Virus in Pig Heart: ఆ వ్యక్తికి అమర్చిన పంది గుండెలో వైరస్, అదే అతడి ప్రాణం తీసిందా?
పంది గుండెను పొందిన ఆ వ్యక్తి మరణానికి కారణాలను తెలుసుకోవడంలో వైద్య నిపుణులు బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆ పంది గుండెలో జంతువుల్లో ఉండే వైరస్‌ను కనుగొన్నారు.
పంది గుండెతో మనిషి బతకవచ్చా? అదే సాధ్యమైతే గుండె జబ్బులతో బాధపడేవారికి తప్పకుండా గుడ్ న్యూసే అవుతుంది. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్ వైద్యులు డేవిడ్ బెన్నెట్ సీనియర్ అనే 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని సంతోషించే లోపు ఘోరం జరిగిపోయింది. ఆ గుండెను అమర్చిన రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే, అతడి మరణానికి కారణం ఏమిటీ? ఆ గుండెతో రెండు నెలలు బతికిన వ్యక్తి.. అకస్మాత్తుగా చనిపోడానికి కారణం ఏమిటీ? సర్జరీ విజయవంతమైందా? లేదా ఏమైనా లోపాలున్నాయా?.. ఇలా ఒకటేమిటీ ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు అతడి మరణానికి కారణాలు తెలుసుకొనే పనిలోపడ్డారు. బాధితుడికి అమర్జిన గుండెను పరిశీలించగా.. అందులో జంతువులకు ఎక్కువగా సోకే వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, అదే అతడి మరణానికి కారణమా అనేది ఇంకా తేల్చలేదు.
ప్రయోగాత్మక గుండె మార్పిడి జరిగిన రెండు నెలల్లో డేవిడ్ బెన్నెట్ సీనియర్ మరణించడం వైద్య నిపుణులను షాక్‌కు గురిచేసింది. దీనిపై యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పంది గుండె లోపల ఉండే వైరల్ DNAలోని ‘పోర్సిన్ సైటోమెగలో వైరస్’ అని పిలువబడే బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు గురిచేయొచ్చు. పైగా జంతువుల నుంచి మనిషికి గుండె మార్పిడి చేయడం అంత మంచి ఆలోచన కాదు. దానివల్ల జంతువుల నుంచి ప్రజలకు కొత్త రకాల ఇన్ఫెక్షన్‌లు ఏర్పడే ప్రమాదం ఉంది’’ అని తెలిపారు.
బెన్నెట్‌కు పది గుండెను అమర్చిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ.. ‘‘కొన్ని వైరస్‌లు ఎలాంటి వ్యాధులు కలిగించకుండా రహస్యంగా దాగి ఉంటాయి. అవి హిచ్‌హైకర్ కావచ్చు’’ అని తెలిపారు. వైద్య నిపుణులు కొన్ని దశాబ్దాలుగా జంతు అవయవాలతో మానవ ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బెన్నెట్‌పై చేసిన ప్రయోగం కూడా అదే. అయితే, బెన్నెట్ మానవ గుండె మార్పిడితో బతికే అవకాశం లేదనే కారణంతో వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అతడి రోగనిరోధక వ్యవస్థ వేరే మానవ అవయవాన్ని వేగంగా తిరస్కరించే ప్రమాదం ఉందనే కారణంతో చివరి ప్రయత్నంగా.. జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను అమర్చారు.
Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
గుండె దానమిచ్చే సమయంలో ఆ పందికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు, వ్యాధులు లేవని వైద్యులు తెలిపారు. ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేసన్’ పరీక్షల్లో కూడా ఆ జంతువుకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధరించారు. ఆ పందిని అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో పెంచినట్లు వెల్లడించారు. గుండె మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత బెన్నట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వైద్యులు బెన్నెట్‌కు అనేకరకాల యాంటీబయాటిక్‌లు, యాంటీవైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సను అందించారు. కానీ పంది గుండె ఉబ్బి, ద్రవంతో నిండిపోయి చివరికి పని చేయడం మానేసింది. అతడి గుండె వాపుకు కారణం వైరస్ కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు.
Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి