అన్వేషించండి

Online Dating Tips : డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకు కచ్చితంగా హెల్ప్ అవుతాయి..

Relationship Tips : స్మార్ట్​ ఫోన్ వినియోగం పెరిగాక.. వివిధ రకాల యాప్స్ వాడకం కూడా పెరిగిపోయింది. వాటిలో డేటింగ్ యాప్స్ కూడా ఒకటి. అయితే వీటిని మీరు కూడా ఉపయోగిస్తే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. 

Dating Phone Apps : ఆన్​లైన్​ డేటింగ్​ కల్చర్​ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్లే స్టోర్​లో డేటింగ్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొందరు ఈ డేటింగ్ యాప్స్ డౌన్​లోడ్ చేసి.. తమ వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోతున్నారు. మరికొందరు యువతల పేరుతో.. స్కామ్ చేస్తూ.. బ్యాంక్​ ఖాతాలను, ఫోన్​లను హ్యాక్ చేస్తున్నారు. అయితే మీరు ఇలాంటి స్కామర్ల బారిన పడకూడదంటే.. డేటింగ్ యాప్స్ ఉపయోగించే ముందు, ఉపయోగించేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. 

వ్యక్తులతో కనెక్ట్ కావడానికి డేటింగ్ యాప్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. తెలియనివారితో కనెక్ట్ కావడానికి ఇవి అనుకూలమైన మర్గాన్ని ఇస్తున్నాయి. రెగ్యూలర్ డేటింగ్స్ మాదిరిగా కాకుండా.. ఆన్​లైన్​లో డేటింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోతుంది. అందుకే ఆన్​లైన్​లో డేటింగ్ యాప్స్​ని ఉపయోగించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. 

పాపులర్ డేటింగ్ యాప్స్​ని ఎంచుకోండి..

డేటింగ్ వెబ్​సైట్​ లేదా యాప్​ను ఎంచుకునేప్పుడు.. బాగా పేరున్న(Best Dating Apps) వాటిని ఎంచుకుంటే మంచిది. ఈ ప్లాట్​ఫారమ్​లు ఇతరుల ధృవీకరణ, గుర్తింపు, ప్రొఫైల్​ల నియంత్రణ వంటి బలమైన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి. డేటింగ్ యాప్​ను సైన్​ అప్ చేసే ముందు ప్లాట్​ఫారమ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. సేఫ్ అండ్ సెక్యూర్డ్​గా ఉంటేనే వాటిని డౌన్​లోడ్ చేసుకోవాలి. 

వ్యక్తిగత సమాచారంతో జరభద్రం

డేటింగ్ యాప్​లో కలిసిన ఎవరినైనా మీట్​ అయితే.. మీరు వారితో పూర్తి వివరాలు చెప్పకపోవడమే మంచిది. మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లేదా వర్క్ ప్లేస్​ వంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లిమిటెడ్​ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మంచిది. తర్వతా వ్యక్తిపై నమ్మకం పెరిగినప్పుడు డిటైల్స్ ఇవ్వొచ్చు. వ్యక్తిగత వివరాలు వినియోగదారులకు అందించని యాప్స్​ ఎంచుకుంటే మంచిది. 

అవి రెడ్​ ఫ్లాగ్స్..

ఏదైనా తప్పుగా అనిపించినా.. గట్​ ఫీలింగ్స్​ని నమ్మండి. మితిమీరిన దూకుడు ప్రవర్తన లేదా డబ్బుల కోసం అభ్యర్థిస్తుంటే జాగ్రత్త. ఏదైనా సమాచారం అస్థిరంగా చెప్తే మరింత జాగ్రత్త. వారు రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తు పెట్టుకోండి. మీకు అసౌకర్యంగా, అసురక్షితంగా అనిపిస్తే కమ్యూనికేషన్​ని ముగించి.. బ్లాక్ చేయడానికి వెనుకాడకండి. 

బహిరంగ ప్రదేశాలే బెటర్

మీరు ఎవరినైనా వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నప్పుడు బహిరంగ ప్రదేశాలు ఎంచుకోండి. రెస్టారెంట్​లు, కాఫీ షాప్​లు లేదా ఇతర వ్యక్తులు ఉండే పబ్లిక్ వేదికలకు వెళ్తే మంచిది. మీరు ఎక్కడకి వెళ్తున్నారో.. ఎవరిని కలుస్తున్నారో కనీసం ఒక్కరితోనైనా షేర్ చేసుకోండి. మీ లోకేషన్​ను వారికి షేర్ చేయండి. 

హుందాగా ఉంటూనే..

మీ డేట్​ సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఆల్కహాల్ లేదా ఇతర మత్తుపదార్థాలు తీసుకోవడం మానేయండి. ఇవి మీరు హుందాగా ఉంటూనే.. అవతలి వ్యక్తికి ఎలాంటి అడ్వాంటేజ్ ఇవ్వకుండా చేస్తుంది. లేదంటే మీరు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చిన అవతలి వారికి అది అడ్వాంటేజ్​ ఇచ్చినట్లు అవుతుంది. తర్వాత మీరే రిగ్రేట్ అవ్వాలి. 

వారికి డబ్బు కావాలి.. ప్రేమ కాదు.. 

ఆన్​లైన్​లో రొమాన్స్ పేరుతో స్కామర్లు డబ్బులు వసూలు చేయడం రోజురోజుకు పెరుగుతుంది. ఈ తరహా కంప్లైయిట్లు చాలా వస్తున్నాయి. అమ్మాయిపేరుతో.. ఎమర్జెన్సీ అంటూ.. డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎకౌంట్ డిటైల్స్ సంపాదించి.. మీ ఖాతాను హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఎక్కువైతుంది. మహిళల రూపంలో మీతో సన్నిహితంగా ఉంటూనే.. మీ జేబును ఖాళీ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. 

Also Read : టీనేజ్​లో ప్రెగ్నెంట్ అయితే అకాల మరణం తప్పదంటున్న న్యూ స్టడీ.. పెరుగుతున్న మరణాల రేటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget