Teen Pregnancy is the Risk of Premature Death : టీనేజ్‌లో ప్రెగ్నెంట్ అయితే అకాల మరణం తప్పదంటున్న న్యూ స్టడీ.. పెరుగుతున్న మరణాల రేటు
Teen Pregnancy Deaths : టీనేజ్‌లో గర్భవతి అయితే.. ఆ యువతులు అకాల మరణాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటూ ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు తెలిపింది.
Teen Pregnancy and the Risk of Premature Mortality : తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం యుక్తవయస్సులో గర్భం ధరించిన యువతలు అకాల మరణాలకు దారితీస్తున్నాయని తెలిపింది. టీనేజ్ గర్భం, ప్రసవ సమయంలో మరణాలు రక్తస్రావం, అధిక రక్తపోటు రుగ్మతలు లేదా సెప్సిస్ వంటి వాటివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే యుక్తవయసులో గర్భం దాల్చిన వారు అకాల మరణాలతో చనిపోయే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని JAMA నెట్వర్క్ చేసిన సర్వేలో తేలింది.
యుక్త వయస్సులో ప్రెగ్నెన్సీతో అకాల మరణాలు
కెనడాలోని 2.2 మిలియన్ల మహిళా టీనేజర్లలో 31 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవారిపై యూనివర్సల్ హెల్త్‌కేర్ సిస్టమ్‌లో స్టడీ చేశారు. ఏప్రిల్ 1, 1991 నుంచి మార్చి 31, 2021 మధ్య పుట్టినవారిపై ఈ సర్వే నిర్వహించారు. టీనేజ్ సమయంలో ఒక గర్భం ఉన్నవారిలో 1.5 రెట్లు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉండగా.. రెండు లేదా అంతకంటే ఎక్కువ టీనేజ్ గర్భాలు ఉన్నవారిలో 2.1 రెట్లు అకాల మరణాలు ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇది యుక్తవయస్సులో ప్రెగ్నెంట్ అయిన వారిలో అకాల మరణ అధిక ప్రమాదాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా 16 ఏళ్లలోపు గర్భం ధరించిన వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఈ స్టడీ తెలిపింది.
యువతులలో పెరుగుతున్న మరణాల రేటు
ఇదే కాకుండా టీనేజ్ యువతులలో మరణాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా పెరుగుతున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. అనేక కారణాల వల్ల మొత్తం మరణాల రేటు పెరుగుతున్నట్లు తెలిపింది. యూనైటెడ్ స్టేట్స్లో యుక్తవయసులోని బాలికలలో మరణానికి యాక్సిడెంట్లు, ఆత్మహత్య, హత్యలు ఉంటున్నాయని తెలిపింది. 20 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల వారు క్యాన్సర్, సూసైడ్‌తో ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. యుక్తవయసులో చనిపోయే కారణాల్లో ఇదే టాప్‌లో ఉన్నట్లు JAMA చేసిన అధ్యయనంలో తేలింది.
షాకింగ్ విషయమేమిటంటే..
ఇక్కడో షాకింగ్ విషయమేమిటంటే.. సూసైడ్ చేసుకునేవారిలో కూడా టీనేజ్ ప్రెగ్నేన్సీ కారణమవుతుందని తేలింది. తల్లిదండ్రుల డివోర్స్, బాల్యంలోని అనుభవాలతో పాటు.. టీనేజ్ గర్భం కూడా ప్రధానకారణంగా ఉందట. అందుకే టీనేజ్ గర్భధారణపై యువతులతో పాటు.. కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తుంది ఈ అధ్యయనం. గర్భనిరోధక మార్గాలు, అవాంఛిత సెక్స్‌కు దూరంగా ఉండాలని.. అనుకోని పరిస్థితుల్లో గర్భం దాల్చితే వారి తోటివారు మద్ధతు ఇవ్వాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ కూడా పీడిస్తోంది..
ఏది ఏమైనప్పటికీ.. టీనేజ్ గర్భధారణను నివారణ ప్రయత్నాలలో చేర్చడం అనేది అకాల మరణాల సంఖ్యను తగ్గించడంలో సహాయం చేస్తుందా అనేది ఇప్పుడు పరిశోధకులకు ఎదురవుతున్న ప్రశ్న. బాల్య వివాహాలు, యుక్తవయసులో శృంగారం వంటి అంశాలపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలని వారు సూచిస్తున్నారు. ఇదే కాకుండా యుక్తవయసులో చేసే శృంగారం ఎక్కువగా ఉంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ వల్ల మరణాలు ఎక్కువైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయిస్తుంది. యుక్తవయసులో గర్భం, క్యాన్సర్ రెండూ కూడా యువతలపై తీవ్రమైన ప్రభావాలు చూపించడంతో పాటు.. మరణాలకు దారి తీస్తున్నాయి.