అన్వేషించండి

Hair Regrowth Tips : మందారను మీ జుట్టుకు ఈ విధంగా అప్లై చేస్తే బట్టతల దూరమవుతుంది

Hair Care Routine : జుట్టు సంరక్షణ కోసం చాలామంది మందార పూలు, ఆకులను తమ రోటీన్​లో చేర్చుకుంటారు. అయితే మందార పూలతో కొన్ని మిక్స్ చేసి తీసుకుంటే దాని బెనిఫిట్స్ మరింత ఎక్కువ పొందవచ్చు. 

Hibiscus Benefits For Hair : మందార చెట్టు ఇంట్లో ఉంటే చాలు. దాని పూలు దేవుడి పూజకే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. దాని ఆకులు కూడా హెయిర్​ గ్రోత్​కి మంచివి. అయితే మందార పువ్వు జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. ప్రకాశవంతమైన, సిల్కీ హెయిర్​ కోసం మీరు మందార పూలను ఉపయోగించవచ్చు. బట్టతలను దూరం చేయడంలో మందార ఎంతో ఎఫిక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు. 

జుట్టు రాలిపోవడానికి వివిధ కారణాలు ఉంటాయి. మీకు జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు మీరు మీ హెయిర్​ కేర్​ రోటీన్​లో వీటిని చేర్చుకోవడం వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. బట్టతల రాకుండా, చుండ్రును దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. పొడిబారిన సమస్యను దూరం చేస్తూ.. జుట్టును డీప్ కండీషన్ చేస్తుంది. జుట్టు మెరిసిపోవడాన్ని ఆలస్యం చేస్తుంది. అయితే మందారను మీరు నేరుగా ఉపయోగించవచ్చు. కానీ వాటిని వివిధ పదార్థాలతో కలిపి అప్లై చేసినప్పుడు అది మరింత ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. ఇంతకీ మందారను ఎలాంటి పదార్థాలతో తలకు అప్లై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

పెరుగుతో కలిపి..

పెరుగుతో మందారను కలిపి తయారు చేసుకునే హెయిర్ మాస్క్ మీ జుట్టును బలంగా, మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా లోపలి నుంచి పోషణను అందిస్తుంది. ఓ మందార పువ్వు, 5 మందార ఆకులు, 5 టేబుల్ స్పూన్ల పెరుగుతో మీరు హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు. మీ జుట్టు పొడవును బట్టి వీటి కొలత మారుతుంది. ఆకులు, పువ్వులు కడిగి.. మిక్సీలో వేసుకుని పేస్ట్ చేయండి. దానిలో పెరుగు వేసి మెత్తని పేస్ట్​గా చేసుకుని హెయిర్​కి మాస్క్​గా అప్లై చేయవచ్చు. దీనిని గంటపాటు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ హెయిర్ మాస్క్​ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు. 

ఉసిరి కాయలతో..

ఉసిరి, మందార హెయిర్​ మాస్క్​ మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును బలోపేతం చేస్తుంది. మందార పువ్వులు, ఆకులును పేస్ట్ చేసి లేదా వాటిని పొడిని ఉసిరి పొడితో కలిపి.. నీరు వేసి పేస్ట్​గా చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్​ను స్కాల్ప్​ నుంచి జుట్టు వరకు బాగా అప్లై చేసి 45 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. దీనిని కూడా మీరు వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు. 

అల్లంతో.. 

అల్లం కూడా జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని మందారతో కలిపి హెయిర్​ మాస్క్​గా అప్లై చేస్తే జుట్టు రీగ్రోత్ అవుతుంది. అల్లం రసం, మందార పూల పొడిని బాగా కలిపి మెత్తని పేస్ట్​గా అప్లై చేయాలి. ఈ పేస్ట్​ని మీ స్కాల్ప్​కు అప్లై చేయండి. అరగంట అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. వారానికి రెండుసార్లు దీనిని తలకు అప్లై చేయవచ్చు. బట్టతలతో ఇబ్బంది పడేవారికి ఈ మాస్క్ మంచి ఫలితాలు ఇస్తుంది. మందార పూలను ఈ విధంగా అప్లై చేసినప్పుడు వాటిలో పోషకాలు పెరిగి జుట్టుకు మంచి ఫలితాలు అందుతాయి. 

Also Read : ఈ సమస్యను కంట్రోల్ చేస్తే జుట్టు చాలా హెల్తీగా ఉంటుందట.. మీరు ఫాలో అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget