News
News
X

Weight loss: త్వరగా బరువు తగ్గాలా? ఓట్స్‌ను ఇలా ఉపయోగించండి...

బరువు తగ్గేవారికి ఓట్స్ చాలా ఉపకరిస్తాయని తెలిసిన విషయమే. కానీ ఎలా వండుకుంటే త్వరగా బరువు తగ్గుతారో తెలుసా?

FOLLOW US: 

ఫైబర్, రెసిస్టెంట్ పిండిపదార్థంతో ప్యాక్ చేసిన పవర్ ఫుల్ ఆహారం ఓట్ మీల్. ఇది బరువు తగ్గడంలో సహాయపడే పవర్ ప్లేయర్. మీ పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మీరు సూపర్ హెల్తీగా మారడం ఖాయం. అయితే ఓట్స్ మీల్ ఎలా వండుకుని తింటే త్వరగా కిలోలు కరుగుతాయో మాత్రం చాలా మందికి తెలియదు. కొంతమంది తీపిని జోడించడం, టాపింగ్స్ అధికంగా వేసకుని తినడం లాంటివి చేస్తారు. దీని వల్ల బరువు తగ్గడం కాస్త కష్టమవుతుంది. 

1. బ్రెడ్ క్రంబ్స్‌కు బదులు
ఓట్స్ ని కేవలం ఉదయం బ్రేక్ ఫాస్ట్ గానే కాదు అనేక వంటకాల రూపంలో తినచ్చు. నగ్గెట్స్, మీట్ బాల్స్, ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాలు వండినప్పుడు బ్రెడ్ పొడికి బదులు ఓట్స్ పొడిని వినియోగించండి. 

2. పాన్ కేక్‌లు వేసుకోండి
ఓట్స్‌తో టేస్టీ పాన్‌కేక్‌లు చేసుకోవచ్చు. గుడ్లు, ఓట్స్ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి కాస్త పాలు, నీళ్లు చేర్చి అట్లు పిండిలా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా కాస్త గట్టిగా ఉండేట్టు చూసుకోవాలి. వాటిని చిన్న అట్లులా పోసుకుని పైన కాస్త తేనె, అరటి ముక్కలు పెట్టుకుని తింటే ఆ రుచే వేరు. 

3. మఫిన్స్ తయారీ
ఓట్స్‌తో రుచికరమైన మఫిన్స్ తయారుచేసుకోవచ్చు. మఫిన్స్ తయారీలో ఓట్స్ పిండిని కూడా కలిపి చక్కెరకు బదులు అరటి పండు గుజ్జును చేర్చి పేస్టులా చేసుకోవాలి. వాటిని కప్పుల్లో వేసి ఓవెన్లో పావుగంటసేపు ఉంచితే మఫిన్స్ రెడీ.  

News Reels

4. స్మూతీలు
బరువు తగ్గే ప్రయాణంలో ఓట్స్ కచ్చితంగా మీకు మేలు చేస్తుంది. స్మూతీ తయారుచేసేటప్పుడు అందులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను చేర్చుకోండి. ఇది స్మూతీని కాస్త మందంగా, ఆరోగ్యకరమైనదిగా మారుస్తుంది. ఫైబర్ కూడా అధికంగా అందుతుంది. 

5. సాస్‌లు, సూప్‌లలో..
ఇంట్లోనే సాస్‌లు, సూప్‌లు తయారుచేసుకుంటున్నప్పుడు కాస్త ఓట్స్ పొడిని కూడా కలిపి చేసుకోండి. సూప్ మరీ పలుచనైనప్పుడు కూడా ఓట్స్ పొడి త్వరగా గట్టిపడేలా చేస్తుంది. 

Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం

Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే

Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Dec 2021 02:40 PM (IST) Tags: weight loss Lose weight fast Oat meal ఓట్ మీల్

సంబంధిత కథనాలు

Heart Health: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి

Heart Health: ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నాయా? గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరికలు అవి

Arthritis: చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? వాటిని తగ్గించుకోవడం ఎలా?

Arthritis: చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? వాటిని తగ్గించుకోవడం ఎలా?

Dengue: డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేలా చేసే సూపర్ ఫ్రూట్స్

Dengue: డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేలా చేసే సూపర్ ఫ్రూట్స్

ఆకలిని పెంచి మధుమేహాన్ని తగ్గించే చిరాత - ఏమిటీ చిరాత? దీని ఎలా తినాలి?

ఆకలిని పెంచి మధుమేహాన్ని తగ్గించే చిరాత - ఏమిటీ చిరాత? దీని ఎలా తినాలి?

నిద్ర పట్టడం లేదా? పీడకలలు వస్తున్నాయా? రాత్రిపూట ఈ ఆహారాలను దూరం పెట్టండి

నిద్ర పట్టడం లేదా? పీడకలలు వస్తున్నాయా? రాత్రిపూట ఈ ఆహారాలను దూరం పెట్టండి

టాప్ స్టోరీస్

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట- షరతులతో కూడిన బెయిల్ మంజూరు

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!

India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!