డబ్బులు సంపాదించేందుకు వెరైటీ ఐడియా - పది రూపాయలిస్తే మీకు బదులు అతనే మునకేస్తాడు
డబ్బుల సంపాదనకు ఆ వ్యక్తి వెరైటీ దారిని ఎంచుకున్నాడు.
కోటి విద్యలు కూటి కొరకే... అని ఊరికే అనలేదు.ఇలాంటి వారిని చూసే అనుంటారు. డబ్బుల సంపాదనకు చాలా వెరైటీ దారిని ఎంచుకున్నాడు. రోజంతా గంగానదిలో మునకలేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడు. ఇతని గురించిన వీడియో ఐఏఎస్ ఆఫీసర్ అవినాష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు. ఈ సీజన్లో ఉత్తమ స్టార్టప్ ఇదే అంటూ కామెంట్ చేశారాయన. ఆ పోస్టుకు ఎంతో మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. లక్షల వ్యూస్ కూడా వచ్చాయి.
వీడియోలో ఏముంది?
వీడియోలో ఒక వ్యక్తి గంగా నది లోని రెయిలింగ్ మీద కూర్చుని ఉన్నాడు. అతను గట్టిగా ‘నేను మీ పేరు మీద గంగలో మునక వేస్తా, నాకు మీరు 10 రూపాయలు ఇవ్వండి చాలు’ అని అడుగుతున్నాడు. అదే అతని జీవనాధారంగా మార్చుకున్నాడు. శీతాకాలంలో గంగానది చాలా చల్లగా ఉంటుంది. అంత చల్ల దనాన్ని పెద్ద వయసు వారు తట్టుకోవడం చాలా కష్టం. అంత దూరం వెళ్లాక గంగానదిలో మునక వేసి, పాపాలు పోగొట్టుకోలేదనే బాధ వారి మనసులో ఉండిపోతుంది. అలాంటి వారు తమ పేరు మునక వేయమని ఇతడిని అడుగుతున్నారు. ఎవరు డబ్బులిస్తారో వారి పేరు చెప్పి ఇతను మునకలు వేస్తాడు. అంతటి చల్లని నీళ్లలో ఉదయం నుంచి మునకలు వేస్తుంటే అతని ఆరోగ్యం ఏమవుతుందో అని ఆలోచించే నెటిజన్లు కూడా ఉన్నారు. కానీ పొట్ట కూటి కోసం ఈ పాట్లు తనకు తప్పవని అంటున్నాడట అతను.
इस मौसम का बेहतरीन ‘स्टार्टअप’ pic.twitter.com/SVjxsuLC8m
— Awanish Sharan (@AwanishSharan) December 24, 2022
ఏది ఏమైనా కాలానుగుణంగా అతనికి వచ్చిన ఐడియా మాత్రం చాలా మందికి కొత్తగా అనిపించింది. ఇలాంటివి ఇండియాలో మాత్రమే కనిపిస్తాయి అని ఒకరు కామెంట్ చేస్తే, ఇండియా బయటికి వెళితే ఇలాంటి పనులు పనిచేయవు అని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా మిగతా అందరితో పోలిస్తే ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన అని ఒప్పుకోవాల్సిందే. ఇతడికి డబ్బులు రావడం చూస్తే చుట్టుపక్కల శీతాకాలం, వానా కాలంలో ఇలాంటి వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
Proxy Dubki😁😁😁
— Rupin Sharma IPS (@rupin1992) December 23, 2022
₹10/- per dubki☺️😁😁#Winters pic.twitter.com/w73rgPAPNI
— Rahul Agrawal (@rahulagrawalcom) December 24, 2022
— Sidy⚡ (@sichaholmes) December 24, 2022
Also read: 20 మందిని చంపిన సీరియల్ కిల్లర్ పక్కనే కూర్చోవాల్సి వస్తే, పాపం ఆ మహిళ