By: ABP Desam | Updated at : 13 Nov 2021 11:06 PM (IST)
Image Credit: Twitter
మొసలి ఆకారాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటిది అది కళ్ల ముందు ఉంటే.. ఆ మహిళ ఏ మాత్రం భయపడలేదు. పైగా.. అది మీదకు వస్తుంటే చెప్పు చూపించి అక్కడి నుంచి తరిమి కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఆమె ధైర్యంగా చెప్పు చూపించింది సరే. కానీ, ఆ మొసలి చెప్పును చూసి వెనక్కి వెళ్లిపోవడం మరో షాకింగ్ విషయం. ఎన్‌బీఎక్స్ ఆటగాడు.. రెక్స్ చాంప్‌మ్యాన్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కుక్క పిల్లతో నది తీరంలో తిరుగుతోంది. అదే సమయంలో రెండు మొసళ్లు అటుగా వచ్చాయి. కుక్క పిల్ల కోసం ఆ మొసళ్లు అటుగా వచ్చాయి. దీంతో ఆ మహిళ చెప్పు తీసి మొసలికి చూపించింది. అంతే.. వెంటనే మొసలి వెనక్కి తగ్గి మళ్లీ ప్రవాహంలోకి వెళ్లిపోయింది. మొసలి తీరానికి రావడం చూసి.. ఒడ్డున ఉన్న కొందరు ఆమెను అప్రమత్తం కూడా చేశారు. అయితే, వారి అరుపులను సైతం ఆమె పట్టించుకోకుండా అక్కడే ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆ వీడియోను ఇక్కడ చూడండి. వీడియో:
Alligators? No problem — la chancla … pic.twitter.com/EVkPhMppj2
— Rex Chapman🏇🏼 (@RexChapman) November 11, 2021
ఈ సంఘటన 2016లో జరిగినట్లు సమాచారం. ఈ వీడియో ఆన్‌లైన్‌లో మరోసారి వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలోని నేషనల్ పార్క్‌లో ఈ వీడియో చిత్రీకరించారు. లుండన్ అన్లెజార్క్ అనే వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొసళ్లు ఎంత ప్రమాదకరమైనవో ఆమెకు తెలియదని, అందుకే ఆమె అలా ప్రవర్తించిందని అతడు పేర్కొన్నాడు. ఈ వీడియోను సుమారు 1.4 మిలియన్ మంది కంటే ఎక్కువ మంది వీక్షించారు. అయితే, ఆమె మొసలిని చెప్పుతో భయపెట్టడమనేది నెటిజనులకు బాగా నచ్చేసింది. మొసలి అంటే ఏమైనా కుక్క పిల్లా? అలా చెప్పు చూపిస్తూ బెదిరించిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. చెప్పును చూపిస్తే మొసళ్లు నిజంగానే భయపడిపోతాయా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?
అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు
సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?
సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Sundar Pichai Salary: గూగుల్లో మరో హిట్ వికెట్, సుందర్ పిచాయ్ జీతంలో భారీ కోత!
Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు
Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే "ఉక్కు ప్రజా గర్జన "