News
News
X

Appendicitis: అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది?

అపెండిసైటిస్ అంటే అర్థంకాదేమో కానీ, ఇరవైనాలుగ్గంటల పొట్ట నొప్పి అంటే మాత్రం అందరికీ ఇట్టే అర్థమైపోతుంది.

FOLLOW US: 
 
ప్రపంచంలో ప్రతి పదమూడు మందిలో ఒకరి అపెండిసైటిస్ బారినపడుతున్నారు. ఒక్క ఇంగ్లాండులోనే ప్రతి ఏడాది 40,000 మంది ఈ పొట్ట నొప్పితో ఆసుపత్రిలో చేరుతున్నారు. మనదేశంలో కూడా ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఏటా వేలమంది కడుపునొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి అపెండిసైటిస్ గా నిర్ధారణ చేసుకుంటున్నారు. అసలు అపెండిసైటిస్ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? కడుపునొప్పి రాక ముందు లక్షణాలు గుర్తించవచ్చా వంటివి తెలుసుకుందాం. 

ఏమిటీ అపెండిసైటిస్?
అపెండిక్స్ అనేది చిన్న సంచిలా ఉండే అవయవం. పెద్దపేగులకు అనుబంధంగా చివరలో వేలాడినట్టు ఉంటుంది. అపెండిసైటిస్ వచ్చినప్పుడు అపెండిక్స్ వాచిపోయి తీవ్రమైన నొప్పి పెడుతుంది. ఆ నొప్పి మనకు పొత్తికడుపు వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే మన శరీరంలో అపెండిక్స్ లేకుండా కూడా జీవించగలదు. కాబట్టి దాన్ని తొలగిస్తుంటారు వైద్యులు. 

ఎవరికి అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉంది?
అపెండిసైటిస్ ఏ వయసులో ఉన్న వారికైనా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా అయితే పదేళ్ల నుంచి ఇరవైఏళ్ల మధ్యలో ఉన్నవారిలో అధికంగా కనిపిస్తుంది. కానీ ఇది ఎందుకు సంభవిస్తుందో మాత్రం ఇంతవరకు సరైన కారణం తెలియరాలేదు. 

లక్షణాలేంటి?
నొప్పి హఠాత్తుగా, చాలా తీవ్రంగా వచ్చేస్తుంది. అప్పుడు వైద్యులు మొదటగా అపెండిసైటిస్ ఏమో అని చెక్ చేస్తారు. కానీ నొప్పి కన్నా ముందు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. అవి కాస్త నీరసంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు కావడం, జ్వరం రావడం వంటివి కనిపించవచ్చు. 

News Reels

అపెండిసైటిస్ రావడానికి కారణాలేంటి?
ఈ పరిస్థితి ఎందుకొస్తుందో ఇంతవరకు సరైన కారణం తేలలేదు. అపెండిక్స్ ప్రవేశద్వారం మూసుకుపోయినప్పుడు ఇలా జరుగుతుందని భావిస్తారు. మలం అడ్డుపడడమో లేక, ఏదైనా కణితి పుట్టి ఇలా మూసుకుపోవడం జరగుతుంటుంది. ఈ పరిస్థితి ఏర్పడకుండా నిరోధించడం కష్టమే. 

చికిత్స ఎలా ఉంటుంది?
అపెండిసైటిస్ రెండు రకాలు. ఒకటి దీర్ఘకాలిక లక్షణాలతో సాగితే, మరొకటి తీవ్రంగా వస్తుంది. అపెండిసైటిస్ తీవ్రంగా మారితే అపెండిక్స్ పగిలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. సమస్య చిన్నదైతే యాంటీ బయోటిక్స్ ఇచ్చి చికిత్స చేస్తారు. తీవ్రమైనదైతే ఆ అవయవాన్ని తొలగిస్తారు. దాని వల్ల మానవ శరీరానికి పెద్దగా ఉపయోగం ఉండదు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం

Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి

Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Oct 2021 02:07 PM (IST) Tags: Appendicitis Symptoms of appendicitis Appendix అపెండిక్స్

సంబంధిత కథనాలు

Google Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Google Search 2022: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Breast Cancer: నటి హంసా నందినికి సోకిన BRCA క్యాన్సర్ గురించి మీకు తెలుసా? లక్షణాలు ఏమిటీ? ఎలా గుర్తించాలి?

Breast Cancer: నటి హంసా నందినికి సోకిన BRCA క్యాన్సర్ గురించి మీకు తెలుసా? లక్షణాలు ఏమిటీ? ఎలా గుర్తించాలి?

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

టాప్ స్టోరీస్

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

COOKIES_POLICY