వెళ్లకపోవడమే మంచిది.