By: ABP Desam | Updated at : 16 Feb 2022 07:56 PM (IST)
Representational Image/Pixabay
Leonarda Cianciulli | ‘భామాకలాపం’ సినిమా చూశారా? చాడీలను ఇష్టపడే ప్రియమణి.. చివరికి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. చివరకి శవం కాలిని కూడా కత్తితో నరికేసి.. ఆమెలోని క్రూరమైన యాంగిల్‌ను బయట పెడుతుంది. అయితే, ఆమె అలా ఎందుకు చేసిందనేది మీరు ఆ సినిమాలోనే చూడాలి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన నిజంగానే చోటుచేసుకుంది. ఈ సైకో లేడి ‘భామాకలాపం’లో ప్రియమణి అంత కూల్ కాదు. చాలా క్రూరమైనది. చడీ చప్పుడు కాకుండా.. ముగ్గురు మహిళలను చంపేసి, వారి శవాలతో కేకులు తయారు చేసుకుని తినేసేంత అరాచకమైనది. ఇంతకీ ఆమె చేతిలో చనిపోయిన మహిళలు ఎవరు? ఆమె ఎందుకు ఆ హత్యలు చేసిందో తెలుసుకోవాలంటే.. ఆమె ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాలి.
చేతబడి చేయించిన తల్లిదండ్రులు: ఆమె పేరు లియోనార్డా సియాన్సియుల్లి. ఇటలీలోని మొంటెల్లా నివాసి. ఆమె తల్లిదండ్రులు బాల్యంలో ఆమె పట్ల చాలా క్రూరంగా ఉండేవారు. ఓ రోజు ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి రాఫెల్ పన్సార్డి అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ పెళ్లి ఇష్టంలేని తల్లిదండ్రులు.. తమకు నచ్చిన మరో వ్యక్తిని పెళ్లాడాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెను టార్చర్ పెట్టారు. చేతబడి ప్రయోగం కూడా చేశారు.
భూకపంతో వీధిన పడ్డ కుటుంబం: ఎట్టకేలకు ఆమె తల్లితండ్రుల నుంచి తప్పించుకుని భర్తతో కలిసి పొటెంజాకు వెళ్లిపోయింది. అయితే, అక్కడో ఓ చీటింగ్ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల జైలు శిక్ష తర్వాత ఆమె విడుదలైంది. దీంతో ఆమె భర్త అవెలినోకు తీసుకెళ్లారు. ఓ రోజు అక్కడ భారీ భూకంపం ఏర్పడింది. దీంతో వారి ఇల్లు కూలిపోయి.. వీధిన పడ్డారు. బతుకుతెరువు కోసం వారు అక్కడి నుంచి రెగ్గియో ఎమిలియా వెళ్లారు.
ఇక్కడే అసలు కథ మొదలు: లియోనార్డాకు ఒక కొడుకు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం సోపులు, స్వీట్లు తయారు చేసేది. ఆ తర్వాత ఆమెకు ‘ది సోప్ మేకర్ ఆఫ్ కొరెగ్జియో’గా పేరు వచ్చింది. కొంతమంది పనివాళ్లను పెట్టుకుని వ్యాపారాన్ని విస్తరించింది. అయితే, ఓ రోజు ఫౌస్టినా సెట్టి అనే మహిళ కనిపించకుండా పోయిన తన భర్తను వెతుక్కుంటూ లియోనార్డాను కలిసింది. అయితే, లియోనార్డా అకారణంగా ఆమెను చంపేసి.. ముక్కలుగా నరికేసింది. రక్తాన్ని చిన్న పాత్రలోకి నింపుకుంది. శరీరం ముక్కలను ఓ కుండలో పెట్టింది.
