Dinosaur Festival: డైనోసార్లను చూడాలని ఉందా? అయితే ఈ డైనోసార్ ఫెస్టివల్‌కు వెళ్లండి
డైనోసార్లు ఎప్పటికీ మిస్టరీనే. ఆ సినిమాలను వదలకుండా చూసేవాళ్లు ఇప్పటికీ ఎంతో మంది.
కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఈ భూమిపై తిరిగిన భారీ జీవులు డైనోసార్లు. వింత ఆకారంతో, భారీ పరిమాణంతో ఉన్న ఈ జీవులను మానవుడు చూడలేదు. మనిషి పుట్టుకకు ముందే మిస్టరీగా అంతరించిపోయాయి ఈ జీవులు.శిలాజాల రూపంలో వీటి ఆనవాళ్లు దొరుకుతూ మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. డైనోసార్ పాత్రలతో సినిమా తీస్తే చాలు ఆ సినిమా హిట్ కొట్టాల్సిందే. మీకు డైనోసార్ల మధ్య తిరుగుతున్న అనుభూతి కావాలా? త్వరలో చెన్నైలో జరగబోయే డైనోసార్ ఫెస్టివల్ కు వెళితే సరి. జూన్ 10 నుంచి 19 వరకు డైనోసార్ పండుగను నిర్వహించబోతున్నారు. రియల్ టైమ్ డైనోసార్ల అనుభవం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఎన్నో డైనోసార్ రకాలు
ఆనాటి జురాసిక్ పార్క్ ప్రపంచాన్ని మళ్లీ ఈ ఫెస్టివల్ లో ఆవిష్కరించబోతున్నారు. దాదాపు 65 మిలియన్ల ఏళ్ల క్రితం మట్టిలో కలిసిపోయిన జాతుల రూపాన్ని కూడా ఇప్పుడు ఈ ఫెస్టివల్ పునర్నిర్మించి ప్రదర్శించబోతున్నారు. దాదాపు 16 జాతుల డైనోసార్లను చూపించబోతున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో తిరుగాడినవే. ఇసిసారస్, రాజసారస్, బ్రూహత్కాయోసారస్, బ్రాషియోసారస్, టైరన్నోసారస్ రెక్స్, ట్రైసెరాటాప్స్ మొదలైన రకాల డైనోసార్ల రూపాలను ఈ ఫెస్టివల్ చూడొచ్చు.
పిల్లలకే ప్రత్యేకం...
పిల్లలకు ఈ ఫెస్టివల్ తెగ నచ్చుతుంది. పెద్ద పెద్ద డైనోసార్లు మధ్య తిరుగుతున్న ఫీల్ కలుగుతుంది. శిలాజాలు ఎంత తవ్వుతారు అనేది ఇక్కడ చూపించి వివరిస్తారు. ఇంకా ఎన్నో వినోదభరితమైన కార్యకలాపాలు ఉంటాయి. డైనోసార్ ను ఇష్టపడేవారికి ఇది చాలా ఫన్ ప్లేస్. ఈ ఫెస్టివల్ ను తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభించారు. చెన్నై తరువాత ముంబైలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్ ఇకపై జరగబోతోంది. కుటుంబంతో ఓ రోజు గడిపేందుకు ఇది ఉత్తమ స్థలం.చెన్నైలోని పాఠశాలల ద్వారా వచ్చే పిల్లలకు మాత్రం ఉచితం. కుటుంబంతో వెళ్లే వాళ్లు ప్రత్యేకంగా టిక్కెట్లు కొనుక్కోవాలి.
Also read: కనిపించని కిల్లర్ యాంగ్జయిటీ, ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే
Also read: ఇలాంటి పెళ్లి చూసుండరు, పాములనే పూల దండల్లా భావిస్తూ పెళ్లి చేసుకున్న జంట, పాత వీడియో వైరల్