అన్వేషించండి

Dry Shampoo: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్

డ్రై షాంపూల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొత్త వాదన తెర మీదకు వచ్చింది.

డ్రై షాంపూలను వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే డ్రై షాంపుల్లో క్యాన్సర్ కారకాలైన రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల అమెరికా మార్కెట్ నుంచి వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు యూనిలీవర్ సంస్థ ప్రకటించింది. మార్కెట్లో ఆ ఉత్పత్తుల అమ్మకాలను కూడా నిలిపివేయాలని కోరింది. మన దేశంలోనే ప్రముఖ సంస్థల్లో హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి. ఇది సబ్బులు, షాంపూలు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. అయితే యూనిలీవర్ ఆపివేసిన డ్రై షాంపుల్లో ఎన్నో మనదేశంలో కూడా దొరుకుతాయి. వీటిల్లో క్యాన్సర్ కారకమైన బెంజిన్ ఉన్నట్టు చెబుతోంది ఆ సంస్థ. అయితే మన దేశంలో డ్రై షాంపులను వాడే వారి సంఖ్య చాలా తక్కువ, కాబట్టి ఇక్కడ కస్టమర్లపై పడే ప్రభావం ఏమీ ఉండదనేది ఆ సంస్థ వాదన. అయితే ఈ కామర్స్ సైట్‌ల ద్వారా కొంతమంది డ్రై షాంపూలను కొని వాడుతున్నారు. అలాంటివారు డ్రై షాంపులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. 

డ్రై షాంపూలకు, సాధారణ షాంపులకు ఉన్న తేడా ఒక్కటే. సాధారణ షాంపూలను తలపై నీళ్లు పోసుకున్నాక రాసుకుంటాం. కానీ డ్రై షాంపులను తల తడపకుండానే రాసుకుంటాం.  ఇది పొడి లేదా స్ప్రే రూపంలో ఉంటుంది.  జుట్టు నుంచి జిడ్డును తీసిపడేస్తుంది. దీనివల్ల జుట్టు ఫ్రెష్‌గా కనిపిస్తుంది. మన దగ్గర వీటి వినియోగం తక్కువగానే ఉన్నా... అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం వీటి వినియోగం చాలా ఎక్కువ. ఇందులో ఉండే బెంజిన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం.

బెంజిన్ ఒక రసాయనం అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి వాసన, రంగు వంటివి ఉండవు. బెంజిన్... హెయిర్ డైలు, రసాయనాలు, డిటర్జెంట్లు, ప్లాస్టిక్, రబ్బర్లు వంటి తయారీలో ఉపయోగిస్తారు. అయితే డ్రై షాంపూలను జుట్టుపై  స్ప్రే చేస్తారు. అలా స్ప్రే చేసినప్పుడు అది గాలిలో కలిసి శ్వాస ద్వారా మన ఊపిరితిత్తులకు చేరే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. బ్లడ్ క్యాన్సర్, బోన్ మేరో క్యాన్సర్ వంటి వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని దీర్ఘకాల వ్యాధులు కూడా రావచ్చు. అందుకే డ్రై షాంపూలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. సాధారణ షాంపూలను వాడడం వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు. జుట్టు కూడా బాగా పరిశుభ్రంగా మారుతుంది. కాబట్టి డ్రై షాంపూలు వాడేవారు, వాటిని దూరంగా ఉండటం ఉత్తమం.

Also read: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

Also read: వర్క్ ఫ్రం హోం మీకు ఎంత హాని చేస్తుందో తెలుసా? దీనివల్ల ఆరోగ్యపరంగా అంతా చెడే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget