దేశంలోని ఏడు అత్యంత చౌకైన ఆసుపత్రులు ఇవే!

Published by: Jyotsna

భారతదేశంలో అనేక మంది ప్రజలు ఆర్థిక పరిమితుల కారణంగా సరైన వైద్య సేవలను పొందలేకపోతున్నారు.

వారికి నాణ్యమైన వైద్యం అందించే, చౌకైన ఖర్చుతో సేవలు అందిస్తున్న ఏడు ఆసుపత్రులు ఇవే.

​టాటా మెమోరియల్ ఆసుపత్రి

ముంబయిలో ఉన్న ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి.

​చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్

కోల్కతాలో ఉన్న ఈ సంస్థలో కూడా క్యాన్సర్ రోగులకు చౌకైన సేవలు అందిస్తున్నారు.

​PGIMER చండీగఢ్

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో వివిధ రకాల వైద్య సేవలు తక్కువ ఖర్చుతో లభిస్తాయి.

​క్రిస్టియన్ మెడికల్ కాలేజ్

తమిళనాడులోని వెల్లూరులో ఉన్న ఈ ఆసుపత్రి వివిధ వైద్య సేవలను చౌకగా అందిస్తోంది.

​అఖిల భారత ఆయుర్విజ్ఞాన సంస్థ (AIIMS)

దేశ రాజధానిలో ఉన్న ఈ ప్రఖ్యాత ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి.

​శ్రీ సత్య సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్

బెంగళూరులో ఉన్న ఈ ఆసుపత్రిలో ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

​గురు హర్‌కృష్ణ ఆసుపత్రి

ఢిల్లీలో ఉన్న ఈ ఆసుపత్రిలో కూడా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు లభిస్తాయి.