(Source: ECI/ABP News/ABP Majha)
Aliens: డిసెంబర్లో భూమ్మీదకు గ్రహాంతరవాసులు, మార్చిలో మెగా సునామీ! టైమ్ ట్రావెలర్ సంచలన అంచనాలు నిజమయ్యేనా?
తాజాగా ఓ టైమ్ ట్రావెలర్ వేసిన అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. భూమి విధిని శాశ్వతంగా మార్చే ఐదు భారీ విపత్కర సంఘటలను జరగబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
గ్రహాంత వాసులపై చాలా కాలంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వారి ఉనికిని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు వారిని కనిపెట్టలేకపోయారు. ఊహాగానాలు మినహా వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోయారు. అసలు ఏలియన్స్ ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వారు మనల్ని చూసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎనో అలరిక్ అనే ఓ స్వయం ప్రకటిత టైమ్ ట్రావెలర్ చెప్పిన జోస్యం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంట?
డిసెంబర్ 8న భూమ్మీదకు ఏలియన్స్
ఈ ఏడాది డిసెంబర్ 8న ఏలియన్స్ భూమ్మీదకు రాబోతున్నారని అలరిక్ వెల్లడించారు. టిక్‌టాక్ వేదికగా ఆయన కీలక విషయాలు ప్రకటించారు. “'అటెన్షన్! నేను 2671 సంవత్సరం నుంచి రియల్ టైమ్ ట్రావెలర్‌ను. రాబోయే ఈ ఐదు తేదీలను కచ్చితంగా గుర్తుంచుకోండి” అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో మొత్తం ఐదు విషయాల గురించి ప్రస్తావన ఉంది. వీటిలో అత్యంత కీలకమైన అంశంగా గ్రహాంతర వాసుల ప్రస్తావన ఉంది. వచ్చే డిసెంబరులో మానవులు గ్రహాంతరవాసులతో సంభాషించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలరిక్ అంచనా ప్రకారం, డిసెంబర్ 8న ఒక పెద్ద ఉల్కలో గ్రహాంత వాసులు భూమి మీదకు వస్తారు.
Read Also: ప్రపంచంలో గురుత్వాకర్షణ పని చేయని వింత ప్రదేశాలు ఇవే, గాల్లో తేలినట్లే!
6 నెలల వ్యవధిలో 4 కీలక సంఘటనలు
ఏలియన్స్ రాకతో పాటు భూమ్మీద మరో నాలుగు కీలక సంఘటనలు జరగబోతున్నట్లు వెల్లడించారు. అవేంటో కూడా ఆయన వివరించారు. ఈ ఏడాది నవంబర్ 30న భూమిని అనుకరించే ఓ సరికొత్త గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెడుతుందని చెప్పారు. డిసెంబర్ 8న భూమ్మీదకు ఏలియన్స్ అడుగుపెడతారనిఅంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న నలుగురు టీనేజర్ల బృందం ఇతర గెలాక్సీలకు వార్మ్‌హోల్‌ను తెరవడానికి ఉపయోగపడే పరికరాన్ని కనుగొంటారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలలో మరియానా ట్రెంచ్‌లో ఒక పురాతన జాతి కనుగొనబడుతుందని వెల్లడించారు. అదే నెలలో అమెరికా పశ్చిమ తీరం 750 అడుగుల మెగా సునామీకి అతలాకుతలం అవుతుందని ఆయన అంచనా వేశారు.
నాసా, ఇస్రోలకు నెటిజనల ప్రశ్నలు
ఎనో అలరిక్ అంచనాలను నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ గా పరిశీలిస్తున్నారు. నిజంగా ఆయన చెప్పిన ఘటనలు జరుగుతాయా? అని ఆలోచిస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు తమ అనుమానాలను క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. అలరిక్ అంచనాలు ఏమేరకు నిజం అయ్యే అవకాశం ఉందో చెప్పాలంటూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ట్వీట్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు ఆయన అంచనాలు శుద్ధ అబద్దంగా కొట్టిపారేస్తున్నారు.
Hey @NASA @isro
— dropoutstudent (@G0wthamK) October 10, 2022
Is #enoalaric predictions true?