తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు.

తాజ్ ఉదయం గులాబీ రంగులో, పగలు తెల్లగా, రాత్రి బంగారు రంగులో కనిపిస్తుంది.

రాజస్థాన్ నుంచి తెచ్చిన స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో దీనిని 20కి పైగా సంవత్సరాలు కష్టపడి నిర్మించారు.

ఈ నిర్మాణంలో జాడే, క్రిస్టల్, మణి, లాపిస్ లాజులి వంటి విలువైన రాళ్లను పొదిగించారు.

భూకంపం సమయంలో సమాధిపై పడకుండా నాలుగు మినార్లను ప్రధాన గోపురం నుంచి కొద్దిగా దూరంగా నిర్మించారట.

తాజ్​ మహల్​ ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా నిలిచింది.

1983లో తాజ్ మహల్ దాని నిర్మాణ, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.

బ్రిటిష్ పాలనలో తాజ్ పాలరాయిని వేలం వేసి తొలగిస్తారని పుకార్లు వచ్చాయి.

భారత ప్రభుత్వం తాజ్ మహల్ చుట్టూ వాయు రవాణా, కాలుష్యంపై కఠినమైన ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలోనే దానికి సమీపంలో విమానాలను అనుమతించరు.