News
News
X

నరాల బలహీనత సంకేతాలు ఏంటి? జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితం దుర్భరం!

మానవ శరీరంలో గుండె ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో నరాలు కూడా అంతే. వాటికి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా నాడీ వ్యవస్థ పనితీరుకి ఆటంకం కలుగుతుంది.

FOLLOW US: 

మెదడు నుంచి సంకేతాలను శరీరానికి చెరవేయడంలో నరాలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంఏలో అవయవాలు ఎలా కదలాలి, ఎలా పని చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనేది మెదడు నరాల ద్వారా సంకేతాలని పంపిస్తుంది. అందుకే నాడీ వ్యవస్థ చాలా ముఖ్యం. నరాలు బలహీనపడితే శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై దాని ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ ఎంత శక్తివంతమైనదో అంత బలహీనమైనది కూడా. నాడీ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. మెదడు, వెన్నుపూసతో కూడిన కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. నరాల సమస్యను చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ అది పైకి కనిపించని ప్రమాదకారి.

శరీర భాగాలకు ఏదైనా గాయం అయినప్పుడో లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల నరాలు బలహీనపడిపోతాయి. దాని వల్ల శరీర పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, ఔషధాల అధిక వినియోగం, నిశ్చల జీవనశైలి, మధుమేహం వంటి వాటి వల్ల నరాలు బలహీనపడిపోతాయి. ఇవే కాదు ఆల్కాహాల్, మాదక ద్రవ్యాల వినియోగం, ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత, బ్రెయిన్ ట్యూమర్స్, స్ట్రోక్స్ వంటివి నాడీ వ్యవస్థకి హాని కలిగిస్తాయి. మీకు నాడీ వ్యవస్థలో ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే న్యూరాలజిస్ట్ ని కలిసి తగిన రీతిలో చికిత్స తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నరాల బలహీనత వల్ల లైంగిక సామర్ధ్యం తగ్గిపోతుంది. 

నరాల బలహీనత సంకేతాలు

శరీరంలో ఒకవైపు అకస్మాత్తుగా తిమ్మిర్లు రావడం, మాట్లాడటంలో ఇబ్బంది, ముఖంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడా, ఉత్తమం. ఎందుకంటే ఇది స్ట్రోక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అత్యంత తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితి. నిరంతరం తలనొప్పి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు అలసత్వం చెయ్యకూడదు. ఎందుకంటే ఇది కూడా ప్రమాదమే. మెదడులో కణతులు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది కానీ వాటిని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఇటువంటి పరిస్థితి వస్తుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

విపరీతమైన నీరసం, బలహీనంగా నిపించడం ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఏదో లోపం ఉందని గ్రహించాలి. ఎండోక్రైన్ వంటి రుగ్మతలు నాడీ వ్యవస్థని పరోక్షంగా తీవ్ర ప్రబావితం చేస్తాయి. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం కూడా నాడీ వ్యవస్థ రుగ్మతకి సంకేతమే. జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది. అయితే జ్ఞాపకశక్తి విషయం అనగానే అల్జీమర్స్ అని చాలా మంది అనుకుంటారు కానీ నాడీ వ్యవస్థ పనితీరు సకరంగా లేకపోతే జ్ఞాపకశక్తి మందగిస్తుంది. సాధారణంగా కనిపించే కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు కూడా దీనికి ఒక సంకేతమే. సరిగా నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, దేని మీద దృషి సారించలేకపోవడం వంటి లక్షణాలు కూడా నాడీ వ్యవస్థ పనితీరు సక్రమంగా లేదని చెప్పే సంకేతాలే.

Also Read: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!

Published at : 19 Aug 2022 08:54 PM (IST) Tags: Nervous System Nervous System Symptoms Nervous System Failure Symptoms

సంబంధిత కథనాలు

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు

Khosta 2 Virus: రష్యన్ గబ్బిలాలలో కోవిడ్‌లాంటి వైరస్, మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Khosta 2 Virus: రష్యన్ గబ్బిలాలలో కోవిడ్‌లాంటి వైరస్, మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Bathukamma Special Recipes: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం

Bathukamma Special Recipes: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు