Stamina in Men: అబ్బాయిలూ ఈ పనులు చేస్తున్నారా? మీ మగతనం మటాషే!
మీరు బెడ్ రూమ్‌లో మంచి ఆటగాళ్లు కావాలంటే.. కొన్ని పనులకు మీరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జీవనశైలిలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టాలి.
మైదానంలోకి దిగే ప్రతి బ్యాట్స్‌మెన్‌కు సెంచురీలు చేయాలనే ఆశ ఉంటుంది. కానీ, ఆరంభంలోనే డకౌట్ అయితే? ఎక్కువ సేపు మ్యాచ్‌లో నిలబడకపోతే? అంతకంటే దారుణం మరొకటి ఉండదు కదా. అలా ఒకటి రెండుసార్లు జరిగితే పర్వాలేదు. కానీ, క్రీజ్‌లో అడుగుపెట్టిన ప్రతిసారి ఔటైతే మాత్రం కెరీర్‌కే ఇబ్బంది. ఇదే విషయం బెడ్ రూమ్ గేమ్స్‌కు కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి ఎక్కువ సేపు ఆ పనిలో పాల్గోవలని ఉంటుంది. కానీ, స్తంభన సమస్యలు శీఘ్రస్కలనం వల్ల.. మ్యాచ్‌కు ముందే చేతులెత్తేస్తారు. అలా జరగకూడదంటే పురుషులు కొన్ని పనులకు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ స్టైల్‌ను సరిదిద్దుకోవాలి. మీ పార్టనర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలంటే ఏయే సమస్యలు మీ మగతనానికి ప్రతికూలంగా మారుతున్నాయో తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. అవేంటో చూడండి.
మీ జీవనశైలి ఇలా ఉంటే కష్టమే
ఈ బిజీ లైఫ్‌లో సరైన ఆహారం తీసుకోడానికి, తగిన వ్యాయామం చేయడానికి అస్సలు టైమ్ సరిపోవడం లేదు. ఫలితంగా ఈ రోజుల్లో చాలామంది పురుషులు ఆ స్టామినాను కోల్పోయి మానసికంగా కుంగిపోతున్నారు. కాబట్టి, వ్యాయామాన్ని అస్సలు విస్మరించవద్దు. జంక్ ఫుడ్ అస్సలు వద్దు. దానివల్ల పురుషుల్లో ఆ స్టామినా దారుణంగా తగ్గిపోవచ్చు. నిత్యం వ్యాయామం చేసేవారు వయస్సుతో సంబంధం లేకుండా మాంచి ‘ఆటగాళ్లు’గా శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తారట. అంతేకాదు.. ఎక్కువ సేపు పార్టనర్‌ను సుఖ పెట్టగలుగుతారట. ఆ విషయంలో అస్సలు అలసటే లేకుండా తమ సత్తా చాటుతారట. మీకు అర్థమవుతోందా?
అనారోగ్య సమస్యలు
మీరు తరచుగా అనారోగ్యానికి గురవ్వుతుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటే.. అనారోగ్య సమస్యలు కూడా పురుషుల స్టామినాపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయట. కొన్ని హానికరమైన అనారోగ్య పరిస్థితులు పురుషాంగం లేదా హార్మోన్ల స్థాయిలపై ప్రభావం చూపిస్తాయట. అవి రక్త ప్రవాహాన్ని నేరుగా ప్రభావితం చేయనప్పటికీ శక్తి స్థాయిలను హరించివేస్తాయి. మీ బలహీనత ఆ కలయికపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే అనారోగ్యానికి గురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తిరిగి ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీరు శక్తిని మీరు తిరిగి పొందగలుగుతారు. పడక గదిలో పరుగుల వరద కురిపిస్తారు. అలాగే, స్మోకింగ్, డ్రింకింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. వెంటనే అవి ప్రభావం చూపకపోయినా.. కోరికలు పుట్టే వయస్సులో మాత్రం నిరుత్సాహానికి గురిచేస్తాయి.
డిప్రెషన్‌లోకి జారుకుంటే ఇక అంతే..
డిప్రెషన్ లేదా కుంగుబాటు, మానసిక ఆందోళనలు కూడా పురుషులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే.. కొంతమంది పురుషులల్లో డిప్రెషన్.. టెస్టోస్టెరాన్ స్థాయిలలో తగ్గుదలతో ముడిపడి ఉంటుంది. టెస్టోస్టెరాన్ పురుషుల లిబిడోను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. పురుషులలో టెస్టోస్టెరాన్ లోపాలను సరిచేసేందుకు హార్మోన్ థెరపీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరో చిత్రమైన విషయం ఏమింటంటే.. డిప్రెషన్ లైంగిక జీవితం మీద ప్రభావం చూపకూడదంటే, బాధితులు తప్పకుండా శృంగారంలో పాల్గోవాలి. అది కూడా మంచి చికిత్స అని నిపుణులు తెలుపుతున్నారు.
డ్రగ్ అస్సలు వద్దు
డ్రగ్స్ తీసుకుంటే.. పడగ గదిలో రెచ్చిపోవచ్చని చాలామంది భావిస్తారు. కానీ, అది చాలా ప్రమాదకరం. డ్రగ్స్ వల్ల ఉద్వేగానికి గురయ్యేది మీరు మాత్రమే. మీ రహస్యాంగాలు కాదు. పైగా డ్రగ్స్ ప్రాణాంతక సమస్యలకు దారితీయొచ్చు. ఇది లైంగిక శక్తిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. చాలామంది స్టామినా కోసం వయాగ్రాకు అలవాటు పడతారు. అది ఇంకా పెద్ద తప్పు. అది అప్పటికప్పుడు మీలో ఉద్వేగాన్ని కలిగించవచ్చు. కానీ, సహజ పద్ధతిలో గట్టిపడే ప్రక్రియకు హాని కలిగిస్తుంది. ఫలితంగా వయాగ్రా లేనిదే ఆ పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు.
మీ మీద మీకు నమ్మకం ఉండాలి
చాలామందికి స్టామినా ఉంటుంది. కానీ, వారిపై వారికి నమ్మకం ఉండదు. ఇతరులతో అతిగా పోల్చుకుంటారు. నీలి చిత్రాలు అతిగా చూసేవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అది మైండ్‌లో ఒకరకమైన ఆందోళన కలిగిస్తుంది. మిగతావారిలా తాను చేయలేకపోతున్నాని లేదా పార్టనర్ తనతో తగిన సుఖాన్ని పొందుతుందా లేదా అనే సందేహం తొలిచేస్తూ ఉంటుంది. స్టామినాను బలహీనం చేస్తుంది. వాస్తవానికి మీ మనోబలానికి మించిన మందు మరొకటి లేదు. నేను చేయగలను అనే నమ్మకం మీలో ఉద్వేగాన్ని రగిలించే హార్మోన్లను ప్రేరేపిస్తుందట. కాబట్టి, ఎప్పుడూ మీ స్టామినాపై నిరాశ వద్దు. ప్రయత్నించి చూడండి. మీ వల్ల కాకపోతే.. మీ లైఫ్ స్టైల్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగండి. వీలైతే మానసిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. లేదా వైద్య నిపుణులను సంప్రదించండి.
Also read: డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial