News
News
వీడియోలు ఆటలు
X

ఈ మూడు దోషాల గురించి మీకు తెలుసా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

కఫ, పిత్త, వాతాల గురించి విన్నారా? ఇవి ఆయుర్వేదంలో చెప్పుకునే మూడు దోషాలు. వీటిని అనుసరించి మీ ఆరోగ్య దినచర్య నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలా నిర్ణయించుకోవాలంటే వాటికి కావల్సిన అవగాహన అవసరం.

FOLLOW US: 
Share:

మనం తినేందుకు చాలా ఇబ్బందిగా అనిపించేంత స్పైసీ ఫూడ్ కొంతమంది ఇష్టంగా తింటారు. ఎందుకో తెలుసా? కొంత మంది ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఉండలేరు, ఎప్పుడూ కదులుతూ ఉంటారు. ఇంకొందరు ప్రశాంతంగా ఒకచోట కూర్చుని ఉంటారు. పిడుగులు పడిన లేవరేమో అనిపిస్తుంది. ఇలా వ్యక్తిత్వాలు చాలా డిఫెరెంట్ గా ఎందుకు ఉంటాయి. దీనికి సమాధానం మనకు ఆయుర్వేద దోషాలను గురించి తెలుసుకున్నపుడు అర్థమవుతుంది. మనం ఏం తినాలి? ఎలా తినాలి? ఎలాంటి వ్యాయామం, ఎంత అవసరం వంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మన శరీరంలోని ఈ త్రిదోషాలను గురించి అవగాహన కలిగి ఉండడం అవసరం.

ఆయుర్వేద చికిత్సలో బాలెన్స్ అనేది చాలా కీలకం. ఇది దోషాలను సంతులన పరచడంతో సాధ్యమవుతుంది. మనం ఏం తినాలి? ఎలా తినాలి? ఎప్పుడు పడుకోవాలి? ఎంత నిద్ర అవసరం? భావోద్వేగాలు, శారీరక మానసిక స్థితిగతులు అన్నింటి గురించి అర్థం చేసుకునేందుకు ఆయుర్వేదం ఉపయోగించే ఆరోగ్య కారకాలు ఈ త్రిదోషాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అసలేమిటి ఈ త్రిదోషాలు

ఆయుర్వేదం వివరించే ఈ త్రిదోషాలు ఏమిటో, వాటి ప్రభావం శారీరక మానసిక స్థితుల మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

వాత దోష లక్షణాలు

కదలికలు, గాలితో అనుసంధానించబడినదిగా వాతం గురించి చెబుతారు. వాత దోషం కలిగిన వారు సృజనాత్మక ఆలోచనలు కలిగి, విశాల దృక్పథంతో, అంగీకార యోగ్యమైన మనసుతో ఉంటారు. ఇది శ్వాస, కండరాల చలనం, శ్వాస క్రియ, కండరాల సంకోచం, హృదయ స్పందన వంటివి ఈ దోషంతో అనుసంధానించబడి ఉంటుంది. వాతదోషం కలిగిన వారు సన్నగా ఉంటారు. పొడిబారిన చర్మం ఉంటుంది. చాలా చురుకైన ఆలోచనా విధానం కలిగి ఉంటారు. మలబద్దకం, భయం, ఆందోళన, మరికొన్ని జీర్ణ సంబంధ సమస్యలు బాధించవచ్చు.

వాత దోష లక్షణాలు ఉన్న వారు ప్రొటీన్, కొవ్వులు కలిగిన తాజా వేడి ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, వేడిగా ఉండే ద్రవపదార్థాలు, దుంప కూరలు తీసుకోవాలి. ఈ దోషం వల్ల తరచుగా డీహైడ్రేటెడ్ గా  ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఎక్కువ వాటర్ తీసుకోవాలి.

పిత్త దోష లక్షణాలు

ఇది అగ్ని సంబంధ దోషం. ఎండోక్రైన్, జీవక్రియలు, జీర్ణవ్యవస్థలను నియంత్రిస్తుంది. పిత్త వ్యక్తులు మధ్యస్తంగా ఉంటారు. చలి ఎక్కువ వీరికి, ఆయిలీ చర్మం ఉంటుంది. చురుకుగా ఉంటారు. మంచి సాధకులు. పిత్త అసమతుల్యత వల్ల దద్దుర్లు, చర్మ సమస్యలు, కోపం, చికాకు ఉంటుంది. కాస్త పని ఎక్కువైనా అలసి పోతారు.

శరీరాన్ని చల్లబరిచే వ్యాయామాలు మేలు చేస్తాయి. చన్నీటి స్నానం, నది, చెరువు లేదా నీటికి దగ్గరగా వాకింగ్ చెయ్యడం వంటివి బాగా నచ్చుతాయి. వీరు అప్పుడుప్పుడు వారి కఠినమైన క్రమశిక్షణను కొద్దిగా సడలించుకోవడం రిలాక్స్ డ్ గా ఉండేందుకు దోహదం చేస్తుంది.

పిత్త దోషాన్ని సమతుల్యం చేసేందుకు వేసవిలో తేలిక భోజనాన్ని ఎంచుకోవాలి. వేడి లేదా కారంగా ఉండేవి, పులియబెట్టిన ఆహారపదార్థాలుకు దూరంగా ఉండాలి. తియ్యని పండ్లు, కొబ్బరి నీళ్లు, వివిధ రకాల ధాన్యాలతో చేసిన ఆహారాలు పిత్త దోషాన్ని శాంతింప జేస్తాయి.

పిత్త దోషం

కఫ దోషం భూమి, నీటితో అనుసంధానించి ఉంటుంది. ఇది ప్రశాంతంగా ఉండే ఎనర్జీ. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరానికి నీటిని అందిస్తుంది.

కఫాధిపత్య వ్యక్తి కంపోజ్డ్ గా క్షమించే తత్వం కలిగి ఉంటాడు. కఫా అసమతుల్యత వల్ల కోపం, సోమరితనంగా  ఉండి బరువు పెరిగేందుకు కారణమవుతుంది.

వీరు తప్పనిసరిగా వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామ వంటి సాధనలు చెయ్యాలి.

కఫాధిపత్యం ఉన్నవ్యక్తులు ఆయిలీ ఫూడ్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించుకోవాలి. తాజా పండ్లు, కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఆరోగ్యంగా ఉండేందుకు ఈ మూడు దోషాలు సమతులతలో ఉండడం చాలా అవసరం.

Also Read: ఖి‘లేడీ’ కిల్లర్ - అమ్మాయిలను చంపేసి, శవాలతో కేకులు చేసుకుని తినేసింది, కారణం పెద్దదే!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 23 Apr 2023 07:41 PM (IST) Tags: pitta ayurved thridoshas vata kapha

సంబంధిత కథనాలు

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Ice Apple: వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

పేస్ట్ పెట్టడానికి ముందు బ్రష్ తడుపుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!