Viral Video: అక్క పెళ్లిలో డ్యాన్సు ఇరగదీసిన చెల్లి, వైరల్ అవుతున్న వీడియో
ఓ అక్క పెళ్లిలో ఆమె చెల్లి వేసిన డ్యాన్సు నెటిజన్లకు తెగనచ్చేసింది. మీరూ ఓ లుక్కేయండి.
సోషల్ మీడియా ఏలుతున్న కాలం ఇది. ఏ మూల చిన్న విషయం జరిగినా ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో తెగ వైరల్ అయిపోతోంది. అలా ఓ అమ్మాయి తన అక్క పెళ్లిలో ఆనందంలో వేసిన డ్యాన్సు వైరల్ గా మారింది. ఆ వీడియోలో పెళ్లి కూతురు చెల్లి హిందీ పాట బిజ్లీబిజ్లీకి చిందులేసింది. డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టింది. వధూవరుల కన్నా పెళ్లిలో ఈమెను చూసిన వారే ఎక్కువ. ఆమె పేరు నిఖితా కపూర్ గా తెలుస్తోంది. ఆమె డ్యాన్సు చేసిన వీడియోలను ఫ్యాబ్ వెడ్డింగ్ అనే ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె డ్యాన్సు ఎవరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
ఈ వీడియోకు నెటిజన్ల నుండి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తారు. లవ్ ఎమోజీలతో నింపేశారు. ఈ వీడియోకు పదహారు వేల కన్నా ఎక్కువ లైక్ లు వచ్చాయి. ఆమెను ‘అందమైన ఫైర్’అంటూ వ్యాఖ్యానించారు. మరొకరు ‘ఏమి ఎనర్జీ ఆమెది’ అంటూ మెచ్చుకున్నారు.
ఇంతకుముందు కూడా పెళ్లిళ్లలో చేసిన చాలా వీడియోలు వైరల్ గా మారాయి. ఈ మధ్య ఓ పెళ్లి కూతురు స్టేజిపైనే చిందులేసింది. వరుడు ముసిముసిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వీడియో కూడా నెటిజన్లకు తెగ నచ్చింది. ఈ రెండూ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి.
View this post on Instagram
View this post on Instagram
Also read: వేలానికి ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం, ఎంతకి అమ్ముడుపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also read: ప్రతి చిన్నవిషయానికి కోపం వస్తుందా? వీటిని రోజూ తినండి కంట్రోల్‌లో ఉంటుంది