శవాన్ని కాస్టిక్ సోడాలో మరిగించి..: ఆ కుండలో కాస్టిక్ సోడా (caustic soda)ను ఆ కుండలో వేసింది. దీన్ని ఎక్కువగా సోప్స్ తయారీలో చాలా తక్కువ మొత్తంలో దీన్ని వినియోగిస్తారు. దానికి చర్మాన్ని తినేసే గుణం ఉంది. డ్రైనేజీలు బ్లాక్ అయినప్పుడు దీన్ని ఎక్కువ మొత్తంలో వినియోగిస్తారు. దీనిపై లియోనార్డాకు కూడా అవగాహన ఉంది. దీంతో సెట్టి శవాన్ని అలా మాయం చేసింది. ఆ తర్వాత ఆమె కొంత రక్తంతో సబ్బులను తయారు చేసింది. మిగతా రక్తంలో పాలు, చక్కెర, గుడ్లు, చాక్లెట్, పిండి తదితర పదార్థాలను కలిపి కేకులు తయారు చేసింది. వాటిని తన సహచరులకు తినిపించింది.
మరో రెండు హత్యలు, చివరికి..: ఈ మారణ హోమం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఉద్యోగం దొరకడం లేదనే బాధతో డిప్రషన్‌లో ఉన్న ఫ్రాన్సెస్కా సావీ అనే మహిళను కూడా అదే విధంగా చంపేసింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం వచ్చిన వర్గీనియా కాసియొప్పో అనే మహిళను కూడా క్రూరంగా చంపేసి స్వీట్లు తయారు చేసుకుని తినేసింది. అయితే, ఆ పాపం ఆమెను వెంటాడింది. కాసియొప్పో తన సోదరి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరిసారిగా ఆమె లియోనార్డాను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పింది. దీంతో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కొడుకుపై పోలీసుల అనుమానం: లియోనార్డా తొలుత నేరాన్ని అంగీకరించలేదు. తనకు ఏమీ తెలియదని బుకాయించింది. దీంతో పోలీసులు ఆమె కొడుకును అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకోగానే లియోనార్డా నేరాన్ని అంగీకరించింది. ఇందులో తన కొడుకు తప్పు ఏమీ లేదని తెలిపింది. ఆ తర్వాత మిగతా రెండు హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలు 1939-41 మధ్య కాలంలో జరిగాయి. కోర్టు ఆమెకు 33 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. చివరికి లియోనార్డా శిక్ష అనుభవిస్తూ.. అక్టోబరు 1970లో సెరిబ్రల్ అపోప్లెక్సీ వ్యాధితో చనిపోయింది.
Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం
ఎందుకు చంపింది?: లియోనార్డా 17 సార్లు గర్భం దాల్చింది. వారిలో ముగ్గురు పిల్లలు గర్భంలోనే కన్ను మూశారు. మిగతా పిల్లలు యుక్త వయస్సులో చనిపోయారు. ఒక్కడు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. తన తల్లిదండ్రులు చేసిన చేతబడి ఫలితంగానే తన పిల్లలు చనిపోతున్నారని ఆమె భావించింది. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆమె కొడుకు సైన్యంతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ ఒక్క కొడుకు యుద్ధంలో చనిపోతాడేమో అనే భయం ఆమెను వెంటాడింది. దీంతో ఆమె ఓ మంత్రగత్తెను ఆశ్రయించింది. కొడుకు ప్రాణాలతో ఉండాలంటే ముగ్గురు మహిళలను బలివ్వాలని, వారి రక్తంతో తయారు చేసిన ఆహారాలను తినడమే కాకుండా, నలుగురికి తినిపించాలని చెప్పింది. దీంతో లియోనార్డా ఈ దారుణానికి పాల్పడింది. ఈ హత్యలకు ఉపయోగించిన కుండ, కత్తులు, ఇతర ఆయుధాలు ఇప్పటికీ రోమ్‌లోని క్రైమినోలాజికల్ మ్యూజియంలో సందర్శన కోసం ఉన్నాయి.
లియోనార్డా శవాలను మరిగించేందుకు ఉపయోగించిన పాత్ర, హత్యకు వాడిన ఆయుధాలు ఇవే:
Leonarda Cianciulli “The Soap-Maker” murdered three women, turning their bodies into soap and teacakes. She believed doing so would protect her son during WWII. She was arrested in March of 1941. pic.twitter.com/UrJUkP6cYX
— movin nd flowin madison (@RosyShaman) September 20, 2021
Also Read: చీమలే దెయ్యాలా?.. ఆ అడవిలో ఇతర చెట్లను చంపేస్తున్న చెట్లు.. కానీ, అసలు నిజం వేరే ఉంది!
సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి
రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం
జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి
Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్