Best Curd Combinations: పెరుగులో వీటిని కలుపుకుని తింటే... ఎంత ఆరోగ్యమో
భారతీయులకు చివరిలో పెరుగు ముద్ద దిగనిదే భోజనం పూర్తయినట్టు కాదు. పెరుగుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు తెలుగుప్రజలు.
అన్నం, పప్పు, చారు, కూర, పెరుగు... ఇవన్నీ రోజూవారి భారతీయ భోజనంలో కనిపించే వంటకాలు. చివరలో పెరుగుతో ముగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న అలవాటు. ఆయుర్వేదం ప్రకారం పెరుగుతో కొన్ని రకాల పదార్థాలు కలుపుకుని తింటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.
1. అధిక బరువు తగ్గాలనుకునేవారు కప్పు పెరుగులో అరస్పూను జీలకర్ర పొడిని బాగా కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
2. నోటిపూత, దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే పెరుగులో వాము పొడిని కలుపుకుని తినాలి.
3. ఓట్స్ ను పెరుగులో వేసి ఓ అరగంట సేపు వదిలేస్తే బాగా నానిపోతాయి. ఆ మిశ్రమంలో కాస్త తేనె కలుపుకుని తింటే చాలా మంచిది. ఇలా రోజూ బ్రేక్ ఫాస్ట్ తింటే శరీరానికి అవసరమయ్యే ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి.
4. బ్రేక్ ఫాస్ట్ సమయంలో తాజా పండ్లను ముక్కలు చేసి పెరుగులో కలుపుకుని తింటూ ఉండాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్లు అంత త్వరగా దాడి చేయలేవు.
5. నల్ల మిరియాలను పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోవాలి. వీటిని రోజూ పెరుగులో కలిపి తింటే చాలా మంచిది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం దరిచేరదు.
6. పెరుగలో కాస్త తేనె కలుపుకుని అప్పుడప్పుడూ తిన్నా చాలా మంచిది. అల్సర్ల సమస్య రాకుండా ఉంటుంది.
7. పిల్లలకు అప్పుడప్పుడు పెరుగులో కాస్త చక్కెర కలిపి ఇస్తే మంచిది. ఈ మిశ్రమం అరటిపండులాగే తిన్న వెంటనే తక్షణ శక్తినిస్తుంది. అలసిపోయిన పిల్లలు వెంటనే చురుకుగా మారతారు. కాస్త పంచదార ఎక్కువ వేయద్దు.
8. కప్పు పెరుగులో చిటికెడు పసుపు, అరస్పూను అల్లం రసం కలిపి తింటే గర్భిణిలకు చాలా మేలు. వారికి అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి