అందాల పోటీల్లో గెలిస్తే ఎన్నారైతో పెళ్లంట - విషయం తెలిసి ఖాకీలే పెళ్లి చేశారు!
ఏవైనా ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. కాదని అడ్డుగోలుగా ప్రచారం మొదలు పెడితే అసలుకే ఎసరొచ్చే అవకాశం ఉంటుంది. పంజాబ్ లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.
పంజాబ్ లో కొంత మంది అందాల పోటీలు నిర్వహించాలి అనుకున్నారు. ఈ నెలలోనే అందాల పోటీలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ పోటీల గురించి జనాలకు తెలియాలనే ఉద్దేశంతో పలు చోట్ల పోస్టర్లు వేయించారు. ఈ పోస్టర్లే ఇప్పుడు పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఏకంగా పోలీసులు దగ్గరికి వెళ్లింది. ఖాకీలు నిర్వహకులపై కేసు బుక్ చేసి విచారణ మొదలు పెట్టారు. ఇంతకీ నిర్వాహకులు ఆ పోస్టర్లలో ఏం రాశారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పోటీల్లో గెలిస్తే కెనడియన్ ఎన్నారైతో పెళ్లి!
బటిండాలోని స్వీట్ మిలన్ హోటల్ లో అక్టోబరు 23న అందాల పోటీలు నిర్వహించబోతున్నట్లు ఈ పోస్టర్లలో నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు, ఈ అందాల పోటీల్లో విజయం సాధించిన అమ్మాయికి కెనడాకు చెందిన ఎన్నారైతో వివాహం చేయిస్తామని బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రచారం చేసేలా బటిండా నగరవ్యాప్తంగా ఈ పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్ లో మరో కీలక విషయాన్ని రాశారు. సాధారణ కులానికి చెందిన అమ్మాయిలకు మాత్రమే ఈ పోటీలు అని పేర్కొన్నారు. ఈ ప్రకటన చూసిన జనాలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు కాసేపట్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
నిర్వాహకులపై వ్యతిరేకంగా మహిళా సంఘాలు గుర్రు
మరోవైపు ఈ అందాల పోటీల వ్యవహారంపై మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. ఇలాంటి ప్రకటనలతో మహిళలను అవమానించడం క్షమించరాని నేరమని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు కుల వివక్షను పెంచడంతో పాటు మహిళలను అవమానించేలా ఈ పోస్టర్లు వేశారని మండిపడుతున్నారు. అటు పోస్టర్లలో వేసిన ఫోన్ నెంబర్ల ద్వారా నిర్వాహకులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, ఇందులో వెల్లడించిన రెండు ఫోన్ నెంబర్ల ప్రస్తుతం పని చేయకపోవడం విశేషం.
నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
మరోవైపు ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నిర్వాహకులను కనుగొనే పనిలో పడ్డారు. మరోవైపు ఈ అందాల పోటీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని స్వీట్ మిలన్ హోటల్ యజమాని వెల్లడించారు. తమ హోటల్ పేరు ఎలాంటి అనుమతి లేకుండా వాడుకోడం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నమని వెల్లడించారు.
Taking Swift action Bathinda Police registered FIR & action is being taken against the guilty persons.Violation of law will not be tolerated at any cost.
— BATHINDA POLICE (@BathindaPolice) October 13, 2022
Also Read: డిసెంబర్ లో భూమ్మీదకు గ్రహాంతరవాసులు, మార్చిలో మెగా సునామీ! టైమ్ ట్రావెలర్ సంచలన అంచనాలు నిజమయ్యేనా?