WeightLoss: ఏమీ తినకుండా వర్కవుట్స్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారనుకుంటున్నారా? అసలు నిజం ఇదే
బరువు తగ్గడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారు సరైన పద్ధతిలో తగ్గడానికి ప్రయత్నించడం లేదు.
ప్రపంచంలో ఎంతో మంది అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో ఎంతో మంది ఆ బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది సరైన పద్ధతిలో న్యూట్రిషనిస్టుల సాయంతో బరువు తగ్గుతుంటే, మరికొంతమంది మాత్రం నచ్చినట్టు వ్యాయామాలు చేసి బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంతమంది ఉదయం లేచాక ఖాళీ పొట్టతో వ్యాయామాలు చేస్తుంటారు. ఇలా ఖాళీ పొట్టతో వ్యాయామాలు చేయడాన్ని ‘ఫాస్టెడ్ కార్డియో’ అంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా బరువు తగ్గిపోతామని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఖాళీ పొట్టతో వ్యాయామాలు చేస్తే బీపీ పడిపోయ పరిస్థితి వస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు ఏదైనా పండు తినాలి.
బ్లాక్ కాఫీ, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ నిండిన నీళ్లు వంటివి తాగాలి. వ్యాయామం చేయడానికి ముందు, వ్యాయామం చేస్తూ మధ్యలో గ్యాప్ తీసుకుని కూడా ఈ పానీయాలను తాగ వచ్చు. పూర్తిగా ఖాళీ పొట్టతో మాత్రం వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల చాలా ప్రమాదం. కాబట్టి ఉదయం లేచాక పాలు లేదా ఏదైనా పానీయం తాగి ఓ అరగంట పాటూ గ్యాప్ ఇవ్వండి. తరువాత వ్యాయామం చేయండి. రెండు అరటి పండ్లు తిన్నాక చేసినా మంచిదే. ఒక యాపిల్ తినడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
వ్యాయామాలంలో పాటూ చిన్న పనులు చేయడం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికి ముందు తెల్లవారు జామునే నిద్ర లేవాలి. ఉదయం పూట ఎక్కువ సేపు నిద్రపోయే వారు త్వరగా బరువు తగ్గుతారు. ఉదయం ఆరుగంటల్లోపే నిద్రలేవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుగ్గా జరుగుతాయి. కాబట్టి తిన్న ఆహారం కొవ్వు రూపంలోకి మారకుండా త్వరగా జీర్ణమవుతుంది. రోజులో కనీసం పావుగంట సేపు ధ్యానం చేస్తే అన్ని విధాలా మంచిది. ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
లేచిన వెంటనే గ్లాసుడు నీళ్లు తాగండి. ముఖ్యంగా గోరువెచ్చని నీళ్లనే తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకుండా తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వ్యాయామాలను సాయంత్రం కన్నా ఉదయం పూట చేస్తేనే ఆరోగ్యం. నిద్రకు కూడా వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి.
Also read: కోడిగుడ్లు అధికంగా తింటే వచ్చే సమస్యలు ఇవే, అందుకే రోజుకు ఎన్ని తినాలంటే
Also read: పీడకలలు వస్తుంటే తేలికగా తీసుకుంటున్నారా? వాటి ఫలితం ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.