Brain Infections: వర్షాకాలంలో బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు, జాగ్రతలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వాటిలో మెదడు సంబంధ సమస్యలు చాలా ప్రమాదకరమైనవి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.
![Brain Infections: వర్షాకాలంలో బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు, జాగ్రతలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు Weakened immune system poor sanitation during monsoon can increase Brain infections risk Brain Infections: వర్షాకాలంలో బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు, జాగ్రతలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/18/be61f9c2e41e1143be782168693303471721295604019544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brain Infections: వానాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా సోకుతుంటాయి. తేమ వాతావరణంలో బాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు వేగంగా వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా మెదడు, నాడీ సంబంధ సమస్యలు వ్యాపిస్తాయి. మెదడు వాపు, మెనింజైటిస్, ఎన్సెఫాలిటిస్, వాస్కులైటిస్ లాంటి తీవ్ర వ్యాధులు సోకుతాయి. వీటి కారణంగా తీవ్రమైన తలనొప్పి, జ్వరం సోకి మానసిక వైకల్యం ఏర్పడుతుంది. నాడీ సంబంధ లోపాలు తలెత్తుతాయి. పరిస్థితి విషమిస్తే ప్రాణాలుపోయే అవకాశం కలుగుతుంది. ఈ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే, నయం చేసుకోవచ్చు. లేదంటే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇంతకీ వానాకాలంలో మెదడు సంబంధ వ్యాధులు సోకడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీటి ద్వారా వ్యాధికారకాల వ్యాప్తి:
⦿ కలుషితమైన నీరు: భారీ వర్షాలు, వరదలు కారణంగా హానికర బ్యాక్టీరియా, వైరస్‌లు తాగు నీటిలో కలిసి కలుషితం అవుతాయి. అంటు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
⦿ నిలిచిపోయిన నీరు: నీటి కుంటలు, నిలిపోయిన మురుగు నీటిలో దోమలు, జపనీస్ ఎన్సెఫాలిటిస్ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
పారిశుధ్య సమస్యలతో వ్యాధుల వ్యాప్తి:
⦿ పొంగిపొర్లే మురుగునీరు: వరదల కారణంగా తరచుగా మురుగునీటి కాల్వలు పొంగిపొర్లుతాయి. ప్రమాదకరమైన అంటువ్యాధులకు కారణమయ్యే వ్యాధి కారకాలను వ్యాప్తి చేస్తాయి.
⦿ దోమల వ్యాప్తి: వర్షాకాలం దోమలు విపరీతంగా పెరుగుతాయి. చల్లటి వాతావరణంలో దోమల సంతానోత్పత్తి బాగా పెరుగుతుంది. వెస్ట్ నైల్ వైరస్, జికా వైరస్ లు బాగా విజృంభిస్తాయి. ఈ రెండూ మెదడు సంబంధ వ్యాధులకు కారణం అవుతాయి.
⦿ ఎలుకలతో ముప్పు: వరదల కారణంగా ఎలుకలు ఇళ్లలోకి చేరుతాయి. వీటి ద్వారా మెదడు వ్యాధులకు కారణమయ్యే లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందుతాయి.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ:
⦿ పోషకాహార లోపాలు: వర్షాకాలంలో సాధారణంగా పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఇన్ఫెక్షన్లు ఈజీగా సోకే అవకాశం ఉంది.
⦿ ఒత్తిడితో సమస్యలు: వరదల కారణంగా ప్రజలలో ఒత్తిడి పెరుగుతుంది. స్ట్రెస్ అనేది రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది. అంటు వ్యాధుల ముప్పును పెంచుతుంది.
రద్దీ కారణంగా వ్యాధుల ముప్పు:
⦿ షెల్టర్లలో జనాల రద్దీ: వరదల కారణంగా జనాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తాయి. అక్కడ ఉండే జనాల రద్దీ కారణంగా అంటు వ్యాధుల వ్యాప్తిని పెరుగుతుంది.
⦿ పేలవమైన వెంటిలేషన్: రద్దీగా, తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు విజృంభిస్తాయి. వాటిలో ఎక్కువగా మెదడుకు హాని కలిగించే వ్యాధికారకాలు ఉంటాయి.
వైద్య సదుపాయాల కొరత:
⦿ వైద్యుల కొరత: వరదల నేపథ్యంలో సోకే వ్యాధులకు చికిత్స తీసుకునేందుకు వైద్య సదుపాయాలు సరిగా అందుబాటులో ఉండవు. సకాలంలో చికిత్స పొందడం కష్టతరం అవుతుంది.
⦿ ఔషధాల కొరత: వర్షాకాలంలో ఔషధాలకు కొరత ఏర్పడుతుంది. ఒక్కోసారి ఇంజెక్షన్లు, మందులు దొరక్క వ్యాధుల వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త
Read Also: 5 రోజులు, 6 మరణాలు - చండీపురాను వణికిస్తున్న వైరస్, చికిత్స లేని ఈ వ్యాధి లక్షణాలేంటో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)