అన్వేషించండి

Liver Problems : ముఖం లేదా కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే ప్రమాదమే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి

Warning Signs on the Face : మీ ముఖం లేదా కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే అవి కచ్చితంగా కాలేయ సమస్యలకు సంకేతాలు కావొచ్చు. ఏ పరిస్థుతుల్లో వైద్యులను సంప్రదించాలో తెలుసుకుందాం.

Liver Problems Symptoms : కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలను తొలగించడానికి, పోషకాలను శరీరానికి అందించడానికి సహాయపడుతుంది. కానీ కాలేయం బలహీనపడినప్పుడు.. అది సరిగ్గా పనిచేయనప్పుడు లేదా ఏదైనా వ్యాధి సోకినప్పుడు.. దాని ప్రభావం మన శరీరంలో కనిపిస్తుందట. ముఖ్యంగా ముఖం మీద కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖం పసుపు రంగులోకి మారితే..

ముఖ చర్మం లేదా కళ్లలోని తెల్లని భాగం కొద్దిగా లేదా నెమ్మదిగా ముదురు పసుపు రంగులోకి మారడం గమనిస్తే అస్సలు విస్మరించకూడదు. ఇది సాధారణ మార్పు కాదు కానీ.. కామెర్లు (జాండీస్) లక్షణం కావచ్చు. కాలేయం శరీరంలోని బిలిరుబిన్ అనే పసుపు రంగు పదార్ధాన్ని తొలగించలేనప్పుడు ఇలా జరుగుతుంది. దీని కారణంగా.. రక్తంలో పేరుకుపోయి.. ముఖం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

కళ్లకింద వాపు, బ్లాక్ సర్కిల్స్

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం లేదా కొద్దిగా వాపు సహజంగానే చాలామందికి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ లక్షణాలు శరీరంలో దాగి ఉన్న తీవ్రమైన సమస్యను, ముఖ్యంగా కాలేయ లోపాన్ని సూచిస్తాయట. కాలేయం శరీరంలోని విషపూరిత పదార్థాలను పూర్తిగా తొలగించలేనప్పుడు.. అలసట, నల్లటి వలయాలు, వాపు రూపంలో దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం.

మొటిమలు, బొబ్బలు

ముఖంపై అకస్మాత్తుగా మొటిమలు లేదా బొబ్బలు ఎక్కువగా వస్తే.. ఎన్ని మందులు వాడినా, ఇంటి నివారణలు చేసినా తగ్గకపోతే అది కేవలం చర్మ సమస్య మాత్రమే కాదని గుర్తించాలి. కాలేయంలో పేరుకుపోతున్న విషపూరిత పదార్థాల లక్షణం కావచ్చు. కాలేయం సరిగ్గా డీటాక్స్ చేయలేనప్పుడు.. దాని ప్రభావం చర్మంపై ఇలా కనిపిస్తుంది.

దురద లేదా మంట

ముఖ చర్మంపై ఎటువంటి అలెర్జీ లేదా సమస్య లేకుండా పదేపదే దురద లేదా మంట అనిపిస్తుందా?  అయితే ఇది కూడా కాలేయ పనితీరు లోపమే కావొచ్చు. కాలేయం పిత్తాన్ని సరిగ్గా నియంత్రించలేనప్పుడు.. అది చర్మం కింద పేరుకుపోయి మంట, దురదకు కారణమవుతుంది. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయవద్దు.

నోటి దుర్వాసన 

చాలామందికి నోటి నుంచి నిరంతరం దుర్వాసన వస్తుంటుంది. లేదంటే నోరు చేదు రుచితో ఇబ్బంది పడతారు. ఇది నోటి శుభ్రత వల్ల మాత్రమే కాదు.. కాలేయ లోపం వల్ల కూడా ఇలా రావచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు.. జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇది నోటి రుచి, వాసనపై ప్రభావం చూపుతుంది.

పెదవులు, కళ్లు పొడిబారడం

పెదవులు పదేపదే పొడిబారడం లేదా పగుళ్లు ఏర్పడటం, కళ్లు మూలల్లో కూడా పగుళ్లు కనిపిస్తే.. ఇది వాతావరణం లేదా చర్మ సమస్య వల్ల మాత్రమే కాదని గుర్తించాలి. కాలేయంలో విటమిన్లను ప్రాసెస్ చేసే సామర్థ్యంలో లోపం ఫలితం కూడా కావచ్చు. కాబట్టి సకాలంలో పరీక్ష చేయించుకుంటే మంచిది.

ముఖంపై వాపు

ముఖంపై ముఖ్యంగా కళ్లు, బుగ్గల దగ్గర పదేపదే వాపు వస్తుంటే.. ఇది కాలేయంలో వాపు (హెపటైటిస్) లేదా ఏదైనా తీవ్రమైన లోపం లక్షణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

జిడ్డు చర్మం

ముఖ చర్మం ఎల్లప్పుడూ జిడ్డుగా అనిపించడమనేది చాలా కామన్ విషయం. అయితే ఎంత కడిగినా నూనెగా అనిపిస్తే.. అది కాలేయ లోపమని గుర్తించాలి. కాలేయం శరీరంలోని కొవ్వును సరిగ్గా జీవక్రియ చేయలేనప్పుడు.. దాని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది.

ఈ లక్షణాలు అన్నీ కాలేయ లోపాన్ని సూచిస్తాయి. కాబట్టి ఏ లక్షణం కనిపించినా.. దానిని అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు నిపుణులు. సాధారణంగా కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డ్యామేజ్ తగ్గుతుందని గుర్తించాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dry Skin in Winter : చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget