Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్‌లా తినేశాడు
ఒక మిరపకాయ తింటేనే నోరంతా మండిపోతుంది. అలాంటిది అతడు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలను తినేశాడు. గిన్నీస్ రికార్డు బద్దలకొట్టాడు.
అది ప్రపంచంలోనే అత్యంత ఘటైన మిరపకాయ. దాన్ని ‘కరోలినా రీపర్’ అని అంటారు. ఇప్పటివరకు ఒక వ్యక్తి మాత్రమే వీటిని పచ్చిగా తినేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఆ మిరపకాయలను పచ్చిగా నమిలి తినే సాహసాన్ని చేసేందుకు మరెవ్వరూ ముందుకు రాలేదు. చాలా రోజుల తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్రెగోరీ ఫోస్టర్ అనే వ్యక్తి ఆ మిరపకాయలను తినేందుకు ముందుకొచ్చాడు. ఏకంగా మూడు కరోలిన పచ్చి మిర్చీలను కేవలం 8.72 సెకన్లలో తినేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును బద్దలకొట్టాడు. స్పైసీ ఫుడ్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. శాన్ డియాగోలోని సీపోర్ట్ షాపింగ్ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షలో ఫోస్టర్ మూడు కరోలినా రీపర్ మిరపకాయలను వేగంగా తినేశాడు. గతంలో కెనడియన్ పెప్పర్ ఫ్యాన్ మైక్ జాక్ పేరిట ఉన్న రికార్డును ఫోస్టర్ బద్దలు కొట్టాడు. జాక్ మూడు కరోలినా రీపర్‌లను 9.72 సెకన్లో తిని కొత్త రికార్డును నమోదు చేశాడు. ఫోస్టర్ కేవలం 8.72 సెకన్లలోనే ఆ మిర్చీలను తినేసి జాక్ రికార్డును బద్దలకొట్టాడు.
మొదటి ప్రయత్నంలో ఫోస్టర్ ఆరు మిరకపకాయలను చాక్లెట్ తిన్నంత సులభంగా నమిలేశాడు. అయితే అతడి నోటిలో మిరప గింజలు మిగిలి ఉండటంతో దాన్ని గిన్నీస్ రికార్డ్ సిబ్బంది పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రెండో ప్రయత్నంలో మూడు మిరపకాయలను అత్యంత వేగంగా తినేసి రికార్డుల్లో స్థానం సంపాదించాడు.
Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!
USAలోని సౌత్ కరోలినాలోని విన్‌త్రోప్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షల ప్రకారం సాధారణ మిరపకాయలతో పోల్చితే కరోలినా రీపర్ గింజల్లో సగటున 1,641,183 స్కోవిల్లే హీట్ యూనిట్లను (SHU) ఉంటాయి. కొన్ని మిర్చీ గింజల్లో సుమారు 2,500 - 8,000 SHU వరకు ఘాటు ఉంటాయని పేర్కొంది. కరోలినా రీపర్‌ను పచ్చిగా తింటే.. దాదాపు నోరు కాలిపోతున్న అనుభవం కలుగుతుంది. మరి, మీరు కూడా ఇలాంటి సాహసాన్ని చేయలని అనుకుంటున్నారా?
Also Read: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
View this post on Instagram